Search
  • Follow NativePlanet
Share
» »మార్చి చివ‌రిలోపు ఈ ప‌ర్యాట‌క ప్ర‌దేశాలను చూసేయండి!

మార్చి చివ‌రిలోపు ఈ ప‌ర్యాట‌క ప్ర‌దేశాలను చూసేయండి!

మార్చి చివ‌రిలోపు ఈ ప‌ర్యాట‌క ప్ర‌దేశాలను చూసేయండి!

విశాఖ‌ప‌ట్నం అంటేనే అంద‌మైన న‌గ‌రం. అలాంటి సిటీ నుంచి రాబోతోన్న వేస‌వి కాలానికి ముందే మీ వారాంతపు సెలవులను చ‌ల్ల‌గా ఎంజాయ్ చేయాల‌నుకుంటే వైజాగ్ నుండి 150 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఈ ఐదు గమ్యస్థానాలను ఎంపిక చేసుకోండి.

స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసేందుకు ఉత్త‌మ‌మైన ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను ఎంతో అనువుగా ఉంటాయి. మార్చి చివ‌రిలోపు ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించండి.

వంజంగి

వంజంగి

మేఘాల చాటున‌ అందమైన సూర్యోదయంతో క‌నువిందు చేసే సుందరమైన దృశ్యాలతోపాటు పొగ‌మంచు క‌మ్ముకున్న ప‌ర్య‌త శిఖ‌రాల‌ను చూడాలంటే వంజంగి వెళ్లాల్సింది. ఇది రాత్రిపూట బస చేయడానికి అనువైనది కానప్పటికీ ఉద‌య‌పు స‌మ‌యం మొత్తాన్ని గడపగలిగే రోడ్ ట్రిప్ అని మాత్రం చెప్పొచ్చు. ఇక్క‌డికి వెళ్ల‌ద‌ల‌చేవారు అరకులో బసను ప్లాన్ చేసుకోవ‌చ్చు. మ‌ర్చిపోలేని అనుభవం కోసం ఉదయాన్నే ఈ కొండపైకి ట్రెక్ చేయండి. ఇది వైజాగ్ నుంచి 111 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

యానాం

యానాం

కాకినాడ సమీపంలోని యానాం జిల్లాలో ఉన్న ఫ్రెంచ్ నిర్మాణాల నేల‌ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ శీతాకాల విడిది కేంద్రం. అందమైన చారిత్ర‌క మార్గాలు మరియు గోదావరిని కలిసే గౌతమీ నది యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలతో విదేశీ ప‌ర్య‌ట‌న అనుభ‌వాన్ని పొంద‌వ‌చ్చు. ప్రసిద్ధ ద్రాక్షారామ దేవాలయం, హోప్ ఐలాండ్ వంటి ఎన్నో సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాల‌ను ఈ టూర్‌లో ఆస్వాదించ‌వ‌చ్చు. యానాం విశాఖ‌ప‌ట్నం నుంచి 145 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

డియోమాలి

డియోమాలి

డియోమాలి పూర్తిగా భిన్నమైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను క‌లిగి ఉంటుంది. వైజాగ్ ఒడిషాకు చాలా దగ్గరగా ఉండటంతో ఈ పర్వత శిఖరం చేరుకునేందుకు ఐదు గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం ముగిసే సమయానికి మీరు ఒడిశాలోని ఎత్త‌యిన శిఖరం వద్ద కనిపిస్తారు. పర్వత శిఖరం వ‌ద్ద థ్రిల్ కోరుకునేవారి కోసం అనేక కార్యకలాపాలను కలిగి ఉంది. పారా గ్లైడింగ్‌తోపాటు శిఖరం చుట్టూ ఉన్న అడవుల గుండా ట్రెక్కింగ్ చేయవచ్చు. ఇది వైజాగ్ నుండి 150 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

బొబ్బిలి

బొబ్బిలి

వైజాగ్ సమీపంలోని కోట పట్టణం బొబ్బిలికి చేరుకోవ‌డం ద్వారా అల‌నాటి రాచ‌రిక స్మృతులు ప‌రిచ‌యం అవుతాయి. 17 వ శతాబ్దంలో వెంకటగిరి రాజా 15వ వారసుడు పెద్ద రాయుడు స్థాపించిన ఈ చారిత్రక పట్టణం బొబ్బిలి యుద్ధంలో ఫ్రెంచ్ జనరల్ మార్క్విస్‌డి సహాయంతో విజయనగరం రాజులు యుద్ధంలో విజయం సాధించి చరిత్రలో నిలిచిపోయింది. మీరు ఇక్కడ ఉన్న సమయంలో కోట, సంగీత కచేరీ మండపం వంటి ఎన్నో సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాల‌ను చూడొచ్చు. ఇది వైజాగ్ నుండి 116 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

అన్నవరం

అన్నవరం

మీరు ఆధ్యాత్మిక పర్యటన కోసం వెళుతున్నట్లయితే, వైజాగ్ సమీపంలోని అన్న‌వ‌రం ఆల‌యాన్ని సంద‌ర్శించండి. విష్ణువు యొక్క ఈ వీర వెంకట సత్యనారాయణ దేవాలయం దేశవ్యాప్తంగా అనేక మంది యాత్రికులను ఆకర్షిస్తుంది. మీ కుటుంబంతో కలిసి వారాంతపు యాత్రకు వెళ్లి స్వామివారి ఆశీర్వాదం పొందండి. ఇది వైజాగ్ నుంచి 124 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

More News

Read more about: visakhapatnam odisha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+