Search
  • Follow NativePlanet
Share
» »మీకు తెలియని చూడని ఇండియాలోని 6 దేవాలయాలు ఇవే !

మీకు తెలియని చూడని ఇండియాలోని 6 దేవాలయాలు ఇవే !

ఇండియాలో పురాతనమైన టెంపుల్స్ అంటే 2000 కాలం నాటి చరిత్రను కలవి వాటి ప్రత్యేకతలవి ఎన్నో వున్నాయి. ప్రతీ ఒక్కదానికి దాని విశిష్టత దానిదిగా చెబుతారు.

By Venkatakarunasri

ఈ గ్రామంలో 75 ఇళ్లుంటే 45 మంది IAS !ఈ గ్రామంలో 75 ఇళ్లుంటే 45 మంది IAS !

గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

ప్రాచీనకాలం నుండి హిందూ మతం తన భక్తులకు ఈ రకమైన టెంపుల్స్ ను ఎన్నో అందిస్తుంది. ఆయా కాలాలలో పాలించిన రాజులు కూడా ఈ టెంపుల్స్ ను ఉత్తమ నిర్మాణాలుగా తీర్చిదిద్దారు.

తమ గొప్పదనం చాటుకునేవారు. ఇండియాలో పురాతనమైన టెంపుల్స్ అంటే 2000 కాలం నాటి చరిత్రను కలవి వాటి ప్రత్యేకతలవి ఎన్నో వున్నాయి. ప్రతీ ఒక్కదానికి దాని విశిష్టత దానిదిగా చెబుతారు.

మీకు తెలియని చూడని ఇండియాలోని 6 దేవాలయాలు ఇవే !

ఇక్కడ ఎలుకలను పూజిస్తారు !

ఇక్కడ ఎలుకలను పూజిస్తారు !

రాజస్థాన్ కి బికనీర్ కు దక్షిణంగా 30కి.మీ ల దూరంలో తేస్నోక్ అనే ప్రదేశంలో కర్ణి మాత టెంపుల్ వుంది.ఈ ఎలుకలు కర్ణి మాత అవతారంగా అంటే దుర్గామాత అవతారంగాను, ఆమెకు గల నలుగురు పిల్లల అవతారంగాను నమ్ముతారు. టెంపుల్ ఆవరణలో ఎలుకలు స్వేచ్చగా తిరుగుతాయి.వీటికి పాలు, ఇతర ఆహారాలు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు.

ఒక వైపుకు వాలిపోయిన టెంపుల్ !

ఒక వైపుకు వాలిపోయిన టెంపుల్ !

వారణాశిలోని సింధియా ఘాట్ కు సమీపంలో లీనిన్ టవర్ ఆఫ్ పైజా వలె ఒక వైపుకు వాలిపోయిన ఒక టెంపుల్ వుంది.ఈ టెంపుల్ కూడా దూరం నుంచే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.ఈ టెంపుల్ వాస్తవంగా 1830 లో నిర్మించినప్పటికీ అక్కడి ఘాట్ కారణంగా నదిలో మునిగిందని చెప్తారు.నేడు ఈ శివా టెంపుల్ ను మూసేశారు.ఎలా మునిగింది? ఎందుకు మునిగింది?ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

పగోడా ఆకారం దేవాలయం !

పగోడా ఆకారం దేవాలయం !

మనాలీలోని నాలుగంతస్తుల హిడింబా టెంపుల్ ఒక ప్రత్యేక పగోడ ఆకారంలో వుంటుంది.దీని శిలతీరు తెన్నులు ఇతర ఆలయాలతో పోలిస్తే విభిన్నంగా వుంటుంది.ఈ టెంపుల్ లో హిడింబ దేవి అంటే రాక్షసి హిడింబ సోదరి వుంటుంది.ఈ దేవతను ఆనాడు కుళు రాజవంశీయులు కులదేవతగా పూజించేవారు.

సముద్రంలో మునిగివుండే టెంపుల్ !

సముద్రంలో మునిగివుండే టెంపుల్ !

ఒక టెంపుల్ అదృశ్యం అవటం మళ్ళా కొంతకాలం తర్వాత తిరిగి రావటం వంటివి నమ్ముతారా?నమ్మాలి.వడోదరాకు 40 మైళ్ళ దూరంలో స్తంభేశ్వర్ మహదేవ్ టెంపుల్ వుంది. ఈ టెంపుల్ అరేబియా మహాసముద్రంలో వుంటుంది.అలలు తక్కువగా వుండే సమయంలో దీనిని చూడగలం. అంటే అది సముద్రంలో మునిగుంటుందన్నమాట.అలలు ఎత్తులో వుంటే ఇంకా టెంపుల్ చూట్టం కష్టమే.ఎందుకంటే అది కనపడదుగా.

బ్రహ్మ దేవాలయం

బ్రహ్మ దేవాలయం

ఇది ఒక గొప్ప ఆశక్తి గల టెంపుల్. బ్రహ్మదేవునికి గల ఒకే ఒక్క దేవాలయం పుష్కర్ లో వుంది. ఈ టెంపుల్ ను 14వ శతాబ్దంలో నిర్మించారు.దీనిలో నాలుగు తలల బ్రహ్మదేవుని విగ్రహం వుంటుంది.ఈ టెంపుల్ నిర్మాణం వెనుక ఆశక్తికరమైన కథ ఒకటి వుంది.

చైనీయుల కాళీ టెంపుల్ !

చైనీయుల కాళీ టెంపుల్ !

కలకత్తాలో చైనా టవున్ అనే పేరుతో తామ్గ్రాలో ఒక చిన్న టవున్ వుంది. ఈ ప్రదేశంలో వుండేవారు చైనా రావటంతో ఈ ప్రదేశానికి చైనా టవున్ అనే పేరొచ్చింది.చైనీయులు ఈ గుడికి వచ్చి నూడుల్స్, చాప్స్ వంటివి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు.ఈ చైనీయులందరూ కాళీ మాత భక్తులు.

బులెట్ దేవుడు

బులెట్ దేవుడు

రాజస్థాన్ లోని జోద్పూర్ లో బులెట్ బాబా లేదా ఓం గున్నా అనే గుడి వుంది. ఇక్కడ గుడిలో రాయల్ ఎన్ ఫీల్డ్ బులెట్ వుంటుంది.దానినే ఇక్కడి వారు ఒక దేవుడిగా పూజిస్తారు.ఈ దేవుడికి లిక్కర్ కూడా నైవేద్యంగా పెడతారు. గ్రామస్థులు తమ దేవుడు తమను రోడ్ యాక్సిడెంట్స్ నుంచి కాపాడతారని ప్రగాఢంగా నమ్ముతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X