హైదరాబాద్‌లో శ్రీ అనంత పద్మనాభస్వామి వారి కళాఖండం..!
ప్రపంలోనే అత్యంత సంపద కలిగినటువంటి అనంత పద్మనాభ స్వామి వారు కేరళ, తిరువనంతపురంలో కొలువై ఉన్నారనే సంగతి అందరికి తెలిసిందే. ఎంతో విశిష్టత కలిగిన పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవాలని చాలామంది భక్తులు అనుకుంటుంటారు. కానీ, ఇప్పడు ఆ స్వామి వారిని చూడాలంటే కేరళ వెళ్లాల్సిన పనిలేదు. తెలంగాణలోని హైదరాబాద్‌కు కూడా వెళ్లొచ్చు.
అవునండి, హైదరాబాద్‌లో కూడా పద్మనాభ స్వామివారు అతిచిన్న విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. 18 అంగుళాల్లో వజ్రాలు బంగారంతో పూసిన విగ్రహం ఇప్పడు హైదరాబాద్ వాసులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. యోగనిద్రలో ఉన్న ఈ చిన్న విష్ణుమూర్తి విగ్రహం ఇక్కడికొచ్చే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విష్ణుమూర్తి అవతారమే పద్మనాభ స్వామి అని అంటారని అందరికి తెలిసిందే కదా. రండి ఈ చిన్న పద్మనాభస్వామి వారి ప్రతిమ విశిష్టతలు తెలుసుకుందాం.

అంతా నేచురల్‌గా..
ఈ విగ్రహంలో స్వామి వారి బొడ్డులోనుంచి ఓ కమలం కనిపిస్తుంటుంది. ఆ కమలంలో బ్రహ్మదేవుడి రూపం ఉంటుంది. అలాగే స్వామి వారి కుడిచేతి కింద శివలింగం కనిపిస్తుంది. పూర్తిగా ఇదంతా కూడా బంగారం, వజ్రంతో తయారుచేశారు. అక్కడక్కడ పచ్చలు, కెంపులు కనిపిస్తాయి. కేరళలోని స్వామివారిని చూడాలంటే ఒక ద్వారం నుంచి చూడలేం. మూడు ద్వారాల నుంచి చూడాల్సి ఉంటుంది. మొదటి ద్వారంలో తల, రెండవ ద్వారంలో నాభి చూడగలం. ఇక మిగిలిన ద్వారంలో అయితే పాదాలు మాత్రమే మనకు కనిపిస్తాయి.
అంతటి పెద్ద విగ్రహం కేరళలో ఉంది. కానీ, హైదరాబాద్‌లో మాత్రం అతి చిన్న విగ్రహం, పూర్తిగా కనిపించేలా ఈ విగ్రహం ఉంటుంది. కేరళలో స్వామి వారు ఎలాగైతే ఉన్నారో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉండేలా ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. చేతులు, వేళ్లు, గోళ్లదగ్గర కానీ అంతా నేచురల్‌గా కనిపించే విధంగా తయారుచేశారు. ప్రతిదీ చాలా డీటేల్‌గా ఉంటుంది. ప్రత్యేకించి ఇందులో 2.8 కేజీల బంగారాన్నివాడారు. శ్రీ అనంత పద్మనాభస్వామి ఆభరణం 8 అంగుళాల ఎత్తు, 18 అంగుళాల పొడవు కలిగి ఉంటుంది.
75000 వజ్రాలు..
ఈ గోల్డ్ ఏదైతే కాయిన్ రూపంలో ఉందో దానిని మొదటగా స్వామి వారి దగ్గరికి తీసుకెళ్లి పూజ చేయించారు. అక్కడ పూజ చేయించి బంగారాన్ని కరిగించి ఇలా విగ్రహం రూపంలో తయారుచేశారు. మొత్తం 500 క్యారెట్ల బరువు కలిగిన దాదాపు 75,000 అధిక నాణ్యత కలిగిన వజ్రాలతో అలంకరించబడిన శ్రీ అనంత పద్మనాభస్వామి రూపు చూడతగ్గ రీతిలో ఉంటుంది. ఈ వజ్రాలు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. మైక్రోలైన్స్ పెట్టిచూస్తే చాలా అద్బుతంగా కనిపిస్తాయి. విగ్రహంలో ఆదిశేషులా కనిపించే ప్రాంతమంతా డైమండ్స్‌తో నిండి ఉంటుంది. తామరపుష్పం లోపల కూడా అంతా వ్రజంతో నిండి ఉంటుంది.
స్వామి వారి పంచె, నగలు, కిరిటం, శంకుచక్రాలు ఇవన్నీ కూడా వజ్రాలతోనే ఉంటాయి. ఈ విగ్రహంలో స్వామివారి ఒక చేతిలో చక్రం కనిపిస్తుంది. ఇంకో చేతిలో కమలం ఉంటుంది. పక్కన గద ఉంటుంది. గద అంతా వజ్రాలతో నిండి ఉంటుంది. ఇక్కడ వాడిన గోల్డ్ కూడా మనకు యాంటిక్‌లా కనిపిస్తుంది. అందుకే పూర్తిగా గోల్డ్ కలర్‌లో కాకుండా అక్కడక్కడ నలుపుగా కూడా కనిపిస్తుంటుంది. కిరిటీం దగ్గర మాత్రమే మనకు పచ్చ కనిపిస్తుంది. ఐదుశేషుల పడగల పాము కళ్లకి రూబీస్ పెట్టారు. వాటి నాగమణిని డైమండ్స్‌తో అలంకరించారు. స్వామివారి నామానికి కూడా అన్నీ రూబీస్‌నే వాడారు.
మూడు మాసాల సమయం..
ఈ విగ్రహానికి ఎలా చేయాలి అని ఆలోచించేందుకు మూడు మాసాల సమయం పట్టిందట.. 36 మంది ఈ విగ్రహ తయారీలో పాల్గొన్నారు. రోజుకు సుమారు 18 గంటలు శ్రమించేవారట. సుమారు మూడుమాసాల సమయం ఈ విగ్రహ తయారీకి పట్టింది. మొదటగా ఈ విగ్రహాన్ని జూబ్లీహిల్స్‌లో లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరైనా వచ్చిచూసేవిధంగా ఉండేలా అబిడ్స్‌లోని శివ్‌నారాయణ జ్యువెలర్స్‌లో ఎగ్జిబిట్ చేశారు. శివ్ నారాయణ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో 'శ్రీ అనంత పద్మనాభస్వామి' విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఈ విగ్రహాన్ని వారు భీమా జ్యువెలర్స్, తిరువనంతపురం చైర్మన్ డాక్టర్ బి. గోవిందన్‌కు అంకితం చేశారు.
శివ్ నారాయణ్ జ్యువెలర్స్ 8 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించిన తరువాత ఈ అద్భుతమైన కళాఖండం తీర్చిదిద్దారు. ఎనిమిది గిన్నిస్ వర్డల్డ్ రికార్డ్స్ కూడా జ్యువెలరీ మేకింగ్‌లో సొంతం చేసుకున్నవే. ఆకట్టుకునే ఈ ఆభరణం కేరళలోని తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఉన్న అద్భుతమైన విగ్రహం నుండి ప్రేరణ పొందినది. మొదటిసారి దేవుని విగ్రహం అది కూడా వజ్రాలు, బంగారంతో తయారుచేసిన విగ్రహం కావడం మరో విశేషం. ఈ సంచలనాత్మక సృష్టితో శివ్ నారాయణ జ్యువెలర్స్ వారు తొమ్మిదవ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్‌కు చేరువ కానున్నారు. చైర్మన్ కమల్ కిషోర్ అగర్వాల్, మేనేజింగ్ డైరెక్టర్, తుషార్ అగర్వాల్ మార్గదర్శకత్వంలో ఈ ఆభరణం రూపొందించబడింది. మరెందుకాలస్యం మీరు కూడా ఈ మినీ పద్మనాభ స్వామి వారిని దర్శించుకోండి మరి..



Click it and Unblock the Notifications












