దేశంలో ఢిల్లీ ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలలో ఒకటి. ఈ ప్రదేశం చేరినపుడు, ఇక్కడి సైట్ సీయింగ్ ఆనందాలతో పాటు ప్రతి వారూ అక్కడ కల ఆకర్షణీయ వీధులు తిరిగి ఇంటివద్ద తమవారికి లేదా వారికి అవసరమైన కొంత షాపింగ్ కూడా చేయాలని భావిస్తారు. మరి ఇంత మహానగరంలో ఎక్కడ ఏ వస్తువు కొనాలి ? మంచి నాణ్యత, చవక అయిన వస్తువులు ఎక్కడ దొరుకుతాయి ? అనేది ఒక సమస్య గా వుంటుంది. ఢిల్లీ లో మీరు హంది క్రాఫ్ట్స్, ఫాషన్ ఫుట్ వేర్ ఆర్టిఫిసియల్ జూవేలరి వంటివి ఎన్నో కొనుగోలు చేయవచ్చు. ఢిల్లీ లో షాపింగ్ మీకు కొత్త అనుభవాలను అందిస్తుంది.


ఢిల్లీ షాపింగ్ వీధులు
జనపథ్ స్ట్రీట్ ఢిల్లీ లో ఎంతో పురాతనమైనది. ఈ వీధి కొన్నాట్ ప్లేస్ ను లోడి రోడ్ కు కన్నెక్ట్ చేస్తుంది. తక్కువ ధరలలో కొనాలనుకునే వారు ఈ మార్కెట్ కు వచ్చి కొనుగోళ్ళు చేస్తారు. అన్ని బడ్జెట్ ల వారికి అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. అయితే, బ్రాండెడ్ వస్తువులు ఈ ప్రదేశం సరి కాదు.

ఢిల్లీ షాపింగ్ వీధులు
సరోజినీ నగర్ మార్కెట్ ఒక అసలైన షాపింగ్ ఏరియా. ఫాషన్ గూడ్స్, లేదా ఇతర వస్తువులు కోణాలను కునే వారికి ఇది ఒక మంచి మార్కెట్. ఇక్కడ వివిధ రకాల వస్తువులే కాక, తాజా, పండ్లు, కూరగాయలు, స్వీట్ లు వంటి తినుబండారాలు, స్నాక్స్ వంటివి కూడా దొరుకుతాయి. ప్రతి సోమవారం ఈ మార్కెట్ కు సెలవు వుంటుంది.

ఢిల్లీ షాపింగ్ వీధులు
ఢిల్లీ హాత్ మార్కెట్ షాపింగ్ ప్రియుల ప్రదేశం. ఢిల్లీ సందర్శకులు ఇక్కడకు తప్పక వచ్చి షాపింగ్ చేస్తారు. ఇక్కడ అతి ఖరీదైన కార్పెట్ల నుండి తోలు మరియు అంటిక్ వస్తువుల వరకూ అన్నీ దొరుకుతాయి. ఢిల్లీ హాత్ లో అన్ని రకాల వినియోగ దారులూ కొనుగోళ్ళు చేస్తారు. కొంతమంది పర్యాటకులు కొనుగోలు చేయనప్పటికీ, అక్కడ వస్తువులను ఊరికే చూసేందుకు కూడా వస్తారు.

ఢిల్లీ షాపింగ్ వీధులు
ఢిల్లీ లోని కొన్నాట్ ప్లేస్ ఒక ప్రసిద్ధ షాపింగ్ ప్రదేశం. ఈ ప్రదేశాన్ని సి పి అని స్థానికంగా పేర్కొంటారు. ఈ ప్రదేశం స్థానికుల కొనుగోళ్ళతో ఎల్లపుడూ బిజి గా వుంటుంది. ఇక్కడ చవక మరియు ఖరీదైన వస్తువులు కూడా దొరుకుతాయి. కనుక అన్ని వర్గాల వినియోగదారులకూ ఈ మార్కెట్ అందుబాటులో వుంటుంది.

ఢిల్లీ షాపింగ్ వీధులు
లజపత్ నగర్ మార్కెట్ షాపింగ్ నిరంతరం చేసే వారికి ఎంతో బాగుంటుంది. ఇక్కడ మీకు అన్ని వస్తువులు దొరుకుతాయి. ఫుట్ వేర్ నుండి బాగు లు, ఆర్టిఫిసియల్ జూవేలరి, కాస్మెటిక్స్, సాంప్రదాయ దుస్తులు మొదలైనవి అందరికీ అందుబాటు ధరలలో వుంటాయి. ఢిల్లీ లో ఇది ఒక ప్రధాన మార్కెట్ ప్రదేశం.

ఢిల్లీ షాపింగ్ వీధులు
చాందిని చౌక్ మార్కెట్, ఇండియాలో ని పురాతన మార్కెట్లలో ఒకటి. మొగలుల కాలం లో దీనిని స్తాపిన్ల్చినప్పటి నుండి ఇక్కడ వ్యాపారం జరుగుతూనే వుంది. ఈ ప్రదేశం నోటి రుచులు ఊరే ఆహారాలకు ప్రసిద్ధి. ఇక్కడ అతి పురాతనమైన టెంపుల్స్ కూడా కలవు.

ఢిల్లీ షాపింగ్ వీధులు
ఢిల్లీ లోని కరోల్ బాగ్ నేడు పెద్ద బిజినెస్స్ సెంటర్ లలో ఒకటి. ఈ వీధిలో ఎయిర్ కండిషన్ దుకానాల నుండి సరసమైన ధరలకు అమ్మే చిన్న షాపుల వరకూ కలవు. ఈ వీధి లో షాపులు, వస్తువుల వారీ గా వుంటాయి. అంటే వెండి కోట్లు, బంగారం కోట్లు, మొదలగు రీతిలో వరుసగా వుంటాయి. దిగుమతి చేసికొనే విదేశీ వస్తువులకు గఫ్ఫార్ స్ట్రీట్ ప్రసిద్ధి.

ఢిల్లీ షాపింగ్ వీధులు
మీరు కనుక బ్రాండెడ్ వస్తువులు కొనాలనుకుంటే, సాకేత్ మార్కెట్ కు వెళ్ళాలి. ఈ వీధి అంతా షాపింగ్ ప్రియులైన ధనికులకు అందుబాటులో వుంటుంది. పెద్ద పెద్ద మాల్స్ లో వస్తువులు అమ్ముతారు. నాణ్యత అధికంగా వుంటుంది. సిటీ వాక్, వంటి మాల్స్ మీకు అద్భుత షాపింగ్ అనుభవాన్ని ఇస్తాయి. ఇక్కడే మంచి హోటళ్ళు, బార్ లు, రెస్టారెంట్ లు కూడా కలవు. ఇక్కడ అన్ని మేజర్ బ్రాండ్ వస్తువులు అమ్ముతారు.

ఢిల్లీ షాపింగ్ వీధులు
వసంత విహార్ లేదా వసంత కుంజ్ లో ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కలదు. ఇక్కడ అన్నీ ఖరీదైన వస్తువులు అమ్ముతారు. ఖరీదైన వస్తువుల అమ్మకాలకు ఇక్కడ కల డి ఎల్ ఎఫ్ మాల్ బాగా పేరు పడింది.



Click it and Unblock the Notifications











