Search
  • Follow NativePlanet
Share
» »Zero music Festival: జీరో మ్యూజిక్ ఫెస్టివ‌ల్ చూసేందుకు సిద్ధంగా ఉన్నారా?

Zero music Festival: జీరో మ్యూజిక్ ఫెస్టివ‌ల్ చూసేందుకు సిద్ధంగా ఉన్నారా?

జీరో మ్యూజిక్ ఫెస్టివ‌ల్ చూసేందుకు సిద్ధంగా ఉన్నారా?

వ‌రుస‌గా సెల‌వులు వ‌స్తే ఏ ఉద్యోగి అయినా ఏం చేస్తాడు. ఇంట్లో ఖాళీగా కూర్చుంటాడు అనుకుంటున్నారా? లేదండి..సెల‌వులు అన‌గానే ఎక్క‌డికైనా ప‌ర్య‌టించాలానే ఆలోచ‌న టక్కున వ‌చ్చేస్తుంది. అక్టోబర్ 2న అంటే గాంధీ జయంతి జాతీయ సెలవుదినం. సెప్టెంబర్ చివరి శనివారం, ఆదివారం, అక్టోబర్ 1ని సెలవు దినంగా తీసుకుంటే లాంగ్ వీకెండ్ వ‌స్తోంది. ఈ సెల‌వు దినాల్లో ఇంట్లో కూర్చుని స‌మ‌యం వృధా చేయ‌కుండా ఎక్క‌డికైనా వెళ్లాల‌నుకునే వారు త‌ప్ప‌కుండా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ను సంద‌ర్శించేలా ప్లాన్ చేసుకోండి.

ఎందుకంటే, ఇక్క‌డి ప్ర‌కృతి అందాల‌ను వీక్షించ‌డంతో పాటు ప్ర‌తి ఏటా జ‌రిగే జీరో మ్యూజిక్ ఫెస్టివల్‌ను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్క‌డి అద్భుతమైన దృశ్యాలు, మనోహరమైన గ్రామాలు, నదులు, వరి పొలాలు, ప్రకృతి దృశ్యాలు జిరో వ్యాలీ అందాన్ని మ‌రింత రెట్టింపు చేస్తాయి. ఇటీవ‌లే ఈ ప్రాంతం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశ జాబితాలో చేర్చ‌బ‌డింది. రండి ఇక్క‌డ జ‌రిగే జీరో మ్యూజిక్ ఫెస్టివ‌ల్ గురించి తెలుసుకుందాం.

Zero music festival

జీరో మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌

అరుణాచల్ ప్రదేశ్‌కు అక్టోబ‌ర్ మాసంలో పెద్ద ఎత్తున ప‌ర్యాట‌కులు బారులు తీరుతారు. ఎందుకంటే, ఈ స‌మ‌యంలో ఇక్క‌డ జిరో వ్యాలీలో జీరో మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ నిర్వహించబడుతుంది. ఇది అద్భుతమైన అందానికి ప్రసిద్ధి చెందింది. ఈ లోయ దిగువ సుబంసిరి జిల్లాలో ఉంది. జీరో వ్యాలీ సముద్ర మట్టానికి 5500 అడుగుల ఎత్తులో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ పచ్చని లోయ ఒడిలో అత్యంత వైభ‌వంగా జరుగుతున్న సంగీత ఉత్సవం ఇది. జిరో మ్యూజిక్ ఫెస్టివల్ భారతదేశంలోని స్వతంత్ర కళాకారుల ప్రతిభను ప్రదర్శించే బహిరంగ సంగీత ఉత్సవం. ఈ ఉత్సవం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన సంగీత ప్రతిభను, విభిన్న ప్రేక్షకులను ఒకచోట చేరుస్తుంది. జిరో మ్యూజిక్ ఫెస్టివల్ అనేది శక్తివంతమైన సంస్కృతి, సంగీతం మరియు కళల సమ్మేళనం. దీనిని 2012లో ప్రారంభించారు.

జీరో మ్యూజిక్ ఫెస్టివల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

జీరో మ్యూజిక్ ఫెస్టివల్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 నుండి ప్రారంభమవుతుంది. ఇది చాలా ప్రసిద్ధ పండుగ. ఈ పండుగను చూసేందుకు భార‌తీయులే కాకుండా విదేశీ ప‌ర్యాట‌కులు సైతం వ‌స్తుంటారు. మీరు కూడా ఈ ఫెస్టివల్‌లో భాగం కావాలనుకుంటే మాత్రం ఇందులో పాల్గొనేందుకు ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు లోపలికి వెళ్లేందుకు ప్రవేశం లభిస్తుంది. ఈ పండుగ 4 రోజుల పాటు జరుగుతుంది. సెప్టెంబరు 28 నుంచి ప్రారంభమయ్యే ఈ పండుగ అక్టోబర్ 1న ముగుస్తుంది.

Zero music festival function

అపాటాని తెగ‌కు నిలయం..

జీరో వ్యాలీ అపాటాని తెగకు నిలయం. అపాటాని తెగ ఆతిథ్యం, సంగీతం పట్ల వారి ప్రేమకు ప్రసిద్ధి చెందింది. ఈ పండుగ దేశంలోని సుదూర ప్రాంతాల నుండి సంగీత ప్రియులను ఆకర్షిస్తుంది. ఇది ఎంతో శ‌క్తితో, ఉత్సాహంతో జరుపుకునే బహిరంగ పండుగ. లీ రనాల్డో, స్టీవ్ షెల్లీ, లౌ మాజా, షైర్ ఎన్ ఫంక్, ఇండస్ క్రీడ్, పీటర్ క్యాట్ రికార్డింగ్ కో, మెన్‌హోపాజ్, గురు రెవ్‌బెన్ మషాంగ్వా, బార్మర్ బాయ్స్ వంటి జాతీయ, అంతర్జాతీయ కళాకారులు కూడా ఈ ఉత్సవంలో భాగమవుతారు. నాలుగు రోజుల పాటు జ‌రిగే ఈ ఉత్స‌వంలో అద్భుతమైన సంగీతంతో పాటు రుచిక‌ర‌మైన విందులు కూడా ఉంటాయి.

ఎలా చేరుకోవాలి..

జీరో వ్యాలీని చేరుకోవాలంటే అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ నుంచి అన్ని ర‌వాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. జిరో వ్యాలీకి గౌహతి, ఇటానగర్, ఉత్తర లఖింపూర్ నుండి నేరుగా బస్సులు క‌ల‌వు. గౌహతి నుండి జిరోకి టాక్సీని కూడా బుక్ చేసుకుని వెళ్లొచ్చు. దీనికి దాదాపు 7 గంటల సమయం పడుతుంది.

More News

    Read more about: zero valley arunachal pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+