Search
  • Follow NativePlanet
Share
» » సోమనాథపుర - పరిపూర్ణ శిల్ప శైలి !

సోమనాథపుర - పరిపూర్ణ శిల్ప శైలి !

హోయసల రాజులు నిర్మించిన అనేక టెంపుల్స్ లో సోమనాథ పుర చెన్నకేశవ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం క్రీ. శ 1268 లో నిర్మించబడింది. సోమనాథ పుర మైసూరు పట్టణానికి 30 కి. మీ. ల దూరంలో శ్రీరంగ పట్టణానికి తూర్పు దిశగా వుంటుంది. మూడు గోపురాలు కల ఈ దేవాలయం ఒక నక్షత్ర ఆకారంలో వుంటుంది. ఈ పట్టణానికి ఆనాటి హోయసల రాజు మూడవ నరసింహ కు విధేయుడైన సైన్యాదిపతి సోమ పేరు పెట్టారు. రాజు మూడవ నరసింహ సహకారంతో ఈయన అద్భుత శిల్పశైలి కల సోమనాధ పుర చెన్న కేశవ దేవాలయాన్ని నిర్మించాడు.

ఈ హోయసల టెంపుల్ ను త్రికూటాచలం అని కూడా అంటారు. ఈ దేవాలయంలో విష్ణువు మూడు రూపాలలో దర్శనమిస్తాడు. అవి కేశవ, జనార్ధన మరియు వేణుగోపాల. ఈ మూడు విగ్రహాలలోను నేడు కేశవ విగ్రహం దొంగిలింప బాడగా, మిగిలిన రెండూ ఇపుడు ఆకారం కోల్పోయాయి. అయ్లినప్పటికి అందమైన ఈ టెంపుల్ తప్పక దర్శించ తగినది. దేవాలయ ప్రాంగణ మెయిన్ హాల్ పదహారు స్తంభాలతో, ఎత్తైన గోడలతో విశాలంగా వుండి హోయసల శిల్ప శైలి ఉట్టి పడేలా వుంటుంది. గోడలపై దీని నిర్మాణంలో పాల్గొన్న శిల్పుల, అప్పటి పాలకుల పేర్లు కూడా చెక్కారు. ఈ టెంపుల్ ప్రవేశ ద్వారం ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది.

 మూడు గోపురాలు

మూడు గోపురాలు

ఈ మూడు గుడులూ మూడు గోపురాలు కలిగి వుంటాయి. నిర్మాణంలో గోపురాలకు ప్రాధాన్యత అధికంగా వుంటుంది. గుడి 16 కోణాలు గల నక్షత్రం ఆకారంలో నిర్మించగా, పైన కల గోపురాలను కూడా పదహారు కోణాలతో నిర్మించారు.
Photo credit: Srikanth Goenka

టెంపుల్ యొక్క రాతి పలకల గోడలు

టెంపుల్ యొక్క రాతి పలకల గోడలు

టెంపుల్ యొక్క రాతి పలకలపైఅనేక హిందూ దేవతా మూర్తులను చెక్కారు. ఈ రాతి పలకల కింది భాగంలో కూడా వివిధ రూపాల మూర్తులు చేక్కబడి సమాంతరంగా వుంటాయి.

Photo credit: Dineshkannambadi

గొప్పవైన భారత ఇతిహాసాలు

గొప్పవైన భారత ఇతిహాసాలు

గోడలపై భారత దేశ గొప్పవైన ఇతిహాసాలను వర్ణించే అనేక అందమైన చేక్కదాలను నిర్మించారు. దక్క్షినపు గోడ పూర్తి గా రామాయణ గాధలు కలిగి వుండగా, ఉత్తరం గోడ పై పూర్తిగా మహాభారతం కధలు వర్ణించారు. టెంపుల్ వెనుక భాగంలో శ్రీ కృష్ణుడి కధలు వర్ణించారు. ఈ మూడు మహా కావ్యాల వర్ణనలతో దేవాలయ గోడలు ఒక విశిష్ట రీతిలో నిర్మించబడ్డాయి.
Photo credit: Clik Maverick

విష్ణు మూర్తి విగ్రహం

విష్ణు మూర్తి విగ్రహం

శ్రీ మహా విష్ణువు విగ్రహంతో ప్రధానంగా నిర్మించబడిన ఈ ఆలయం వైష్ణవ ఆలయాలలో ఒక ప్రత్యేక శైలి కలిగి వుంటుంది. గోడల చిత్రాలన్నీ కూడా శ్రీ మహా విష్ణువు చిత్రాలతో నిండి వుంటాయి. వీటిలో ఎక్కడా శివుడి చిత్రం వుండదు. ఈ టెంపుల్ ను మెత్తటి సోప్ స్టోన్ తో నిర్మించటం ఆనాటి శిల్ప శైలి నైపుణ్యానికి నిదర్శనంగా వుంటుంది.

పర్యాటక ఆకర్షణ

పర్యాటక ఆకర్షణ

బేలూర్, హళెబీడు ఆకర్షణల వాలే సోమనాథ పుర టెంపుల్ ను ఒక పర్యాటక ఆకర్షణగా చేయక పోయినప్పటికీ, ఇక్కడి చెన్నకేశవ టెంపుల్ ఎంతో మంది ఆసక్తికల పర్యాటకులను ప్రతి సంవత్సరం ఆకర్షిస్తూనే వుంటుంది.

Photo credit: Vinoth Chandar

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+