Search
  • Follow NativePlanet
Share
» »ఢిల్లీ మెట్రో లో షాపింగ్ టూర్ !

ఢిల్లీ మెట్రో లో షాపింగ్ టూర్ !

ఢిల్లీ మెట్రో సందర్శించ కుండా ఢిల్లీ పర్యటన పూర్తి కాదు. రాజ దాని నగరంలో రవాణా సౌకర్యవంతం చేయటానికి గాని ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ తో ప్రవేశ పెట్టిన వ్యవస్థ ఢిల్లీ మెట్రో. ఢిల్లీ మెట్రో లోని ప్రతి లైన్ లోనూ మీరు అనేక టూరిస్ట్ ఆకర్షణలు చూడవచ్చు. ఢిల్లీ మెట్రో లో ఆరు లైన్ లు కలవు. ఇవి ఢిల్లీ లో వివిధ ప్రదేశాలు తిప్పుతాయి. ప్రతి లైన్ కు ఒక కలర్ వుంటుంది. ఇపుడు మనం బ్లూ లైన్ గురించి చర్చిస్తున్నాము. ఈ లైన్ లో ట్రావెల్ అధికంగా వుంటుంది.

ఢిల్లీ లో షాపింగ్ దేశంలోనే ప్రసిద్ధి. షాపింగ్ ప్రియులు తమకు ఇష్టమైన అనేక వస్తువులు తగిన ధరలలో కొనుగోలు చేసేందుకు ఢిల్లీ లో అనేక ఎంపికలు చేసి కోనవచ్చు. ఇపుడు ఢిల్లీ మెట్రో బ్లూ లైన్ కింద వచ్చే షాపింగ్ ప్రదేశాలు పరిశీలిద్దాం.

మెట్రో జనక పురి వెస్ట్
బ్లూ లైన్ మార్గం ద్వారక సెక్టార్ నెం .21 నుండి మొదలవుతుంది. ఈ రూట్ లో జనకపురి వెస్ట్ మొదటి షాపింగ్ ప్రదేశం. షాపింగ్ మాల్స్, సినీ ప్లేక్స్, రిటైల్ దుకాణాలు, ఫాషన్ స్టోర్స్ మరియు వివిధ ఇతర స్టాల్స్ కూడా కలవు. ఇవన్నీ కూడా ఢిల్లీ లో అధికంగా షాపింగ్ జరిగే ప్రాంతాలు.

క్రాఫ్ట్ బజార్

క్రాఫ్ట్ బజార్ ఒక ప్రసిద్ధ షాపింగ్ కేంద్రం. తిలక్ నగర్ లో చీరల దుకాణాలు, కేక్ షాప్ లు , ఎలెక్ట్రికల్ వస్తువులు, పెంపుడు జంతువుల షాప్ లు, వైన్ షాప్ లు, ఇతర స్టోర్స్ లు మిమ్మల్ని షాపింగ్ కు ఆహ్వానిస్తాయి.

ఢిల్లీ మెట్రో లో షాపింగ్ టూర్ !

రాజోరి గార్డెన్
రాజోరి గార్డెన్ లో అనేక షాపింగ్ మాల్స్ కలవు. అన్నీ విక్రయదారులతో, కొనుగోలు దారులతో నిండి వుంటాయి. ఇక్కడి మాల్స్ లో టి డి ఐ మాల్, వెస్ట్ గేటు మాల్, సిటీ స్క్వేర్ మాల్ మరియు లైఫ్ స్టైల్ వంటివి ప్రసిద్ధి. ఇక్కడ అనేక బట్టల దుకాణాలు కలవు. మహిళలు ఇక్కడ అధికంగా సరసమైన ధరలలో లభించే చీరలు కొనుగోలు చేస్తారు.

మోతి నగర్
మోతి నగర్ లో మీకు సాంప్రదాయ దుస్తులు దొరుకుతాయి. ఇతర వస్తువులు కూడా కొనుగోలు చేయవచ్చు.

కరోల్ బాగ్
కరోల్ బాగ్ లో మీకు రంగు రంగుల దుస్తుల నుండి, ఇతర సాంప్రదాయ దుస్తుల వరకూ ,మరియు ఆటోమొబైల్ భాగాలు, పండ్లు, కూర కాయలు, వంటివి దొరుకుతాయి. ఈ మార్కెట్ లో మిడిల్ క్లాసు కుటుంబాలకు అవసరమైన వస్తువులు అన్నీ దొరుకుతాయి.

రాజీవ్ చౌక్
రాజీవ్ చౌక్ ఢిల్లీ లో చాలా బిజిగా వుండి అధికంగా కొనుగోలు దారులు వచ్చే ప్రదేశం.

కొన్నాట్ ప్లేస్ , పాలిక బజార్ మరియు జనపథ్ మార్కెట్ లలో కూడా మీరు అనేక వస్తువులు సమంజసమైన రేట్ల లో కొనుగోలు చేయవచ్చు.

న్యూ అశోక్ నగర్
న్యూ అశోక్ నగర్ లో మీకు రుచికరమైన అనేక ఆహారాలు లభిస్తాయి. ఇక్కడ పుస్తకాలు, కేక్ లు , ఎలెక్ట్రికల్ వస్తువులు మరియు ఇతర వస్తువులు కూడా దొరుకుతాయి.

సుభాష్ నగర్
సుభాష్ నగర్ లోని పసిఫిక్ మాల్ ఒక్క సారి సందర్శిస్తే చాలు, ఇక్కడ మరల మరల కొనుగోలు చేస్తారు. మీకు ఫాషన్ వస్తువులు ఇష్టమా ? అయితే మీరు నేరుగా పసిఫిక్ మాల్ కు వెళ్ళండి. ఇక్కడ మీరు అనేక ఉత్తమ బ్రాండ్ ల వస్తువులు తనివి దీరా కొని ఆనందించవచ్చు.

More News

Read more about: delhi ఢిల్లీ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+