Search
  • Follow NativePlanet
Share
» »పుదుచ్చేరి ... అనుభూతి కలిగించే సందర్శన !!

పుదుచ్చేరి ... అనుభూతి కలిగించే సందర్శన !!

రెండు దేశాల సంస్కృతులు కలగలిసిన ఒక విలక్షణమైన ప్రదేశమే ఇది... ఒకప్పుడు ఫ్రెంచ్‌ ప్రజలు ఉన్న ఈ ప్రదేశం నేడు లిటిల్‌ ఫ్రాన్సు గా పిలవబడుతుంది. భారతదేశంలో అంతర్భాగమైనప్పటికీ ఆ గత చిహ్నాలతో అలరించే అందమైన ప్రాంతంగా, చదువుల కాణాచిగా, ఆధ్యాత్మికవాదుల మజిలీగా, ప్రకృతి ప్రేమికులకు విహార కేంద్రంగా భూలోకపు స్వర్గాన్ని తలపిస్తున్న ఈ అద్భుత ప్రదేశం పేరే పాండిచ్చేరి.
ఇకపోతే పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి అంటే.. ‘పుదు' అంటే ‘కొత్త' అనీ, ‘చేరి' అంటే ‘ఊరు' అంటే కొత్త ఊరు అని అర్థం వస్తుంది. దీనికి సమీపమైన ఫ్రెంచి ఉచ్ఛారణ ప్రకారం దీన్ని ఫ్రెంచివాళ్లు పాండిచ్చేరి అని పిలిచేవారు. ఎప్పుడో పొరపాటున ఇంగ్లీషులో ‘యు' బదులు ‘ఎన్‌' అని రాయటంవల్ల ఇది ఆంగ్లంలో పాండిచేరి అని పిలవటం మొదలయ్యింది. తరువాత అదే పాండిచ్చేరిగా స్థిరపడిపోయింది.
ఒక విభిన్న పర్యాటక అనుభవాన్ని కోరుకొనే ప్రయాణీకునికి పాండిచ్చేరి ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఈ నగరంలో విరామ సమయ౦ నష్టం కాకుండా,అనుభూతిని కల్గించి సందర్శకులలో శక్తిని నింపే ప్రోమనేడ్ బీచ్, పారడైస్ బీచ్, సేరెనిటి బీచ్, ఆరొవిల్లె బీచ్ వంటి నాలుగు చక్కటి తీరాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని మరొక ముఖ్య ఆకర్షణ శ్రీ అరబిందో ఆశ్రమం, భారతదేశంలోని ఉత్తమ ఆశ్రమమే కాక , ధ్యాన కేంద్రాలలో ప్రముఖమైనది.
పాండిచేరి సందర్శనకు ఉత్తమ సమయం ప్రత్యేకమైన సాంస్కృతిక లక్షణాలతో, అద్భుతమైన వివిధ రుచులతో, విస్తారమైన పరిధిలో ఉన్న చూడచక్కని ప్రదేశాలతో పాండిచేరి పర్యాటకులకు ఒక వాస్తవమైన విభిన్న ప్రయాణ అనుభూతిని కల్గిస్తుంది.

ప్రోమనేడ్ బీచ్

ప్రోమనేడ్ బీచ్

ప్రోమనేడ్ బీచ్ గా పేరొందిన పుదుచ్చెరి బీచ్ పాండిచ్చేరి లో ఒకప్పటి ప్రధాన ఆకర్షణ. అరియంకుప్పం వద్ద ఒక కొత్త ఓడరేవు నిర్మాణం వలన సముద్రం కోతకు గురికావడం ఈ అందమైన బీచ్ కు ప్రాణా౦తకంగా పరిణమించింది. ఇప్పుడు ప్రోమనేడ్ లో మిగిలినది అంతా నడకకు లేదా ఈత కోసం పనికి రాకుండా ఉన్న పగిలిన రాళ్ళ గుట్ట, బండరాళ్ల సముద్ర గోడ.

Photo Courtesy: NDSRAM

ఆరోవిల్లె బీచ్

ఆరోవిల్లె బీచ్

ఆరోవిల్లె బీచ్ ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. ఈ ప్రాంతం ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధ వనరు. ఈ ప్రాంతం ఒక పర్యాటక ప్రదేశంగా పరిఢవిల్లుతుంది. ఇక్కడ వీచే చల్లటి గాలి ప్రకృతి ప్రియులను ఆహ్లాదపరుస్తుంది. ఇది ఒక టూరిజం కేంద్రంగా మారింది ఇక్కడ సినిమా షూటింగులు, ఫోటో కవరేజిలు, వీడియో కవరేజిలు జరుగుతాయి కనుక ఇది వ్యాపారకేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది.

Photo Courtesy: charlotte.warren

బొటానికల్‌ గార్డెన్‌

బొటానికల్‌ గార్డెన్‌

దీన్ని ఐలాండ్‌ ఆఫ్‌ పీస్‌ అని అనవచ్చు. 22 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ బొటానికల్‌ గార్డెన్‌ ప్రశాంతతకు, పచ్చదనానికి చిహ్నమని చెప్పవచ్చు. ఇక్కడ డబ్బు ఖర్చుపెట్టకుండా గంటలు గంటలు అలా సరదాగా గడిపేయవచ్చు. భారతదేశంలోని పూల మొక్కలే కాకుండా, విదేశాల నుంచి తెచ్చిన ఎన్నో రకాల పూల మొక్కలను ఇక్కడ చూడవచ్చు.ఈ బొటానికల్‌ గార్డెన్‌లో ఓ ఆక్వేరియం కూడా ఉంది. అందులోని రేర్‌ ఆర్నమెంటల్‌ చేపలు భలే అందంగా అలరిస్తుంటాయి. పాండిచ్చేరికి వెళ్లేవారు ఈ గార్డెన్‌ను మిస్‌ అవకపోతే మంచిది. ఇక మరో చెప్పుకోదగ్గ ప్రాంతం పాండిచ్చేరి మ్యూజియం. భారతి పార్కులోగల ఈ మ్యూజియంలోని శిల్ప సంపద ఒకదాన్ని మించి మరొకటి మనల్ని కట్టిపడేస్తుంది.పాండిచ్చేరికి వెళ్లేవారు ఈ గార్డెన్‌ను మిస్‌ అవకపోతే మంచిది.

Photo Courtesy: Prabhupuducherry

సెరినిటీ బీచ్‌

సెరినిటీ బీచ్‌

ఒకటిన్నర కిలోమీటర్లు పొడవుండే ఈ బీచ్‌ సౌందర్యం మాటల్లో చెప్పలేనిది. బే ఆఫ్‌ బెంగాల్‌ నుంచి వచ్చే ఆహ్లాదకరమైన గాలిని ప్రతి ఒక్కరూ స్వానుభవంగా తెలుసుకోవాల్సిందే. ఈ సెరినిటీ బీచ్‌లో ఉన్న రెండు చారిత్రక కట్టడాల గురించి చెప్పుకోవాల్సిందే. అందులో ఒకటి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం, మరొకటి యుద్ధ స్మారక చిహ్నం.

Photo Courtesy: Aravindaraja

లైట్‌ హౌస్‌

లైట్‌ హౌస్‌

దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, ఇది 150 సంవత్సరాల క్రితం కట్టబడిందంటే మనం నమ్మలేం కాబట్టి. పాండిచ్చేరి స్పెషాలిటీ ఒక్క బీచ్‌ మాత్రమే కాదు.. భారతదేశంలో ఉన్న అనేక చారిత్రక కట్టడాలలో ఇది ఒకటి.

Photo Courtesy: Karthik Easvur

అరబిందో ఆశ్రమం

అరబిందో ఆశ్రమం

అరబిందో ఆశ్రమాన్ని బ్రిటిష్ వారి అణచివేతను తప్పించుకోవడానికి పాండిచేరి వచ్చిన శ్రీ అరబిందో ఘోష్ 1926 లో స్థాపించారు. ఈ ఆశ్రమాన్ని " ది మదర్" గా పిలిచే మీరా అల్ఫస్సా నవంబర్ 24, 1926 నుండి ఆవిడ మరణం వరకు ముఖ్యులుగా ఉండేవారు. 1950 లో శ్రీ అరొబిందో మరణం తర్వాత ఏర్పాటు చేసిన శ్రీ అరొబిందో ఆశ్రమ ట్రస్టు కు కూడా ఆవిడ ముఖ్యురాలుగా ఉన్నారు.మూడు సంవత్సరాలలోపు పిల్లలను ఆశ్రమం లోనికి అనుమతించక పోవడమే కాక, ఆశ్రమ నిర్వాహకుల నుండి ప్రత్యేక అనుమతి ఉంటేనే ఫోటోలను కూడా తీసుకోవడానికి వీలవుతుంది. ఆశ్రమాన్ని సామాన్య ప్రజల సందర్శనార్ధం ఉదయం 8 గంటల నుండి 12 మధ్యాహ్నం వరకు తిరిగి 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు.

Photo Courtesy: Aravind Sivaraj

జోసెఫ్ ఫ్రాంకోయిస్ డుప్లెక్సు విగ్రహం

జోసెఫ్ ఫ్రాంకోయిస్ డుప్లెక్సు విగ్రహం

పాండిచేరి కు గవర్నర్ గా 1742 నుండి 1754 వరకు పనిచేసిన జోసెఫ్ ఫ్రాంకోయిస్ డుప్లెక్సు విగ్రహం బీచ్ రోడ్డులో ఉంది. ఇది పాండిచేరి లోని పిల్లల పార్కు లోపల ఉంది. 2.88 మీటర్ల ఎత్తైన ఈ విగ్రహం పార్కు లోని దక్షిణపు వైపున ఉంది. అతని సేవలను అధికారికంగా గుర్తించిన ఫ్రెంచి ప్రభుత్వం 1870 లో దీనిని నెలకొల్పింది. ఫ్రెంచి సామ్రాజ్యంలో ఒక అంతర్గత భాగమైన ఈ దివంగత గవర్నర్ భారతదేశంలో ఫ్రెంచి పాలనను స్థాపించడానికి ఎంతగానో కృషి చేయడమే కాక యోగ్యపాలకునిగా కూడా ప్రసిద్ధి చెందాడు. పాండిచేరి సందర్శించే వారికి ఈ విగ్రహం, ఇది ఉన్న పిల్లల పార్కు తప్పనిసరిగా చూడవలసినదిగా సూచించబడింది.

Photo Courtesy: Sandip Bhattacharya

మాహి బీచ్

మాహి బీచ్

మాహి అనేది ఒక చిన్న టౌన్ మరియు ఇది కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని ఒక భాగము. ఈ మాహి బీచ్ అనేది ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోని ఉన్నది. ఈ టౌన్ కి మూడువైపుల కన్నూర్ జిల్లా, ఒకవైపు కాలికాట్ జిల్లా సరిహద్దులుగా కలిగి ఉంది. ఇది ఒక అందమైన పర్యాటక కేంద్రం. ఇక్కడ పర్యాటకులు ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఈ ప్రదేశం లో సూర్యోదయం, సూర్యాస్తమం చూడముచ్చటగా ఉంటుంది. పర్యాటకులను ఎక్కువ సంఖ్యలో ఆకర్షించడానికి కారణం ఇక్కడున్న ప్రకృతి అందాలే!

Photo Courtesy: Chandana12

షాపింగ్ అనుభవాలు

షాపింగ్ అనుభవాలు

ఈ నగరంలోని వీధులు, అంగళ్లు షాపింగ్ అంటే ఇష్టపడే వారికి స్వర్గంలా ఉంటాయి. హస్తకళలు, వస్త్రాలు, రాళ్ళు, చెక్క శిల్పాలు, చాపలు, కుండలు, పరిమళాలు, అగరులు, అద్దపు పనులు, దీపాలు, కొవ్వతులు నగరంలో షికారు చేసే వారికి ఒక అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని ఇస్తాయి.
డిసెంబర్ లో జరిగే అంతర్జాతీయ యోగా ఉత్సవం, ఆగష్టు లో జరిగే ఫ్రెంచి ఆహార ఉత్సవం, జనవరిలో జరిగే షాపింగ్ ఉత్సవం ఇక్కడ తరుచుగా జరిగే ఉత్సవాలలో కొన్ని.

Photo Courtesy: McKay Savage

భోజన ప్రియులు

భోజన ప్రియులు

ఫ్రెంచి, తమిళ సంస్కృతుల ప్రభావాలతో నిండిన పాండిచ్చేరి, భోజన ప్రియుల కోసం అద్భుతమైన వంటకాలను అందిస్తుంది. పర్యాటకులు ఫ్రెంచి బగేట్స్, బ్రియోచేస్, పేస్ట్రీలు వంటి అసలైన ఫ్రెంచి వంటకాలతో బాటుగా సంప్రదాయ తమిళ, కేరళ వంటకాలను కూడా రుచి చూడవచ్చు. లి క్లబ్, బ్లూ డ్రాగన్, స్టాట్ సంగ, రెండేజ్వాస్, సీ గల్స్, లే కెఫే, లా కోరోమండలే, లా టేరస్సె శ్రేష్ఠమైన భోజన అనుభవం కోసం సిఫార్సు చేసిన కొన్ని స్థలాలు.

Photo Courtesy: Sandip Bhattacharya

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

విమానంలో అయితే పాండిచ్చేరికి 135 కిలోమీటర్ల దూరంలో చెన్నయ్‌ ఎయిర్‌పోర్టు ఉంది. ఇక్కడ దిగి విల్లుపురం రైల్‌ జంక్షన్‌ మీదుగా పాండిచ్చేరి చేరవచ్చు . పాండిచ్చేరికి సమీపంలో విల్లుపురం, మధురై, త్రివేండ్రం... రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. ఈ మూడింటిలో ఎక్కడ దిగినా రోడ్డు మార్గంలో సులభంగా పాండిచ్చేరి చేరవచ్చు.

Photo Courtesy: Moshikiran

సందర్శంచు కాలం

సందర్శంచు కాలం

నవంబర్‌ జనవరి మధ్య, వర్షాకాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే భలే మజాగా ఉంటుంది.

Photo Courtesy: Sandip Bhattacharya

వసతి

వసతి

బడ్జెట్‌ హోటళ్లలో అయితే రోజుకు 600 రూపాయల అద్దెతో గదులు అందుబాటులో ఉంటాయి. స్డాండర్టు హోటళ్లలో అయితే రోజుకు 2000-3000 రూపాయల అద్దెతో లభిస్తాయి.అదే లగ్జరీ హోటళ్లలో అయితే రోజుకు దాదాపు 5 వేల రూపాయల నుంచి గదులు లభిస్తాయి.

Photo Courtesy: Sandip Bhattacharya

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+