Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ కన్నెపిల్లల ఈ ‘శరీర భాగాలు’ లేకుంటే వీరికి ‘ముద్ధ’ కూడా దిగదు?

ఇక్కడ కన్నెపిల్లల ఈ ‘శరీర భాగాలు’ లేకుంటే వీరికి ‘ముద్ధ’ కూడా దిగదు?

తారాపీఠ్ దేవాలయానికి సంబంధించిన కథనం.

By Kishore

భారత దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే దేవాలయం మాత్రం చాలా ప్రత్యేకమైనది. అక్కడ సాధారణ భక్తుల కంటే అఘోరాలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అమ్మవారికి శవ భస్మంతో అర్చన జరుగుతుంది. అంతే కాకుండా దేవాలయం దగ్గర్లో ఉన్న స్మశానంలోనే అఘోరాలు ఉంటూ తాంత్రిక శక్తి కోసం పూజలు చేస్తుంటారు. వారి పూజలు కూడా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ముఖ్యంగా కన్నెపిల్లల శరీర భాగాలు వీరికి చాలా ఇష్టం. ఆ శరీర భాగాలు దొరక్కపోతే వారు విలవిలాడిపోతారు. ముద్ద కూడా ముట్టరు. ఇంతటి విచిత్రమైన దేవాలయం దర్శనం కోసం విదేశాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఆ భక్తులు కూడా తాంత్రిక శక్తుల కోసమే సుమా.

1. యాగం తలపెట్టాడు

1. యాగం తలపెట్టాడు

Image Source:

పూర్వం దక్షప్రజాపతి అనే రాజు ఒక యాగం తలపెట్టాడు. ఈ యజ్జానికి ఆహ్వానం లేకపోయినా దక్షప్రజాపతి కుమార్తే అయిన దాక్షాయినీ తన భర్త అయిన శివుడిని బలవంతంగా ఒప్పించి పెట్టింటిలో జరిగే యాగానికి వెళ్లింది.

2. పశ్చాత్తాప పడింది

2. పశ్చాత్తాప పడింది

Image Source:

అయితే అక్కడ ఆమెను తండ్రితో సహా తోబొట్టువులు ఎవరూ పలుకరించలేదు. దీంతో దీనిని ఆమె అవమానంగా భావించి మిక్కిలి కుమిలిపోయింది. నా భర్త మాట వినకుండా వచ్చానని పశ్చాత్తాప పడింది.

3. ఆత్మహత్యకు

3. ఆత్మహత్యకు

Image Source:

ఇటు పుట్టింటిలో ఉండలేక అటు అవమానం భరించలేక తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఈ విషయం తెలిసిన శివుడ ప్రళయ రుద్రుడయ్యాడు. తన జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు

4. ముల్లోకాలు భయపడుతాయి.

4. ముల్లోకాలు భయపడుతాయి.

Image Source:

అంతే కాకుండా తన భార్య వియోగాన్ని భరించలేక శివుడు పార్వతి దేవి మ`త దేహాన్ని భుజం పై పెట్టుకొని ఆవేశంతో ప్రళయ తాండం చేస్తాడు. దీంతో ముల్లోకాలు భయపడుతాయి. సమస్య పరిష్కారం కోసం విష్ణువు ముందుకు వస్తాడు.

5. సుదర్శన చక్రంతో

5. సుదర్శన చక్రంతో

Image Source:

తన సుదర్శన చక్రాన్ని వినియోగించి పార్వతి దేవి శరీరాన్ని 51 భాగాలు చేస్తాడు. ఆ భాగాలన్నీ పడిన ప్రదేశంలో శక్తి పీఠాలు వెలిశాయి అలా దక్షాయని నేత్రం పడిన ప్రాంతం ఈ తారా పీఠమని ఒక కథనం.

6. హాలాహలం

6. హాలాహలం

Image Source:

మరో కథనం ప్రకారం దేవుళ్లు, రాక్షసులు అమ`తం కోసం సాగర మధనం చేయడానికి పూనుకొంటారు. ఆ సమయంలో కొద్ది సమయం తర్వాత ఈ విశ్వాన్ని అంతటిని దహించి వేసే హాలాహలం సముద్రం నుంచి పుడుతుంది.

7. శివుడు దానిని తాగుతాడు

7. శివుడు దానిని తాగుతాడు

Image Source:

దేవతల కోరిక పై ఈ విశ్వంలోని సమస్త కోటిని రక్షించడానికి వీలుగా పరమేశ్వరుడు ఆ హాలాహాలన్ని తాను తాగుతాడు. అయితే ఆంతటి దేవదేవుడిని కూడా ఆ హాలహలం ప్రభావం వల్ల అస్వస్థతకు గురయ్యి కొద్ది సేపు మూర్చపోతాడు.

8. తారా దేవి రూపంలో

8. తారా దేవి రూపంలో

Image Source:

దీంతో దేవతలు జగన్మాతను ఈ గండం నుంచి కాపాడాల్సిందిగా వేడుకొంటారు. దీంతో జగన్మాత తారా దేవి రూపంలో ప్రత్యక్షమయ్యి ఆ పరమశివుడిని తన ఒడిలోకి తీసుకుని తన స్తన్యం ఇస్తుంది. దీంతో పరమశివుడు కొంత చేతరించుకుంటాడు.

9. స్తన్యం ఇచ్చి

9. స్తన్యం ఇచ్చి

Image Source:

అందుకే ఇక్కడ తారాదేవి పరమశివుడికి స్తన్యం ఇచ్చిన స్థితిలో నల్లటి విగ్రహం ఉంటుంది. అయితే ఈ విగ్రహం మొత్తం ఎల్లప్పుడూ పూలతో కప్పబడి ఉంటుంది. కేవలం అమ్మవారి మొహం మాత్రమే చూడటానికి వీలవుతుంది.

10. కష్టాలన్నీ

10. కష్టాలన్నీ

Image Source:

అందువల్లే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక అమ్మవారి నేత్రాలు పడటం వల్ల ఈ పీఠం మిగిలిన శక్తి పీఠాలతో పోలిస్తే అత్యంత శక్తివంతమైనది పురాణాలు చెబుతాయి.

11. అతీంద్ర శక్తులు

11. అతీంద్ర శక్తులు

Image Source:

అమ్మవారిని కొలిచిన వారికి అతీంద్ర శక్తులు వస్తాయని చెబుతారు. ముఖ్యంగా అమావస్య రోజుల్లో అమ్మవారి విగ్రహానికి అతీతమైన శక్తి వస్తుందని ఆ సమయంలో ఈ దేవిని ఉపాసన చేసిన వారికి తాంత్రిక శక్తులకు రాజవుతాడని చెబుతారు.

12. తాంత్రిక శక్తుల దేవాలయాల రాజధాని

12. తాంత్రిక శక్తుల దేవాలయాల రాజధాని

Image Source:

అందువల్లే ఈ దేవాలయాన్ని తాంత్రిక శక్తుల దేవాలయాలకు రాజధానిగా పేర్కొంటారు. అందువల్లే ఇక్కడకు తాంత్రిక కార్యక్రమాలు నిర్వహించే అఘెరాలు ఎక్కవగా వస్తుంటారు.

13. రెండు విగ్రహాలు

13. రెండు విగ్రహాలు

Image Source:

దేవాలయంలో అమ్మవారికి రెండు విగ్రహాలు ఉంటాయి. ఒక విగ్రహం శివుడికి పాలు ఇచ్చేదిగా ఉంటుంది. ఇది రాతితో తయారయ్యింది. మరొకటి కొన్ని లోహాలను కలిపి తయారు చేసిన విగ్రహం. ఈ విగ్రహంలో అమ్మవారు భయంకరంగా కనిపిస్తారు.

14. చింత నిప్పుల కన్నులతో

14. చింత నిప్పుల కన్నులతో

Image Source:

నాలుగు చేతులతో, చింత నిప్పుల కన్నులతో ఉంటారు. చేతుల్లో ఆయుధాలను కలిగి ఉంటారు. కపాళ హారాన్ని ధరించి చూడటానికి గగుర్పాటు కలిగించేలా ఉంటారు. దీనినే అఘోరాలు ఎక్కువగా పూజిస్తుంటారు.

15. ఒళ్లు గగుర్పాటుకు

15. ఒళ్లు గగుర్పాటుకు

Image Source:

ఈ అఘోరాలు ఈ దేవలయం పక్కన ఉన్న స్మశానంలోనే ఉంటూ అమ్మవారికి పూజలు చేస్తుంటారు. ఇందుకోసం చిన్న కుటీరాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఈ కుటీరాలు చాలా వరకూ ఎముకల నిర్మితం. వారి పూజలు కూడా చాలా విచిత్రంగా ఒళ్లును గగుర్పాటుకు గురిచేసేలా ఉంటాయి.

16. ఎముకలే వస్త్రాలు

16. ఎముకలే వస్త్రాలు

Image Source:

ఇక్కడ అఘోరాలు కూడా చాలా విచిత్రంగా ఉంటారు. స్మశానంలో అప్పుడే కాల్చిన శవం బూడిదను వీరు తమ ఒంటికి రాసుకుంటారు. మనుష్యుల ఎముకలను ముఖ్యంగా పెళ్లికాని వారి భౌతిక కాయం నుంచి వేరు చేసిన ఎముకలు వీరు తమ శరీరం పై వేసుకొంటారు.

17. పుర్రెలు

17. పుర్రెలు

Image Source:

అఘోరాలు ఆహారం తీసుకునే విధానం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లికాని ఆడపిల్ల పుర్రెలు, కటి భాగం (పెల్విక్ బోన్స్, హిప్ బోన్) తో చేసిన ప్రాత్రలో వారు ఆహారాన్ని తీసుకుంటారు.

18. ఇతర పాత్రలో తీసుకోరు

18. ఇతర పాత్రలో తీసుకోరు

Image Source:

ఒక వేళ అవి దొరకకపోతే ఉపవాసం అయినా ఉంటారు కాని వేరొక పాత్రలో ఆహారాన్ని తీసుకోరు. వీరు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. సంవత్సరాల కొద్ది వారు అలాగే ఉండి పోతారు. ఇక అమ్మవారిని కొన్ని ఏళ్లపాటు వారు ఉపాసన చేస్తూ ఇక్కడ ఉండిపోతారు.

19. పశ్చిమ బెంగాల్ లో

19. పశ్చిమ బెంగాల్ లో

Image Source:

ఈ తాంత్రిక దేవాలయం పశ్చిమ బెంగాల్ లోని బీర్బుమ్ జిల్లాలో తారపీఠ్ అనే చిన్న పట్టణంలో ఉంది. ఈ దేవాలయంలో తాంత్రిక పూజలు చేయడానికి విదేశీయులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

20. మ్యాడ్ సైయింట్

20. మ్యాడ్ సైయింట్

Image Source:

భామాచరణ్ చటోపాధ్యాయ అనే వ్యక్తి ఇక్కడ అమ్మవారిని కొలుస్తూ అనేక తాంత్రిక శక్తులు పొందాయని చెబుతారు. అతన్ని పిచ్చి సన్యాసి అని కూడా పిలిచేవారు. ఇతడు తన జీవితం మొత్తం ఈ తారా దేవి ఉపాసనలోనే గడిపాడు. ఈయన ఆశ్రయం కూడా ఈ దేవాలయానికి దగ్గరగా ఉంది.

ఎలా చేరుకోవాలి.

ఎలా చేరుకోవాలి.

Image Source:

కలకత్తా ఎయిర్ పోర్టు నుంచి తారాపీఠ్ కు 216 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నుంచి ప్రేవేటు ట్యాక్సీల ద్వారా తారాపీఠ్ చేరుకోవచ్చు. తొమ్మిది కిలోమీటర్ల దూరంలో రాంపుర్హాట్ రైల్వే స్టేషన్ కలదు. కలకత్తా నుంచి బస్సులు కూడా ఉన్నాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+