Search
  • Follow NativePlanet
Share
» »భూతల స్వర్గం అయిన కేరళలోని మున్నార్ ను చూశారా?

భూతల స్వర్గం అయిన కేరళలోని మున్నార్ ను చూశారా?

కేరళలో ఉన్న అత్యంత ప్రముఖమైన వేసవి-విడిది పట్టణాలలో మున్నార్ ఒకటి. పశ్చిమ కనుమల మీద ఉన్న ఇదుక్కి జిల్లాలో మున్నార్ ఉంది. 'క్వీన్ అఫ్ గాడ్స్ ఓన్ ల్యాండ్' అంటారు.

By Venkata Karunasri Nalluru

కేరళలో ఉన్న అత్యంత ప్రముఖమైన వేసవి-విడిది పట్టణాలలో మున్నార్ ఒకటి. పశ్చిమ కనుమల మీద ఉన్న ఇదుక్కి జిల్లాలో మున్నార్ ఉంది. మున్నార్ అనే పేరు మలయాళం/తమిళ పదాలు మును (మూడు) మరియు ఆరు (నది) నుండి పొందినట్టు భావించబడుతుంది. ఈ పేరు ముతిరప్పుజా, నల్లతన్ని మరియు కుండలి నదీ సంగమం వద్ద ఉన్న పట్టణపు ప్రాంతాన్ని సూచిస్తుంది. కేరళ రాష్ట్ర పర్యటనలో మున్నార్ ప్రదేశం ఒక మంచి పర్యాటక ప్రదేశం. ఇండియాలో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రదేశానికి వస్తున్నారు. మున్నార్ ని 'క్వీన్ అఫ్ గాడ్స్ ఓన్ ల్యాండ్ ' అంటారు. నిజంగానే ఈ ప్రదేశం భూతల స్వర్గమే.

కేరళకు వచ్చే ఏ పర్యాటకుడైనా సరే, మున్నార్ తప్పక చూడవలసిందే. అక్కడ కల దృశ్యాలు, వాతావరణం వారిని కట్టి పడేస్తాయి. పడమటి కనుమలలో వున్న మున్నార్ కు సరిహద్దులుగా పచ్చటి పర్వత ప్రదేశాలు, తేయాకు తోటలు కలవు. మున్నార్ కు అర్ధం చెప్పాలంటే, మూడు నదులు అని అర్ధం. అవి మధుర పూజ, నల్లతాని మరియు కుండలి. ఈ మూడు నదులు ఈ ప్రాంతం లో కలుస్తాయి. కేరళ లోని ఇడుక్కి జిల్లాలో మున్నార్ ప్రధాన పర్యాటక ప్రదేశం. మున్నార్ ను పూర్తిగా చూసే సమయం లేదనుకుంటే, ఇక్కడ మేము అందిస్తున్న ప్రదేశాలను మాత్రం తప్పక చూడండి.

సమీప రైల్వేస్టేషను ఎర్నాకుళం మరియు అలువాలో ఉంది (దాదాపు 110కిమీ దూరం రోడ్డు రహదారిలో ఉంది).
105కిమీ దూరంలో ఉన్న కొచిన్ అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి సమీపంలో ఉన్న విమానాశ్రయం.

కేరళలోని మున్నార్ లో చూడవలసిన ప్రదేశాలు

1. ఫోటో పాయింట్

1. ఫోటో పాయింట్

మున్నార్ నుండి 3 కి. మీ. ల దూరంలో వున్న ఫోటో పాయింట్ లో మీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టముంటే ఈ ప్రదేశంలో వున్న అడవులు, మరియు నీటి ప్రవాహాలు, జలపాతాలను మీ కెమేరాలో బందించవచ్చును. ఈ ప్రదేశం మట్టుపెట్టికి వెళ్ళే మార్గంలో కలదు. పచ్చటి అడవులు, గల గల పారే ప్రవాహాలు, పచ్చటి కొండలు వంటివి ఎన్నో ప్రదేశాలు చూడవచ్చు.

2. ఎకో పాయింట్

2. ఎకో పాయింట్

మున్నార్ నుండి 15 కి. మీ.ల దూరంలో వున్న ఎకో పాయింట్ కొన్ని కొండల మధ్య వున్న చిన్న ప్రదేశం. సహజమైన ఈ ప్రతిధ్వని ప్రదేశం మీరు ఎంత బిగ్గరగా అరిస్తే అదే రీతిలో మరల సౌండ్ అలలతో మీ వద్దకు వచ్చి వినపడుతుంది. ఆసక్తి కల యువత గ్రూప్ లు గా ఈ ఎకో పాయింట్ కు వచ్చి రకరకాల ధ్వనులు చేసి ఆనందస్తారు.

3. ఏనుగుల ప్రదేశం

3. ఏనుగుల ప్రదేశం

మున్నార్ నుండి 18 కి. మీ.ల దూరంలో వున్న ఈ ప్రదేశంలో మీరు ఏనుగుపై సవారి చేయవచ్చు. దానితో పాటు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసే మున్నార్ కొండలు, టీ తోటలు కూడా చూసి ఆనందించవచ్చు. పచ్చటి మైదానాలలో నడిచి ఆనందించవచ్చు.

pc:Jinomunnar

4. ఎరావికులం నేషనల్ పార్క్

4. ఎరావికులం నేషనల్ పార్క్

ఇక్కడ సుమారు 26 రకాల వన్య జంతువులను, 132 రకాల పక్షులను చూడవచ్చు. అంతేకాకుండా ఎరావికులం నేషనల్ పార్క్ లో మీరు నేడు కనుమరుగు అవుతున్న నీలగిరి తార జింకలను చూడవచ్చు.

5. ఎరావికులం నేషనల్ పార్క్ చూచుటకు అనుకూల సమయం

5. ఎరావికులం నేషనల్ పార్క్ చూచుటకు అనుకూల సమయం

జనవరి - ఫిబ్రవరి నెలలు సందర్శనకు పార్క్ లోపలికి అనుమతించరు. వర్షాకాలంలో వన్య జీవులకు సంతానోత్పత్తి సమయం. కనుక ఈ సమయంలో నేషనల్ పార్క్ యాజమాన్యం సందర్శకులను పార్క్ లోపలికి అనుమతించరు.

6. రాజమల

6. రాజమల

ఎరావికులం నేషనల్ పార్క్ సమీపంలో వున్న రాజమలలో నీలగిరి థార్ జింకలను చూడవచ్చును.

7. హనీ మూన్ జంటలకు ఇది ఒక మంచి ప్రదేశం

7. హనీ మూన్ జంటలకు ఇది ఒక మంచి ప్రదేశం

రాజమలకు చుట్టూ పచ్చటి పర్వత శ్రేణులు ఎత్తుగా వుండి ప్రకృతి ప్రియులను రంజింప చేస్తుంది. హనీ మూన్ జంటలకు ఇది ఒక మంచి ప్రదేశం. ఫ్యామిలీ ట్రిప్ లు, విద్యార్ధుల ఎక్స్ కర్షన్ లకు కూడా బాగుంటుంది. సాహస ప్రియులకు ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయవచ్చును.

8. ఎకో పాయింట్

8. ఎకో పాయింట్

మున్నార్ లో ఎకో పాయింట్ ఒక విశిష్టమైన పర్యాటక ఆకర్షణ. ఈ ప్రదేశం మున్నార్ కు 13 కి. మీ. ల దూరంలో కలదు. ఇది ఒక నది ఒడ్డున కలదు. ఇక్కడ మీరు చప్పట్లు చరిస్తే వాటి ప్రతి ధ్వని ఎంతో బాగా వినిపిస్తుంది.

Photo Courtesy: Vinayaraj

9. అనయరంకాల్

9. అనయరంకాల్

అనయరంకాల్ ప్రదేశం మున్నార్ నుండి 22 కి. మీ. ల దూరంలో కలదు. ఇక్కడ ఒక ప్రసిద్ధ డాం, సరస్సు, పచ్చటి తేయాకు తోటలు వుంటాయి.

Photo Courtesy: Rameshng

10. ఏనుగుల గుంపులు

10. ఏనుగుల గుంపులు

అనయరంకాల్ లో మీరు అందమైన ఏనుగుల గుంపులు చూడవచ్చు. అవి సమీప సరస్సులో నీటిని తాగుతూ వుంటాయి.

Photo Courtesy: Rameshng

11. అనరయన్కాల్ డ్యాం

11. అనరయన్కాల్ డ్యాం

అనరయన్కాల్ డ్యాం చుట్టూ దట్టమైన అడవులు, తేయాకు తోటలు కలవు. చక్కటి ప్రకృతి దృశ్యాలు, ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు. తేయాకు తోటల నుండి వచ్చే సువాసనలు ఈ ప్రదేశ అందాలతో బాటు మీకు మరింత ఆనందం కలిగిస్తాయి.

Photo Courtesy: Rameshng

12. మున్నార్ సందర్శన

12. మున్నార్ సందర్శన

కేరళలోని ప్రధాన నగరాలనుండి మరియు తమిళనాడులోని ప్రధాన ప్రదేశాల నుండి మున్నార్ కు ప్రైవేటు బస్సులు ఇతర రోడ్డు రవాణా సౌకర్యాలు కలవు. మున్నార్ సందర్శనకు సంవత్సరంలో ఎప్పుడైనా పర్యటించవచ్చు.

Photo Courtesy: Kerala Tourism

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+