Search
  • Follow NativePlanet
Share
» »టాప్ రిసార్ట్స్ లో ప్యూర్ రొమాన్స్ !

టాప్ రిసార్ట్స్ లో ప్యూర్ రొమాన్స్ !

రొమాన్స్ అంటే మీరు ఏమి అర్ధం చెపుతారు ? ప్రకృతి పులకింత లా ? కేండల్ లైట్ డిన్నర్లా ? బీచ్ లో కలసి నడవటమా ? ఎవరూ లేని చోట రిలాక్స్ అయి హ్యాపీ గా గడిపెయటమా ? మీరు ఏ వయసు వారైనా సరే, ప్రేమకు వయసుతో నిమిత్తం లేదు. మీ జీవిత ప్రయాణంలో చక్కని పరిసరాలతో ఆనందించేయటమే, భాగస్వామితో మధుర క్షణాలు పంచుకోనటమే. అందుకు గాను ఇండియా లోని కొన్ని బెస్ట్ రిసార్ట్ లను సూచిస్తున్నాం చూడండి ఇండియా లోని ఈ ఉత్తమ రిసార్ట్ లు జీవితంలో మీకు కావలసిన అపురూప అనుభూతులను అందిస్తాయి.
ఇండియా లోని ఉత్తమ రిసార్ట్ లు

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

నీటిలో తేలే తెల్లటి తాజ్ లేక్ పాలస్ ఒక మరువలేని అనుభూతి. జంటల జీవిత కాల మొదటి సమయంలో ఇక్కడ గడిపే క్షణాలు మిమ్మల్ని జీవితాంతం మరచిపోలేనివిగా చేస్తాయి. ఉదయపూర్ లోని తాజ్ లేక్ పాలస్ రిసార్ట్ అందాలు మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఈ లేక్ పాలస్ వెనుక కల ఆరావళి పర్వత శ్రేణుల దృశ్యం అతి మనోహరంగా వుంటుంది. మీరు అక్కడ అడుగు పెట్టటం ఆలస్యం ఇక్కడి అందాలతో మీ మూడ్ మార్చి ముద్దులతో ముంచేస్తుంది. లేక్ పాలస్ రిసార్ట్ హుందా అయిన ఒక రాజ భవనాన్ని గుర్తు చేస్తుంది.

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

కుమరకోమ్ లేక్ పాలస్ లో ఒకప్పుడు ఇంగ్లాండ్ రాజ వంశానికి చెందిన ప్రిన్సు చార్లెస్ అఫ్ వేల్స్ తన 65 వ జన్మదినోత్సవం జరుపుకున్నాడు. మీ రొమాన్స్ ను రాచ దర్పంతో జరుపుకోవాలంటే, ఈ రిసార్ట్ ఎంతో బాగుంటుంది. అందరూ మెచ్చే అతి సుందర పర్యాటక రాష్ట్రం కేరళలో కుమరకోమ్ లేక్ పాలస్ కలదు. వెంబనాడ్ సరస్సు ఒడ్డున కల ఈ పాలస్ ఒక అయిదు నక్షత్రాల రిసార్ట్ గా గుర్తింపు పొందినది. ఈ సరస్సు పూర్తి ప్రశాంతతతో పచ్చని బ్యాక్ వాటర్స్ అందాలు కలిగి వుంటుంది. మీ యొక్క రొమాన్స్ క్షణాలకు అర్ధం చెపుతుంది.

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

సెరాయ్ రిసార్ట్ లో మీరు ఆనందించ దగిన మధుర క్షణాలు పూర్తిగా రాజకుమారుడి కదల వలే వుంటాయి. అక్కడ కల ఆకర్షణీయ మర్రి చెట్టు కింద, లేదా మీరు తీసుకున్న సరస్సు పక్కన కల విల్లా భవన ప్రాంగణలో రాత్రి విందులో కేండిల్స్ వెలిగిపోతూ వుంటాయి. చల్లని నీరు మీ పాదాలను స్పర్సిస్తుంది. మీ ఇరువురి ముఖాలలో చిరు నవ్వులు చిన్డుతాయి. డిన్నర్ల కే ఇంత ఆనందం కలిగితే, ఇక మీ పూర్తి రోజులు అంతా ఎంత ఆనందమో మరి.

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

నులి వెచ్చని సూర్య రశ్మి, మెత్తటి ఇసుక తిన్నెలు కల అండమాన్ లోని బేర్ ఫుట్ రిసార్ట్ ఎంతో బాగుంది. మిమ్మల్ని మీరు మరచేలా వుంటుంది. తెల్లటి ఇసుక, స్వచ్చంగా వుండే సముద్ర బీచ్ నీరు, చల్లటి గాలులు, నీటిని తొండా లతో పైకి చిమ్మే ఏనుగులు, పక్కన మీరు, మీ ప్రేయసి అన్నీ కలసి బేర్ ఫుట్ మీకు మరువలేని ఆనందం ఇస్తుంది.

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

ఇండియా లో పర్యావరణం కాపాడే రిసార్ట్ లలో పాండిచేరి లోని డూనే మొదటి రిసార్ట్ . ఇక్కడ అంతా సహజ అనుభవమే. ప్రకృతి ఒడిలో కూర్చుని, ప్రేయసితో పరవశాలు పొందండి. రాగాలు ఆలపించండి. అందుకు అనువైన పరిస్థితి అంతా ఇక్కడ వుంది.

 మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

ఈ రిసార్ట్, ఇక్కడ కల కేసినో వాతావరణం మీలోని ఆనందాలను పది రెట్లు అధికం చేస్తాయి. ఒక్కసారి పెల్లుబికే మధురానుభూతులు కలుగుతాయి. ఇక్కడి రిసార్ట్ లో గల స్విమ్మింగ్ పూల్ ఎంతో సౌకర్యంగా వుంటుంది. వీనుల విందైన సంగీతం, డాన్స్ లు, వినోదాలతో ఈ రిసార్ట్ అద్భుత ఆనందాలు పంచుతుంది.

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

కోవలం లో కల ఎస్తుఅరి ద్వీప రిసార్ట్ ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ మధ్యన, సముద్ర దృశ్యాలు చూపుతూ వుంటుంది. కొబ్బరి తోటల నుండి వీచే చల్లని గాలులు, మీకు పూర్తి విశ్రాంతినిచ్చి, రొమాంటిక్ మూడ్ కలిగిస్తాయి.

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

కూనూర్ లో కల కురుంబ విలేజ్ రిసార్ట్ ఒక చక్కని కావ్య గానంలా వుంది, మీరు పాడే డ్యూయెట్ కు మధుర బాణీలు చేకూరుస్తుంది. సుగంధ ద్రవ్యాల తోటల మధ్య కల ఈ రిసార్ట్ మీలోని శృంగార భరిత జీవనాన్ని మరింత అధికం చేసి, మరల మరల రావాలనేలా చేస్తుంది.

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

ఊటీ లోని ఈ ఫెర్న్ హిల్ రిసార్ట్ పూర్వం మైసూరు మహారాజు కుటుంబానికి వేసవి విడదిగా వుండేది. ఈ రిసార్ట్ సుమారు 50 ఎకరాల విస్తీర్ణం కలిగి వుంది. ఈ రిసార్ట్ అంతా రాచరిక వైభవాలతో అలంకరించబడిన భవనాలు కలిగి, వాలీ లు, దట్టమైన పచ్చటి అడవులు, గార్డెన్ లు, టీ గార్డెన్ లు చూపుతుంది. ఇక మీరు చేయాలనుకునే రొమాన్స్ అంతా రాజ వైభోగంగానే వుంటుంది.

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

అందానికి, ప్రశాంతతకు, బ్రిటిష్ దర్పానికి ఈ రిసార్ట్ నిలయంగా వుంటుంది. పూర్తి విలాసాలు కల ఒక అయిదు నక్షత్రాల హోటల్ ఇది. ఈ హోటల్ యాజమాన్యం మీకు అనేక పాకేజ్ లు కూడా ఇస్తుంది. వెంట వెంటనే వాటిని అంది పుచ్చుకోండి. ఆనందించండి.

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

ఈ ప్రదేశంలో అందమైన తేయాకు తోటలు కలవు. శృంగార భరిత దృశ్యాల ఖజానా. తాజా గాలి, కమ్మని వాసనల తేయాకు తోటలు. స్థానిక సంస్కృతి, సహజ ప్రకృతి కల గ్లెన్ బర్న్ టీ ఎస్టేట్ మీలోని ఒత్తిడిని తొలగించి ప్రతి రోజూ మీకు కావలసిన ఆనందాలు, తాజా అనుభూతులు అందిస్తుంది.

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

ఒక పర్వతంపై కల గాంగ్టక్ లోని ఈ రిసార్ట్ మీకు ఫైవ్ స్టార్ లక్సరీ లను అందిస్తుంది. సిక్కిం రాష్ట్ర మొత్తంలో ఇది ఒక అందమైన ప్రదేశం. జంటలకు అనువైనది. ఈ రిసార్ట్ నుండి అందమైన పర్వత శ్రేణులు కాంచన జుంగ, చూడవచ్చు. డెన్జాంగ్ రీజెన్సీ ఇక్కడ సరిగ్గా ప్రకృతి ఒడిలో మధ్యన వుంది.

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

మూడ్ ఇచ్చే ముద్దుల రిసార్ట్ లు

ఒబెరాయ్ వైల్డ్ ఫ్లవర్ హాల్, సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో వుంది. ఈ రిసార్ట్ సముద్ర మట్టానికి 8, 250 అడుగుల ఎత్తున కలదు. ఈ రిసార్ట్ లో మీరు కోరే శృంగార జీవితపు తొలి అనుభవాలు వర్ణనాతీతంగా వుంటాయి అనటంలో సందేహం లేదు. ఎన్నో రకాల అడ్వెంచర్ లు, అందుకు గాను ఎన్నో రకాల పేకేజ్ లు ఈ రిసార్ట్ పుష్కలంగా అందిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X