Search
  • Follow NativePlanet
Share
» »భారత దేశంలోని స్వయంభూ దేవాలయాలు !

భారత దేశంలోని స్వయంభూ దేవాలయాలు !

శివలింగాలు అనేక ప్రదేశాలలో వాటి అంతట అవే ఆవిర్భవించటం ఒక ఆసక్తికర అంశం. ఇటువంటి దేవాలయాలను స్వయంభూ దేవాలయాలు అంటారు. ఈ వ్యాసం ఇండియా లో బాగా తెలిసిన, ఇప్పటి వరకు సరిగ్గా తెలియని అటువంటి దేవాలయాల గురించి మీకు తెలుపుతోంది.

స్వయంభూ గణపతి టెంపుల్, గణపతి పూలే
గణపతి పూలే లోని స్వయంభూ గణపతి టెంపుల్ లోని గణేషుడి విగ్రహం తెల్లటి ఇసుకతో దాని అంతట అదే ఆవిర్భ వించినది. ఈ స్వయంభూ టెంపుల్ గణపతి పూలే బీచ్ కు సమీపంలో వుంటుంది. కనుక ఈ ప్రదేశం పేరే ఆ దేవాలయానికి పెట్టారు (పూలే అంటే తెల్లటి ఇసుక అని అర్ధం) .

భారత దేశంలోని స్వయంభూ దేవాలయాలు !

శ్రీ అబత్సహఎస్వరార్ టెంపుల్

అలంగుడి లోని అలంగుడి అరుళ్మిగు అబత్సహఎస్వరార్ టెంపుల్, స్వయంభూ హిందూ దేవాలయాలలో ఒకటి. అక్కడ ఆవిర్భవించిన శివలింగానికి ఇది ప్రసిద్ధి. అబత్సహఎస్వరార్ అంటే ' అపాయం నుండి రక్షించేవాడని ' అర్ధం చెపుతారు. ఈ ప్రదేశంలో మాత పార్వతి దేవి తపస్సు చేసి, శివుడిని వివాహం చేసుకుందని చెపుతారు.

అమరనాధ్ గుహలు
అమర నాథ్ గుహ లోని శివలింగం మంచు ఘనీభవించి అక్కడ శివ లింగంగా ఏర్పడిందని నమ్ముతారు. ప్రపంచం నలుమూలలనుండి ఈ శివ లింగాన్ని చూసేటందుకు భక్తులు వస్తారు. మాత పార్వతి ఆమరణ రహస్యాలను గురించి తెలుసుకోవాలని శివుడిని కోరగా, శివుడు, జీవిత రహస్యాలు వేరెవరూ వినకూడదని పార్వతి కి రహస్యంగా చెప్పాలని ఈ గుహకు తీసుకు వచ్చి చెప్పినట్లు విస్వసిస్తారు.

అల్బెలా హనుమాన్ మందిర్ , ముంబై

ముంబై లోని వాడాలా లో కల అల్బెలా హనుమాన్ మందిర్ లో వెలసిన హనుమంతుడి విగ్రహం ఒక అరుదైనడిగా నమ్ముతారు. ఈ టెంపుల్ వెనుక ఒక ఆసక్తికర కధ కలదు. ఒకప్పుడు అడవిగా వున్నా ఈ ప్రదేశంలో ఆ ప్రాంత రాజు ఈ విగ్రహాన్ని కనుగొంటాడు. ఆ విగ్రహాన్ని తనతో తీసుకు వెళ్లాలని భావిస్తారు. కాని కొంత దూరం వెళ్ళే సరికి ఆ విగ్రహం ఆ చోటు నుండి కదలి రాకపోవటంతో , అక్కడే వుండటం హనుమంతుడి కోరిక అనే భావించిన రాజు ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించాడు. ఆ ప్రదేశంలోనే ఒక మందిర నిర్మాణం చేసాడు.

కనక దుర్గ టెంపుల్, విజయవాడ

ఈ టెంపుల్ లో మాత కనక దుర్గా దేవి వెలసి వుంటుంది. ఈ దేవతను ఆంద్ర రాష్ట్రంలోని విజయవాడ పట్టణంకు అది దేవత గా కొలుస్తారు. వేదాలలో కనకదుర్గమ్మ విగ్రహం స్వయంభూ విగ్రహం అని భావిస్తూ ఆమెను ఎంతో శక్తి వంతమైన దేవతగా నమ్ముతారు.

ఈ విగ్రహాలు ఎలా వెలిశాయనేది ఒక వీడని మిస్టరీ. ఈ విగ్రహాలు స్వయంభూ లుగా వాటి కంతట అవే వెలిశాయని నమ్మేవారు ఎంతో మంది ఉన్నప్పటికీ, ఈ అంశాన్ని నమ్మని వారు కూడా లేక పోలేదు.

మీరు ఈ దేవాలయాల శక్తి లేదా మహిమలను గురించి నమ్మినా, నమ్మక పోయినా అవి మాత్రం తప్పక దర్శించ దగిన విలువలు గలవే.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+