Search
  • Follow NativePlanet
Share
» »సీతంపేట అట‌వీ అందాల‌ను చూసేందుకు బ‌య‌లుదేరండి!

సీతంపేట అట‌వీ అందాల‌ను చూసేందుకు బ‌య‌లుదేరండి!

సీతంపేట అట‌వీ అందాల‌ను చూసేందుకు బ‌య‌లుదేరండి!

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర‌ శివారు ప్రాంత‌మైన అట‌వీ ప్రాంతం నేటి ప‌ర్యాట‌కానికి ఆహ్వానం ప‌లుకుతోంది. ఓ వైపు జలపాతాలు, మరోవైపు పార్కు, ఇంకో వైపు అడవుల అందాలతో మన్యం అద్భుతంగా కనిపిస్తోంది. ఎటు చూసినా ప్ర‌కృతి అందాలు సంద‌ర్శ‌కుల‌ను రా రామ్మ‌ని పిలుస్తాయి. శ్రీకాకుళం చివారున ఉన్న సీతంపేట‌ ప‌ర్యాట‌క అందాలు నిత్యం సంద‌ర్శ‌కుల‌కు ఆహ్వానం ప‌లుకుతూనే ఉంటాయి. ఇక్క‌డ అద‌నంగా ఏర్ప‌టు చేసిన‌ ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్కు, జగతపల్లి, ఆడలి వ్యూపాయింట్‌లను చూడడానికి వివిధ ప్రాంతాల నిత్యం ప‌ర్యాట‌కుల తాకిడితో ఓ అద్భుత ప‌ర్యాట‌క ప్రాంతంగా పేరుగాంచింది. మ‌రెందుకు ఆల‌స్యం సిక్కోలు సిగ‌లో దాగిన ఆ ప‌ర్యాట‌క అందాలు ఒక్క‌సారి చూసొద్దాం రండి.

ప్ర‌కృతి సిగ‌లో దాగిన అందాల‌ను చూసేందుకు ప‌ర్యాట‌క ప్రేమికులు ఎప్పుడూ ముందంటారు. అలాంటి అందాల స‌మ్మేళ‌న‌మే ఈ రోజు మ‌నం చెప్పుకోబోయే సీతంపేట ప‌ర్యాట‌కం. ఇక్కడి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణగా నిలిచే మెట్టుగూడ, సున్నపుగెడ్డ జలపాతాలకు అత్యధిక సంఖ్యలో సందర్శకులు వచ్చి పిక్నిక్‌లు జరుపుకుంటారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలతో పాటు ఇటు ఒడిశా నుంచి కూడా పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఈ సీజ‌న్‌లో ఇక్క‌డి ప్ర‌కృతి అందాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

sitampetforest

సాహ‌స ప్రియుల‌కు సీతంపేట

మ‌రీ ప్ర‌ధానంగా సాహ‌స ప్రియుల‌కు సీతంపేట ఓ గొప్ప గమ్య‌స్థానంగా నిలుస్తోంది. ఇక్క‌డి సీతంపేట‌ అడ్వంచర్‌ పార్కు స్థానికంగా దోనుబాయి రహదారి మలుపున‌కు సమీపంలో ఉంది. ఇక్కడ జలవిహార్‌లో బోటుషికారు ఏర్పాటు చేశారు. సైక్లింగ్, జెయింట్‌వీల్, ఆల్‌టర్న్‌ వెహికల్, షూటింగ్, బంజీట్రంపోలిన్, ఫైవ్‌డీ థియేటర్‌ వంటివి ఉన్నాయి. కుటుంబ‌స‌మేతంగా స‌మ‌యాన్ని గడిపేందుకు ఈ ప్రాంతం చాలా అనువైన‌దిగా చెబుతారు. అందుకే ఏటా ఈ సీజ‌న్‌లో ఇక్క‌ద సంద‌ర్శ‌కులు వాలిపోతూ ఉంటారు.

sitampetforest

అబ్బుర ప‌ర‌చే జ‌ల‌పాత‌పు అందాలు...

ప్ర‌కృతి సిగ‌లో దాగిన కొండ‌కోన‌ల‌నుంచి జాలువారే జ‌ల‌పాత‌పు అందాల‌ను చూసేందుకు ఇక్క‌ది ద‌గ్గ‌ర‌లో ఉన్న మెట్టుగూడ జలపాతంకు చేరుకోవాల్సిందే. మామూలు రోజుల్లో కూడా ఇక్కడకు వచ్చే సందర్శకుల సంఖ్య అధికంగా ఉంది. సీతంపేట నుంచి కొత్తూరుకు వెళ్లే రహదారిలో మెట్టుగూడ జలపాతం ఉంది. కొత్తూరు నుంచి వస్తే 10 కిలోమీటర్లు, పాలకొండ నుంచి వస్తే 17 కిలోమీటర్ల దూరంలో రహదారి పక్కనే మెట్టుగూడ వస్తుంది. అక్కడ వాహనాలు దిగి కొద్ది దూరం నడిచి వెళ్తే జలపాతాన్ని చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు పాలకొండ-కొత్తూరు నుంచి అనునిత్యం తిరుగుతుంటాయి.
పర్యాటకులకు సంబంధించి అన్ని సౌకర్యాలున్నాయి.

sitampetforest

స్థానిక గిరిజ‌నులు అందించే ఆహారం..

మరో జలపాతం సున్నపు గెడ్డకు మంచి ప్రాధాన్యం ఉంది. ఇక్కడ వాతావరణం చూపరుల్ని కట్టిపడేస్తుంది. దోనుబాయి గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో సున్నపుగెడ్డ ఉంది. పొల్ల-దోనుబాయి మార్గంలో మేకవ గ్రామానికి సమీపంలో రోడ్డుదిగువ గుండా నడుచుకుంటూ వెళితే సున్నపుగెడ్డ జలపాతానికి చేరుకోవచ్చు. బస్సులు పరిమితంగా ఉంటాయి. సీతంపేట వచ్చి ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఇక్క‌డ ప‌ర్యాట‌కుల‌కు సదుపాయాలు అంతంత మాత్రమే.

తిను బండారాలు ఇతర ఆహార సామగ్రి పర్యాటకులు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అయితే, స్థానిక గిరిజ‌నులు సంద‌ర్శ‌కుల‌కు కావాల్సిన ఆహారాన్ని అందిస్తారు. అయితే, అందుకు ముందుగానే వారిని సంప్ర‌దించాల్సి ఉంటుంది.

sitampetforest

పొల్ల వ్యూ పాయింట్‌

ఈ అట‌వీ ప్రాంతంల‌తో సున్నపుగెడ్డకు సమీపంలో పొల్ల వ్యూ పాయింట్‌ ఉంది. ఏజెన్సీలోని అట‌వీ ప్రాంతాన్నీ ద‌గ్గ‌రాగా చూసేందుకు ఇదే స‌రైన‌ వ్యూపాయింట్‌. అయితే ఇక్క‌డికి వెళ్లేందుకు కుశిమి జంక్షన్‌ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రత్యేక వాహనాల్లో వెళ్లాలి. అలాగే, జగతపల్లి సీతంపేట నుంచి7 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీటిని వీక్షించడానికి ప్రత్యేక టూరిజం వెహికల్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవ‌ల కాలంలో ప‌ర్యాట‌క శాఖ ఇక్క‌డికి వచ్చే సంద‌ర్శ‌కుల కోసం అనేక సౌక‌ర్యాల‌ను అందిస్తోంది. మ‌రెందుకు ఆల‌స్యం మీ ప్ర‌యాణాన్ని మొదలుపెట్టండి.

More News

    Read more about: seethampeta palakonda
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+