Search
  • Follow NativePlanet
Share
» »ఫిబ్ర‌వ‌రి 2 నుండి ప్రారంభం కానున్న సూరజ్‌కుండ్ మేళా...

ఫిబ్ర‌వ‌రి 2 నుండి ప్రారంభం కానున్న సూరజ్‌కుండ్ మేళా...

భార‌తదేశం సంస్కృతి సంప్ర‌దాయాల‌కు పుట్టినిళ్లు. ఇక్క‌డ అనేక సంస్కృతుల వారు వారి క‌ళ‌ల‌ను, సంప్ర‌దాయాలు ప్ర‌ద‌ర్శించేందుకు మేళాలు, జాత‌ర‌లు వంటివి నిర్వ‌హిస్తుంటారు. అలాంటిదే సూర‌జ్‌కుండ్ మేళా. హ‌ర్యానాలో సూరజ్‌కుండ్ మేళా 2024 ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుంది. ఇది ఫిబ్రవరి 18 వరకు కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించే సూరజ్‌కుండ్ ఫెయిర్ కోసం కళాభిమానులు మరియు ప్రయాణ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి ఈ జాతర ప్రారంభం కానుంది.

సుమారు 17 రోజుల పాటు నిర్వహించే ఈ జాతర ఫిబ్రవరి 18న ముగుస్తుంది. 37వ అంతర్జాతీయ సూరజ్‌కుండ్ హస్తకళల ప్రదర్శనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఫిబ్రవరిలో ఎక్క‌డికైనా సంద‌ర్శించాల్సిన ప్ర‌ణాళిక వేస్తుంటే మాత్రం ఈ ఫెయిర్‌ను ఆ జాబితాలో చేర్చండి. ఈ జాతరలో కనిపించే ప్రత్యేకత, టిక్కెట్ ధర ఇతర ముఖ్యమైన సమాచారంతో పాటుగా ప్రత్యేక టికెట్ ఎలా బుక్ చేసుకోవచ్చు వంటి పూర్తి వివ‌రాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

surajkundmela

సూరజ్‌కుండ్ హ్యాండీక్రాఫ్ట్ ఫెయిర్ ప్రత్యేకత...

ఈసారి భారతదేశం, విదేశాల నుండి కళలు, సంస్కృతుల‌ సంగమం ఈ జాతరలో కనిపించ‌నుంది. కళాకారులు జానపద నృత్యాలు, పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆఫ్రికా, యూరప్, ఆసియా దేశాల నుంచి దాదాపు 40 దేశాలు ఈసారి మేళాలో పాల్గొనబోతున్నాయి. భారతదేశం కాకుండా, ఇతర దేశాల హస్తకళలు, జానపద కళల‌ను ప్ర‌త్య‌క్షంగా చూడొచ్చు. అనేక దేశాల చేనేత వస్త్రాలు కూడా ఇందులో క‌నిపించ‌నున్నాయి. సమీపంలోని మెట్రో స్టేషన్, పార్కింగ్ స్థలం నుండి ఫెయిర్ చేరుకోవడానికి ఉచిత ఫెర్రీ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ జాతరకు పెద్దలే కాకుండా పిల్లలు కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ప్ర‌త్యేకంగా వారి కోసం ఇక్కడ కిడ్స్ జోన్ కూడా ఉంది. ఇందులో పిల్లలు వివిధ రకాల స్వింగ్‌లు, రైడ్‌లను ఆస్వాదించొచ్చు.

సూరజ్‌కుండ్ ఫెయిర్ థీమ్...

ఈ ఏడాది సూరజ్‌కుండ్ హ్యాండీక్రాఫ్ట్ ఫెయిర్ థీమ్ గుజరాత్ రాష్ట్రంపై ఉంటుంది. గుజరాత్ రెండోసారి జాతర థీమ్ స్టేట్‌గా ఎంపికైంది. అంతకుముందు 1997లో కూడా గుజరాత్ జాతర థీమ్‌గా ఉండేది. ఈ రాష్ట్ర థీమ్ ప్రకారమే ఇక్కడ జాతరకు సన్నాహాలు చేస్తున్నారు. సూరజ్‌కుండ్ ఫెయిర్ ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల వరకు పర్యాటకుల కోసం తెరిచి ఉంటుంది.

surajkundmela

జాతర టికెట్ ధర సోమవారం నుండి శుక్రవారం వరకు రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది. శని మరియు ఆదివారాల్లో మాత్రం రూ. 180 చెల్లించాల్సి ఉంటుంది.

టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?

సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ హ్యాండీక్రాఫ్ట్ ఫెయిర్ టిక్కెట్‌లను అన్ని ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడకు వచ్చి జాతర టిక్కెట్లు కూడా కొనుగోలు చేయవచ్చు. జాతరలోని అన్ని ప్రవేశ ద్వారాల వద్ద టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. స్వాతంత్ర్య సమరయోధులు, విద్యార్థి సంఘాలకు ఈ జాత‌ర‌లోకి ప్రవేశం ఉచితం. కాలేజీ అమ్మాయిలు, సీనియర్ సిటిజన్లు టిక్కెట్లలో కొంత శాతం తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. జాతరలోకి ప్రవేశించేందుకు మొత్తం 6 గేట్లను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+