Search
  • Follow NativePlanet
Share
» »ఈ సెలవుల్లో హైద‌రాబాద్‌కు స‌మీపంలోని రాచ‌కొండ‌కు ప్లాన్‌చేయండి..!

ఈ సెలవుల్లో హైద‌రాబాద్‌కు స‌మీపంలోని రాచ‌కొండ‌కు ప్లాన్‌చేయండి..!

ఈ హాలీడేస్‌లో కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు క‌లిసి స‌రాదాగా గ‌డ‌పాల‌నుకుంటున్నారా? అయితే, హైదార‌బాద్‌కు స‌మీపంలోనే అత్యంత పురాత‌న‌మైన చారిత్రాత్మ‌క‌మైన కోట ఒక‌టి ఉంది. ఈ కోట రాచకొండ‌. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాలు ఎన్నో దాగి ఉన్నాయి. అత్యంత పురాతన కోట‌లు, చారిత్ర‌క క‌ట్ట‌డాలు, సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక‌టి రాచ‌కోండ ఫోర్ట్‌. ఆ పురాత‌న కోట విశేషాలేంటో తెలుసుకుందాం.

రాచకొండ కోట‌పై చూస్తే క‌నుచూపుమేర ప్ర‌కృతి అందాల‌ను ప‌ర్యాట‌కులను మైమరింప‌జేస్తాయి. ఇక్కడి చుట్టుపక్క‌లా గ్రామాలు ప‌చ్చని పంట పొలాల‌తో నిండి ఉంటాయి. ఇక అతిపురాత‌న దేవాల‌యాలు కూడా ఉన్నాయి. అలనాటి వార‌స‌త్వ సంప‌ద‌ను కూడా ఇక్క‌డ చూడొచ్చు. ఇక్క‌డికి సమీపంలోనే మెట్ల బావి కూడా ఉంది. ఈ మెట్ల బావిని ప్రభుత్వం పూర్తిగా పునరుద్ధరించింది కూడా. ఈ హాలీడేస్‌లో త‌ప్ప‌కుండా రాచ‌కొండ ట్రిప్‌ను ప్లాన్ చేయండి. ఇక్క‌డి చారిత్రాత్మ‌కమైన విష‌యాల‌ను తెలుసుకోండి.

rachakonda

సుమారు ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో కోట‌..

ఈ కోట రాజులు పాలించిన ప్రాంతం. కాకయతీ సామ్రాజ్య సామంత రాజులుగా ఉన్న రేచంర్ల వంశస్తుల పాలన కేంద్రం ఈ రాచ‌కొండ‌. ఈ కోట‌కు ఎంతో ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది. ఇది శుత్ర దుర్భేద్యంగా నిర్మించిన కోట. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఈ ప్ర‌దేశం ఓ గొప్ప ప‌ర్యాట‌క కేంద్రంగా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కోట అభివృద్ధికి చర్యలను చేపట్టింది. ఈ కోట హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్క‌డ ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. ఈ కోట‌ సుమారు ఆరు వేల ఎకరాలు విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ కోట గుట్ట‌ల‌పై నుంచి ఎటు చూసినా ప‌చ్చ‌ని ప్ర‌కృతి గీసిన అద్భుత దృశ్యాలు ప‌ర్యాట‌కుల‌ను క‌నువిందు చేస్తుంటాయి.

ఈ రాచకొండ గుట్టలు ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని సంస్థాన్ నారాయణపురం మండలంలో ఉంటాయి. ఈ ప్ర‌దేశానికి చేరుకోగాల‌నే ముందుగా కోట ఎంట్రెన్స్ ఉంటుంది. ఇది చూడ్డానికి ఎంతో భ‌యాకంగా, గంభీరంగా క‌నిపిస్తోంది. ఈ ప్రవేశం గుండానే కోట లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కోట కింద భాగంగా ఓ ఆల‌యం ఉంటుంది. ఇక్కడ ఒక బావి ఉంటుంది. రాచకొండ చుట్టూ ప్రాకారం ఉంటుంది. కోటపైకి వెళ్లే మార్గంలో కొన్ని ద్వారాలు క‌ల‌వు. దాదాపు 5 నుంచి 6 ద్వారాలు ఉంటాయి. వీట‌న్నింటిని దాటుకుంటూ కోటపైకి వెళ్తాం. ఇక ఈ కోట‌ గుట్టపైన మండపాలు, రాజప్రాసాదాలు, జలాశయాలు కూడా ఉంటాయి. రాచకొండ కోట సమీపంలోనే సంకెళ్ల బావి కూడా ఉంటుంది. రాచకొండ వైభవాన్ని చాటి చెప్పే విధంగా ఇక్క‌డ ప్ర‌తిఏటా రాచకొండ ఉత్సవాలను నిర్వ‌హిస్తారు. ప్రతి ఏడాది మూడు రోజులపాటు వీటిని నిర్వహిస్తారు. ఇక రాచకొండ ప్రాంతంలో అతిపెద్ద శివలింగం ఒక‌టి ఈ మ‌ధ్య‌కాలంలోనే బయటపడింది. ఈ శివలింగాన్ని ద‌ర్శించుకునేందుకు చాలామంది భ‌క్తులు ఇక్క‌డికి వ‌స్తుంటారు.

rachakonda fort

ఎలా చేరుకోవాలి...?

హైద‌రాబాద్ న‌గ‌రానికి అన్ని ప‌ట్టణాల నుంచి బ‌స్సులు, రైళ్లు నిత్యం అందుబాటులో ఉం హైద‌రాబాద్‌లోని
ఎల్బీ నగర్ నుంచి రెండు విధాలుగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లి అక్కడ్నుంచి మంచాల మీదుగా రాచ‌కొండ‌ కోటకు చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ నుంచి చౌటుప్పల్ కు చేరుకొని అక్కడ్నుంచి నేరుగా నారాయణపురం నుంచి ఈ కోట‌కు వెళ్లొచ్చు. మ‌రెందుకాల‌స్యం మీ రాచ‌కొండ ప్రయాణాన్ని మొద‌లుపెట్టండి మ‌రీ..

More News

Read more about: rachakonda hyderabad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+