Search
  • Follow NativePlanet
Share
» »ముంబై లో షాపింగ్ వీధులు!

ముంబై లో షాపింగ్ వీధులు!

ముంబై నగరం గొప్ప పర్యాటక ప్రదేశం. సాధారణంగా రోజులో ఎపుడైనా సరే, నగరం ఎంతో బిజి గా వుంటుంది. మీరు ఒక్కసారి ముంబై నగరం పర్యటిస్తే చాలు, జీవితంలో ఎప్పటికి ఆ అనుభవాలను మరువలేరు. పర్యాటక ప్రదేశాలే కాక, మీరు మరువలేని ఎన్నో షాపింగ్ వీధులు కూడా ఇక్కడ కలవు. ముంబై నగర వీధులు ఫాషన్ వస్తువులకు ప్రసిద్ధి. దేశంలో ఫాషన్ లు సాధారణంగా మొట్ట మొదటిగా ఈ నగరానికి చేరతాయి. అనేక కొత్త కొత్త రకాల వస్తువులు ఇక్కడి వీధులలో దొరుకుతాయి. మరి మీరు ఈ ఫాషన్ వస్తువులను అధిక ఖర్చు లేకుండా ఎలా కొనుగోలు చేయాలి ? వాటి ఎంపిక ఎక్కడ చేస్తే అవి చవకగా దొరుకుతాయి, మొదలగు అంశాలు పరిశీలిద్దాం

కొలాబా కాజ్ వే
కొలాబా కాజ్ వే ఎలాంటి ప్రదేశం అంటే, మీరు రోజులో ఎంత అలసినా సరే, ఇక్కడకు చేరగానే, అక్కడి వస్తువులు చూడగానే ఎంతో ఉత్సాహం పొందుతారు. కొలాబాను మరియు ఓల్డ్ ఉమెన్స్ ఐలాండ్ ను కలిపే సందు ముంబై లోని ప్రసిద్ధ షాపింగ్ వీధులలో ఒకటి. ఇక్కడ మీకు, మహిళల రంగు రంగుల చేతి గాజులు, హెవీ నెక్ లేస్ లు, ఇతర ఆభరణాలు దొరుకుతాయి. అంతే కాదు, పూసలు, బ్రాస్ వస్తువులు, వివిధ ఫాషన్ దుస్తులు, క్రిస్టల్స్, వంటివి కూడా దొరుకుతాయి. ఈ వస్తువులు మీకు అతి చౌక నుండి ఎంతో ఖరీదు వరకూ ఏ ధరలో కావాలన్నా సరే దొరుకుతాయి.

చోర్ బజార్
దీనినే దొంగల మార్కెట్ అని కూడా అంటారు. వాస్తవానికి గతంలో ఈ బజార్ ను అక్కడి రణగొణ ధ్వని కారణంగా షోర్ బజార్ అనేవారు. హిందీ భాషలో షోర్ అంటే ధ్వని అర్ధం. కాలక్రమేనా షోర్ అనే పదం చోర్ గా మార్పు చెంది చోర్ బజార్ అయ్యింది. ఇక దాని పేరుకి తగ్గట్టే, దొంగతనం చేసిన వస్తువులు తెచ్చి ఇక్కడ అమ్మటం మొదలు పెట్టారు కూడాను. ఇక్కడ దొరికే వస్తువులు కారు చౌకగా వుంటాయి. ముంబై లో మీరు ఏదైనా పోగొట్టు కుంటే, ఆ వస్తువును చోర్ బజార్ లో కొనుగోలు చేయవచ్చనే సామెత కూడా ఇక్కడ కలదు. దక్షిణ ముంబై లోని మహమ్మద్ ఆలి రోడ్ సమీపంలో కల ఈ చోర్ బజార్ శుక్రవారాలు మూసి వేసి వుంటుంది. వారంలోని మిగిలిన అన్ని రోజులూ ఉదయం 11 గం. నుండి రా. 7 గం. వరకూ అమ్మకాలు సాగిస్తుంది.

కొంటే ముంబై లోనే కొనాలి ?

లింకింగ్ రోడ్
లింకింగ్ రోడ్ బాంద్రా వెస్ట్ ప్రాంతం లో కలదు. ఈ రోడ్డులో అనేక దుకాణాలు వుంటాయి. వీటిలో మీకు దేశి చాట్ లు అయిన పాని పూరి మరియు భెల్ పూరి వంటి తిను బండారాలు దొరుకుతాయి. ఇంకా హెయిర్ క్లిప్ లు, బెల్ట్ లు, ఇతర ఫాషన్ వస్తువులు ఎన్నో దొరుకుతాయి. ఈ వీధి. వారం లోని అన్ని రోజులలో ఉ. 10 గం. నుండి రా.10 గం వరకూ తెరిచి వుంటుంది.

క్రాఫార్డ్ మార్కెట్
క్రాఫార్డ్ మార్కెట్ లో మీకు అన్నీ తాజా వస్తువులు, అంటే పండ్లు, కూరలు, పూవులు వంటివి దొరుకుతాయి. ఇక్కడకు సాధారణంగా స్థానికులు వస్తారు. ఈ మార్కెట్ లో మీకు పెంపుడు పక్షులు, చేపలు, ఇతర పెట్ జంతువులూ కూడా దొరుకుతాయి. షాంపూలు, సోప్ లు, సుగంద ద్రవ్యాలు, మొదలవైనవి కూడా దొరుకుతాయి. సౌత్ ముంబై లోని ముంబై పోలీస్ ప్రధాన కార్యాలయం ఎదుట కల ఈ వీధి వారంలో అన్ని రోజులూ ఆదివారం సాయంత్రం తప్ప ఉదయం నుండి రాత్రి పొద్దు పోయే తనత వరకూ తెరిచే వుంటుంది.

ఫాషన్ వీధి
సాంప్రదాయ దుస్తులు, ఫుట్ వేర్ మరియు ఇతర చిన్న వస్తువుల నుండి ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫుడ్ స్టాల్స్ వరకూ ముంబై లోని ఫాషన్ స్ట్రీట్ లో దొరుకుతాయి. మీకు బేరం చేసే ఓపిక వుండాలి. క్లిక్ అయితే మంచి నాణ్యత కల వస్తువులు చవక ధరలలో దొరుకుతాయి. దక్షిణ ముంబై నగరంలోని ఎం జి రోడ్ ఆజాద్ మైదాన్ ఎదురుగా కల ఈ ఫాషన్ వీధి ఎపుడూ సందడిగా వుంటుంది. ఉదయం నుండి రాత్రి వరకూ ఈ వీధి దుకాణాలు తెరిచే వుంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+