Search
  • Follow NativePlanet
Share
» »ఛ‌త్ పండుగ వేళ‌ బీహార్‌లోని సూర్య‌దేవాల‌యాలు మీకోసం..

ఛ‌త్ పండుగ వేళ‌ బీహార్‌లోని సూర్య‌దేవాల‌యాలు మీకోసం..

ఛత్ పండుగ లేదా ఛత్ పూజ అనేది కార్తీక శుక్ల షష్టి నుండి కార్తీక శుక్ల సప్తమి వరకు నాలుగు రోజుల పాటు జరిగే వేడుక. సూర్యభగవానుడు ఈ పండుగకు కేంద్రబిందువుగా ఉంటాడ‌నేది భక్తుల న‌మ్మ‌కం. ఈ పండుగ‌ను మహిళలు తమ కుటుంబ సంతోషం కోసం ప్రత్యేకంగా ఆచరిస్తారు. ఈ ఏడాది నవంబర్ 17 నుంచి 20 వరకు ఈ పూజలు నిర్వహించనున్నారు. దీపావళి ఆరు రోజుల తర్వాత జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగ‌ను సూర్య షష్టి అని కూడా పిలుస్తారు. ఈ ఛత్ పూజను బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. ఇప్పుడు ఈ పండుగ‌ను ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కూడా నిర్వ‌హించ‌డం మొద‌లుపెట్టారు. ఛత్ పూజ నిజమైన అందాన్ని చూడాలనుకుంటే మాత్రం బీహార్‌లోని ఈ సూర్య దేవాలయాలను త‌ప్ప‌కుండా సంద‌ర్శించాల్సిందే. .

badgaonsuntemple

బద్గావ్ సూర్య దేవాలయం, నలంద

దేశంలోని 12 సూర్యధాములలో నలందాలోని బార్గావ్ సూర్య దేవాలయం ఎంతో ప్ర‌సిద్ధి చెందింది. ఛత్ పండుగ‌ను జరుపుకోవడానికి, దాని వైభవాన్ని చూడటానికి సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ఇక్క‌డ‌కు వ‌స్తుంటారు. ఇక్కడ సూర్యుని చెరువులో స్నానం చేయడం, ఆలయంలోని సూర్య భగవానుని పూజించడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు నయమవుతాయని భ‌క్తులు న‌మ్ముతారు.

ఔంగారి ధామ్

ఔంగారి ధామ్ దేశంలోనే అత్యంత ప్ర‌సిద్ధిచెందిన‌ సూర్య దేవాలయంగా పేరుగాంచింది. దీని తలుపు పశ్చిమం వైపు ఉంటుంది. శ్రీకృష్ణుని మనవడు శంబు రాజు కుష్టు వ్యాధి నుండి ఉపశమనం పొందడానికి ఇక్కడకు వచ్చి పూజలు చేసేవాడ‌ని ఇక్క‌డి వారు చెబుతున్నారు. రాజు ఇక్కడ సూర్య దేవాలయ చెరువును కూడా నిర్మించాడట‌. ఇక్కడ అర్ఘ్యం సమర్పించడం ద్వారా భక్తులు కోరుకున్న ఫలితాలను పొందుతార‌ని వారి ప్ర‌గాఢ విశ్వాసం. ఛత్ పండుగ సమయంలో సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి త‌ర‌లివ‌స్తుంటారు.

suryatemple

సూర్య దేవాలయం, భోజ్‌పూర్

బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా బెలూర్ గ్రామంలో సూర్య దేవాలయం ఉంది. ఛత్ పూజ సమయంలో భక్తులు ఇక్క‌డికి పెద్ద సంఖ్యలో త‌ర‌లి వ‌స్తుంటారు. బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలోని బెలూర్ గ్రామానికి పశ్చిమ, దక్షిణ చివరలో ఉన్న బేలూర్ సూర్య దేవాలయం ఎంతో పురాతనమైనదిగా చెప్పొచ్చు. ఇది రాజు నిర్మించిన 52 చెరువుల్లో ఒకదాని మధ్యలో నిర్మించబడింది. ఈ ఆల‌యంలో ఎలాంటి క‌ల్మ‌షం లేకుండా నిర్మల హృదయంతో ఛత్ ఉపవాసం దీక్ష‌లు ఆచ‌రించిన భ‌క్తుల కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్క‌డివారు చెబుతున్నారు.

దేవ్ సూర్య దేవాలయం, ఔరంగాబాద్

ఛత్ పండుగ బీహార్‌లో నిర్వ‌హించే అతిపెద్ద పండుగ. ఔరంగాబాద్‌లోని దేవ్ సూర్య ఆలయంలో ఛ‌త్ పండుగ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు. ఈ ఆలయాన్ని దేవతల వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ స్వయంగా నిర్మించాడని ఇక్క‌డి వారు చెబుతున్నారు. ఛత్ పూజ సమయంలో ఇక్కడ భారీ జాతర‌ను కూడా ఏర్పాటు చేస్తారు. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో సూర్యదేవునికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రధాన ద్వారం తూర్పుకు బదులుగా పడమర వైపు ఉండ‌ట‌మే విశేషం. ఏడు రథాలపై ప్రయాణించే సూర్యదేవుడు మూడు రూపాల్లో ఇక్క‌డ దర్శనం ఇస్తాడు.

suryatemple ,ranchi

సూర్య దేవాలయం, రాంచీ

జార్ఖండ్ రాజధాని రాంచీ నుండి సుమారు 39 కిలోమీటర్లు ప్రయాణిస్తే బుండు అనే ప్రాంతాన్ని చేరుకోవచ్చు. ఇక్క‌డే ప్ర‌సిద్ధి చెందిన సూర్య‌దేవాల‌యం ఉంది. ఈ ఆల‌యాన్ని పాలరాతితో నిర్మించారు. 18 చక్రాలు, 7 గుర్రాల రథంపై సూర్య భగవానుడు కూర్చున్న అతీంద్రియ దృశ్యం ఇక్కడ మ‌న‌కు ఆగుపిస్తుంది.

More News

    Read more about: patna bihar
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+