ఈశాన్య భారతంలోని భయానక ప్రదేశాలకు వెళదామా?!
ఈశాన్య ప్రాంతంలోని ప్రసిద్ధ ప్రదేశాలను చాలాసార్లు సందర్శించి ఉంటారు, కానీ అక్కడ ఉన్న ఈ భయానక ప్రదేశాల జోలికి మాత్రం వెళ్లుండరు. ఈశాన్య ప్రాంతాల్లో ఇలాంటి భయానక ప్రదేశాల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అదే కారణంతో ఇవి ఎంతో ప్రాముఖ్యతను కూడా సంపాదించాయి. ఈశాన్య భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రదేశాలు ప్రసిద్ధి చెందాయి.
అందుకే, ప్రతినెలా లక్షల సంఖ్యలో దేశ, విదేశీ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈశాన్య భారతం తన అందానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినట్లుగా, కొన్ని భయానక ప్రదేశాలకు కూడా ప్రసిద్ధి చెందిందన్న మాట. ఇలాంటి భయానక ప్రదేశాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

జతింగా
అస్సాం ఈశాన్య భాగంలో ఉన్న జతింగా చాలా భయానక ప్రదేశం. ఇది ఒక నిర్మాణుష్య లోయ. ఈ లోయను 'పక్షుల ఆత్మహత్య లోయ' అని పిలుస్తారు. అమావాస్య రాత్రుల్లో పక్షులు గుంపులు గుంపులుగా చీకట్లో ఎగరడం ప్రారంభిస్తాయి. అలా కొంత సమయం తర్వాత ఒకదానితో ఒకటి ఢీకొని చనిపోతాయి. అయితే, పక్షులు అలా వచ్చి ఆత్మహత్య చేసుకుంటాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. జతింగాలో ఈ సంఘటన చాలా అపవిత్రంగా పరిగణించబడుతుంది. అందుకే, అమావాస్య రాత్రులు ఇక్కడి స్థానికులు ఎవరూ తమ ఇంటి నుండి బయటకు రాకుండా ఇంటికే పరిమితం అవుతారు.

ఫాంగ్‌పుయ్
మిజోరాంలోని ఫాంగ్‌పుయ్ కూడా ఈశాన్య ప్రాంతంలోని భయానక ప్రదేశాల జాబితాలో చేర్చబడింది. సముద్ర మట్టానికి రెండు వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నఫాంగ్‌పుయ్ పర్వత ప్రాంతం మొత్తం దట్టమైన అడవి. కొన్నాళ్ల క్రితం ఈ పర్వతం మీదకు ట్రెక్కింగ్ కోసం కొంతమంది వెళ్లి మళ్లీ తిరిగి రాలేదని చెబుతారు. ఈ సంఘటన తర్వాత, పట్టపగలు కూడా ఎవరూ ట్రెక్కింగ్ కోసం ఇక్కడికి వెళ్లరు. ట్రెక్కింగ్‌కు వెళ్లిన వారి మిస్సింగ్ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ కారణంగా ఫాంగ్‌పుయ్ భయానక ప్రదేశాల జాబితాలో చేరిపోయింది.

జోర్హాట్ జింఖానా క్లబ్
అస్సాంలో ఉన్న జోర్హాట్ జింఖానా క్లబ్ బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. ఆ సమయంలో, గుర్రపు పందెం, గోల్ఫ్, లాన్ టెన్నిస్ మొదలైన ఆటలు ఆడటానికి అధికారులు దీనిని ఏర్పాటు చేసుకున్నారు.
అయితే ఒకరోజు ఈ ప్రదేశానికి కాపలాగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా మరణించాడు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే జింఖానా గదుల నుంచి వింత శబ్దాలు రావడం మొదలైంది. దాంతో ఆ మిస్టరీని ఛేదించేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. ప్రస్తుతం ఇక్కడికి ఎవరూ ఒంటరిగా తిరగరని స్థానికులు చెబుతున్నారు.

థాంగ్జింగ్ హిల్
థాంగ్జింగ్ హిల్స్ కూడా హృదయాన్ని కదిలించే ప్రదేశం. ఈ భయానక ప్రదేశం మిజోరంలో ఉంది. ఇక్కడ నిజంగా దెయ్యం ఉందో లేదో తెలుసుకోవడానికి స్థానికులు కొందరు ఓ రోజు సాయంత్రం అక్కడికి వెళ్లారట. అయితే, అలా వెళ్లిన వారు కనిపించకుండా పోయారు. ఈ విషయం ప్రచారంలోకి రావడంతో ఈ ఘటన తర్వాత భయంతో ఎవరూ ఇక్కడికి వెళ్లే సాహసం చేయడంలేదు. అంతేకాదు, మిస్సయినవారి ఆచూకీ కోసం కూడా ప్రయత్నించ లేదు. అప్పటి నుండి థాంగ్జింగ్ కొండను భయానక ప్రదేశంగా పరిగణిస్తారు.



Click it and Unblock the Notifications











