Search
  • Follow NativePlanet
Share
» »సికింద్రాబాద్ నుంచి వేస‌వి ప్ర‌త్యేక ట్రైన్లు.. వాటి వివరాలివే..!

సికింద్రాబాద్ నుంచి వేస‌వి ప్ర‌త్యేక ట్రైన్లు.. వాటి వివరాలివే..!

మ‌రికొద్దిరోజుల్లో వేస‌వి సెల‌వులు రాబోతున్నాయి. స్కూలు పిల్ల‌లకు, ఉద్యోగుల‌కు దాదాపు రెండు మాసాల‌పాటు వేస‌వి సెలవులుంటాయి. ఈ సెల‌వుల్లో చాలామంది త‌మ సొంతూళ్ల‌కు బ‌యలుదేరుతుంటారు. మ‌రికొంద‌రు పుణ్య‌క్షేత్రాల బాట ప‌డ‌తారు. ఇక‌, ఇప్ప‌డే ప్ర‌యాణాలు చేసేవారి సంఖ్య‌కూడా ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో ప్ర‌యాణికుల‌తో రైళ్లు కిక్కిరిసిపోయుంటాయి. వీటిని గ‌మ‌నంలో ఉంచుకునే ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌యాణికుల‌కు ఓ శుభ‌వార్త‌ను అందించింది. ఆల్రెడీ ఏపీలో స‌మ్మ‌ర్ స్పెష‌ల్ ట్రైన్స్‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సికింద్రాబాద్ నుంచి కూడా ప‌లు ప్రాంతాల‌కు స‌మ్మ‌ర్ స్పెష‌ల్ ట్రైన్ల‌ను ఏర్పాటు చేశారు.

సికింద్రాబాద్ నుంచి బ‌య‌లుదేర‌నున్న ట్రైన్‌..

సికింద్రాబాద్ నుంచి బ‌య‌లుదేర‌నున్న ఈ వేసవి ప్ర‌త్యేక ట్రైన్ వివ‌రాల‌ను ఓసారి చూసేద్దాం. సికింద్రాబాద్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్‌, సాంత్రాగాఛిలతో పాటు కేరళలోని కొల్లంకు వేస‌వి ప్ర‌త్యేక‌ ట్రైన్లను నడిపించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రకటనలు కూడా విడుదల చేశారు. వాటి వివ‌రాలనే ఇప్ప‌డు చూసేద్దాం.. 07223 అనే నెంబ‌ర్ గ‌ల ట్రైన్ సికింద్రాబాద్ నుంచి సాంత్రాగాఛి కి ప్రతి శుక్రవారం ఇక్కడి నుంచి బయల్దేరుతుంది.

summerspecialtrainsfromsecunderabad

ఈ స్పెష‌ల్ ట్రైన్ ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 28 వరకు 11 ట్రిప్పులు రెండు నగరాల మధ్య నడ‌వ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. 07224 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ సాంత్రాగాఛి నుంచి సికింద్రాబాద్‌కు ప్రతి శనివారం తిరుగు ప్రయాణమ‌వుతుంది. ఈ స్పెషల్ రైలు ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 29 వరకు 11 ట్రిప్పులు ప్రయాణికులకు అందుబాటులో ఉండ‌నుంద‌ని అధికారులు వివ‌రించారు. ఈ స‌మ్మ‌ర్ స్పెష‌ల్ ట్రైన్ తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుంది. ఏపీలోని గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, ఒడిశాలోని భువనేశ్వర్‌, కటక్‌, ఖరగ్‌పుర్‌ మీదుగా ఈ ట్రైన్‌ రాకపోకలు సాగిస్తోంది.

ఏపీ, తెలంగాణ‌లోని స్టేష‌న్లు ఇవే..

07225 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వెళ్లే స్పెషల్ ట్రైన్ ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 24 వరకు ప్రతి సోమవారం రాక‌పోక‌ల్ సాగిస్తోంది. షాలిమార్‌-సికింద్రాబాద్‌ ( 07226) ట్రైన్ ఏప్రిల్‌ 16 నుంచి జూన్‌ 25 వరకు ప్రతి మంగళవారం ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ స్పెష‌ల్ ట్రైన్‌లు కూడా 11 ట్రిప్పులు తిరుగనున్నాయి. ఈ స‌మ్మ‌ర్ స్పెష‌ల్ ట్రైన్స్ తెలంగాణ‌లోని కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం స్టేషన్లలో ఆగుతుంది. ఏపీలోని రాయనపాడు, రాజమహేంద్రవరం, దువ్వాడ, ఒడిశాలోని భువనేశ్వర్‌, ఖరగ్‌పుర్‌, సాంత్రాగాఛి మీదుగా రాకపోకలు సాగించనున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

సికింద్రాబాద్ నుంచి కొల్లం...

సికింద్రాబాద్ నుంచి కొల్లం మధ్య కూడా రానుపోను 22 ట్రిప్పుల స్పెషల్ ట్రైన్ న‌డుస్తున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్రకటించింది. 07193 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ సికింద్రాబాద్ నుంచి కొల్లంకు ఏప్రిల్‌ 17, 24, మే 1, 8, 15, 22, 29 జూన్‌ 5, 12, 19, 26 తేదీల్లో రాక‌పోక‌లు సాగించ‌నుంచి తిరుగుప్రయాణంలో కొల్లం నుంచి సికింద్రాబాద్‌ (07194) ట్రైన్ ఏప్రిల్‌ 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్‌ 7, 14, 21, 28 తేదీల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఇక‌, ఈ స్పెష‌ల్ ట్రైన్ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుంది. ఏపీలోని గుంటూరు, ఒంగోలు, రేణిగుంట, తమిళనాడులోని కాట్పాడి, ఈరోడ్‌, కోయంబత్తూరు, కేరళలోని ఎర్నాకుళం, కొట్టాయం, కాయంకుళం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్న‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+