Search
  • Follow NativePlanet
Share
» »హిమాలయాల్లోని మానససరోవరం ఎలా ఏర్పడింది... యాత్ర విశేషాలు !

హిమాలయాల్లోని మానససరోవరం ఎలా ఏర్పడింది... యాత్ర విశేషాలు !

మన పురాణాలలో మానస సరోవర ప్రస్థావన అక్కడక్కడా ప్రస్తావించబడుతుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆదిదంపతులైన శివపార్వతుల కోసం సృష్టించాడని పురాణ కథనం.

By Venkatakarunasri

సమస్త లోకాల్లో మానససరోవరం వంటి పవిత్రమైన సరోవరం మరొకటి లేదన్నది వాస్తవం. మానససరోవరం గతంలో బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్భవించింది. అందుకే దీనిని బ్రహ్మసం అని పిలిచేవారు.ఇది గతంలో ఎన్నో పవిత్రనదులకు పుట్టినిల్లు.ఈ సరోవరం చెంతనే గంగను దివి నుండి భువికి తప్పించటానికి భగీరథుడు తీవ్రమైన తపస్సు చేసాడట.

మన పురాణాలలో మానస సరోవర ప్రస్థావన అక్కడక్కడా ప్రస్తావించబడుతుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆదిదంపతులైన శివపార్వతుల కోసం సృష్టించాడని పురాణ కథనం. ఇంతటి మహిమాన్వితమైన మానససరోవరం సముద్రమట్టానికి 14,900ల అడుగుల ఎత్తులో వుంది.

ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు 54 మైళ్ళని అంటున్నారు. ఈ సరోవరం చుట్టుకొలత 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరచుకొని వున్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు వుంటుంది.

ఉత్సుకత

ఉత్సుకత

చాలా మంది మానససరోవరం పరిక్రమణ చేయటానికి ఉత్సుకత చూపుతుంటారు.

pc:youtube

మానససరోవర తీరం

మానససరోవర తీరం

మానససరోవర తీరంలోని 8 బౌద్దమఠాల మీదుగా పరిక్రమణ చేయాలంటే దాదాపు 110కి.మీల దూరం నడవ్వలసివుంటుంది.

pc:youtube

సరోవరం తీరం వెంబడి

సరోవరం తీరం వెంబడి

సరోవరం తీరం వెంబడి నడిస్తే 90కి.మీ ల దూరం మాత్రమే వుంటుంది. ఈ పరిక్రమణ చేయటానికి దాదాపు 2రోజుల సమయం పడుతుంది.

pc:Bhuvana Talanki Vinuth

నాలుగైదు రోజుల సమయం

నాలుగైదు రోజుల సమయం

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ పరిక్రమణకు దాదాపు నాలుగైదు రోజుల సమయం కూడా తీసుకుంటుంది.

pc:youtube

సెలయేళ్ళు, నదులు

సెలయేళ్ళు, నదులు

మార్గమధ్యంలో అనేక సెలయేళ్ళను,నదులను దాటాల్సి వుంటుంది. సాధారణంగా పరిక్రమణ కార్యక్రమాన్ని వేసవికాలంలోనే పెట్టుకుంటూ వుంటారు.

pc:youtube

ఈ యాత్ర అత్యంత కష్టంతో కూడుకున్నది

ఈ యాత్ర అత్యంత కష్టంతో కూడుకున్నది

గతంలో నడుస్తూనే పరిక్రమణ చేసేవారు. ప్రస్తుతం రహదారుల సౌకర్యం ఏర్పడటంతో వాహనాల ద్వారానే పరిక్రమణ చేస్తున్నారు.ఈ యాత్ర అత్యంత కష్టంతో కూడుకున్నది.

pc:Varun Bhoopalam

పరమశివుని అనుగ్రహం

పరమశివుని అనుగ్రహం

పరమశివుని అనుగ్రహానికి ఆ మాత్రం కష్టపడకతప్పదుగా. మానససరోవరం ఒకప్పుడు భారతదేశంలో భాగాలే అయినప్పటికీ ప్రస్తుతం టిబెట్ లో వున్నది.

pc:youtube

మానససరోవర యాత్ర

మానససరోవర యాత్ర

టిబెట్ చైనా ఆధీనంలో వుంది.కనుక మానససరోవర యాత్ర ఒక రకంగా విదేశీ యాత్ర చేసినట్లే అవుతుంది.

pc:youtube

 శ్రమ కూడా అధికం

శ్రమ కూడా అధికం

ఆ విధంగా యాత్ర చేయటానికయ్యే ఖర్చు కూడా అధికంగానే వుంటుంది. శ్రమ కూడా అధికం. ఈ యాత్రకు సంబంధించి భారతప్రభుత్వం ప్రసారసాధనాల్లో ప్రకటనలు ఇస్తారు.

pc:Varun Bhoopalam

భారతప్రభుత్వం ద్వారా యాత్ర

భారతప్రభుత్వం ద్వారా యాత్ర

ఇలా భారతప్రభుత్వం ద్వారా యాత్ర చేస్తూంటే ఆ యాత్ర రక్షణ బాధ్యతంతా ప్రభుత్వమే వహిస్తూ వుంటుంది. ఈ యాత్రను చేయడలచుకున్న వారు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖవారిని సంప్రదించవలసి వుంటుంది.

pc:youtube

నేపాల్ రాజధాని ఖాట్మండ్

నేపాల్ రాజధాని ఖాట్మండ్

ముందు వచ్చిన వాళ్లకు ముందు అన్న ప్రాతిపదకన దరఖాస్తులు స్వీకరిస్తుంది. మరికొంతమంది నేపాల్ రాజధాని ఖాట్మండ్ ద్వారా యాత్రలు చేస్తూ వుంటారు.

pc:youtube

యాత్రికులు చెబుతున్న విషయాలు

యాత్రికులు చెబుతున్న విషయాలు

అయితే ఆ యాత్రలో అంతగా సౌకర్యాలు ఉండవని యాత్రలు చేసివచ్చిన యాత్రికులు చెబుతున్న విషయాలు.

pc:youtube

కృత నిశ్చయం

కృత నిశ్చయం

చాలా శ్రమను, కష్టాలను ఓర్చుకుంటూ ముందుకు సాగే మానససరోవర యాత్ర ద్వారా సహనం, కృత నిశ్చయం, మౌనం వంటి గుణాలు అలవడతాయట.

pc:youtube

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+