Search
  • Follow NativePlanet
Share
» »పురాతన కట్టడాలకు కేంద్రం.. సూర్యాపేట‌

పురాతన కట్టడాలకు కేంద్రం.. సూర్యాపేట‌

పురాతన కట్టడాలకు కేంద్రం.. సూర్యాపేట‌

తెలంగాణ‌లో పర్యాటక ప్రదేశాలకు కొద‌వేలేదు. ఈ రాష్ట్రంలో ఎక్క‌డికి వెళ్లినా సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలు ఆత్మీయంగా ప‌ల‌క‌రిస్తాయి. అలాంటి గ‌మ్మ‌స్థానాల్లో ఒక‌టి ఈ రాష్ట్రానికి చెందిన సూర్యాపేట. సూర్యాపేట జిల్లాలో అతి పురాతన కట్టడాలు సంస్కృతికి అద్దం పడుతాయి. తెలంగాణ- ఆంద్రప్రదేష్‌ రాజాధానులకు 143 కిలో మీటర్ల సమాన దూరంలో ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో అనేక అపురూప కట్టడాలు పర్యాటక ప్రదేశాలుగా కొనసాగుతున్నాయి.

జిల్లాలో చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలు పర్యాటకులకు కను విందుగొలుపుతాయి. పురాతన కట్టడాలు, ఎతైన కొండలు, దట్టమైన అడవులు, ప్రాచీన శిలాయుగం నాటి రాక్షసగుళ్ళు, క్రీస్తు పూర్వం నాటి భౌద్దస్తూపాలు, కాకతీయుల కాలంనాటి ప్రసిద్ధి శివాలయాలు, అపురూప శిల్పలు, మండపాలు, మూసి రిజర్వయర్‌ ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలకు నిలయం సూర్యాపేట జిల్లా

మ‌న‌సుదోచే పిల్లలమర్రి

మ‌న‌సుదోచే పిల్లలమర్రి

సరిగ్గా జిల్లా కేంద్రానికి కేవ‌లం మూడు కిలో మీటర్ల దూరంలో 65 నెంబర్‌ జాతీయ రహదారికి కిలో మీటర్‌ దూరంలో ఉన్న పిల్లలమర్రి గ్రామం కాకతీయుల కాలంనాటి శివాలయాలు వారి కాళా నైపుణ్యానిక అద్దం పడుతున్నాయి. క్రీస్తుశ‌కం 1203లో కాకతీయ సామంతరాజు అయిన రేచర్ల వంశానికి చెందిన బేతిరెడ్డి పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించినట్లు శిలాశాసనాలు తెలుపుతున్నాయి.

ఇక్కడ నిర్మించిన శివాలయాలు ఎంతో ప్రసిద్ది చెందాయి. ఎర్రకేశ్వర ఆలయం, త్రికూటేశ్వరాలయం, నామేశ్వరాలయాలు కాకతీయుల కళానైపుణ్యానికి అద్దం పడుతాయి. శిలాశాసనాలు, వైవిద్యభరితమైన శిల్పాలు ఈ ఆలయాలలో ఉంటాయి. సప్త స్వరాలను వినిపించే రాలిస్తంబం, రాతి కట్టడాలు ఇక్కడి ప్రత్యేకత. ఈ దేవాలయాలలో వార్షిక ఉత్సవాలు ఫిబ్రవరి- మార్చి మాసంలో జరుగుతాయి. ఇక పిల్లలమర్రి పినవీరభద్రుడు జన్మించిన గ్రామం పిల్లలమర్రి.

ప్రసిద్ధ భౌద్ధక్షేత్రం చూడాల్సిందే

ప్రసిద్ధ భౌద్ధక్షేత్రం చూడాల్సిందే

ఫణిగిరి కొండపై 16 ఎకరాల విస్తీర్ణంలో క్రీ. పూ 1-3 ఎడి శతాబ్దం నాటి భౌద మహాస్తూపం, మందమైన ఇటుకలతో నిర్మాంచిన చైత్యగదులు, విహారాలు, పాలరాతి శిల్పాలు, భౌద జాతక కథలతో చెక్కిన తోరణాలు, బ్రహ్మలిపిలో ఉన్న శిలా శాసనాలు ఈ ప్రాంత ప్రత్యేకతను చాటుతాయి. పురావస్తుశాఖ జరిపిన తవ్వకాలలో రోమన్‌ రాజుల కాలంనాటి బంగారు, వెండి, గాజు, రాగి, నాణాలు దొరికాయి.

వీటియి కొండపై భద్రపరిచారు. ఇలా తొవ్వకాలలో బయటపడిన వస్తువులు ప్రాచీన కాలం నాటి ఆనవాళ్లకు ఆధారాలుగా నిలుస్తున్నాయి. జిల్లా కేంద్రానికి 40 కిలో మీటర్ల దూరంలో జనగాం రహదారిపై ఉన్న ఫణిగిరి గ్రామం ప్రసిద్ద బౌద్ధక్షేత్ర పర్యాటక ప్రదేశంగా వెలుగొంతున్నది.

చారిత్రక కట్టడాల ఉండ్రుగొండ

చారిత్రక కట్టడాల ఉండ్రుగొండ

జిల్లా కేంద్రానికి 8 కిలో మీటర్ల దూరంలో జాతీయ రహదారికి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉండ్రుగొండ చారిత్రక కట్టడాలకు పెట్టింది పేరు. రాష్ట్రంలోనే అత్యంత పొడవైన పురాతన గిరిదుర్గంగా ప్రసిద్ధి పొందిన కట్టడాలు ఉన్న ప్రాంతం ఉండ్రుగొండ. చుట్టు కొండలు, దట్టమైన అడవి మద్య ఆద్యత్మికత ఉట్టి పడే విధంగా లక్ష్మీ నర్సింహ్మస్వామి ఆలయం ఉంటుంది. దేశంలోనే ప్రసిద్ధి పొందిన ఉండ్రుగొండ కోట చరిత్రకు నిలువెత్తు నిదర్శనం.

1370 ఎకరాల విస్తీర్ణంలో నిగనిగలాడే చెట్ల చెట్ల మద్య 9 కొండలను కలుపుతూ 14 కిలో మీటర్ల పొడవులన నిర్మించిన ఎత్తైన దుర్గప్రాకారాలు, కొలనులు, కొండపైన ఉన్న గొలుసుకట్టు నీటి కుంటలు, గృహాల దార్మికతను వెల్లివిరిసే పురాతన దేవాలయాలు ఉండ్రుగొండ ప్రత్యేకత. శాతవాహనులు, కళ్యాణచాళుక్యులు, కాకతీయులు, కుతుబ్‌షాహాన్‌లు, రేచర్లరెడ్డి రాజులు, పద్మనాయకులు ఈ కోటను అభివృధ్ది చేసినట్లు శాసనాలు తెలుపుతున్నాయి.

ఈ గుట్టలపై శ్రీ లకక్ష్మీ నరసింహస్వామి, గోపాలస్వామి, కాలభైరవుడు, రాజభవనాలు, నర్తకీమణుల గృమాలు, బోగందానిగద్దెమంటపం, చాకలిబావి, మంత్రిబావి, నాటి చారిత్రక వైభవానికి ప్రతీకలుగా ఉన్నాయి. కొండపై నుంచి నాగుల పాహడ్‌శివాలయం వరకు సొరంగమార్గం ఉండేదని ఈ ప్రాంత ప్రజలు చెపుతుంటారు.

More News

    Read more about: telangana
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+