Search
  • Follow NativePlanet
Share
» » గోవా లో వీధి షాపింగ్ మార్కెట్ లు!

గోవా లో వీధి షాపింగ్ మార్కెట్ లు!

ప్రపంచం లో గోవా ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. గోవా అక్కడ కల వీధి షాపింగ్ ప్రదేశాలకు ప్రసిద్ధి. గోవా లోని వివిధ ప్రదేశాలలో కల ఈ వీధి షాపింగ్ లు అసలైన గోవా హెండి క్రాఫ్ట్స్ మరియు వివిధ రకాల కళా వస్తువులు కొనేటందుకు అనుకూలంగా వుంటాయి. ఇక్కడి కొనుగోళ్ళు, సరసమైన ధరలలో పొదుపు గా కూడా వుంటాయి. గోవా లోని ఈ వీధి షాపింగ్ లు మరియు బీచ్ మార్కెట్ అమ్మకాల గురించి అక్కడ లభ్యం అయ్యే వివిధ వస్తువుల గురించి కొనే ముందు తప్పక కొంత సమాచారం తెలుసుకోవాలి.

అంజున మార్కెట్
అంజున మార్కెట్ ఒకప్పుడు హిప్పీ ల మార్కెట్ గా వుండేది. నేడు ఈ అంజునా మార్కెట్ గోవా లో ఒక పెద్ద షాపింగ్ ప్రదేశం అయిపొయింది. ప్రతి బుధవారం ఈ మార్కెట్ జరుగుతుంది. ఇది మొదటగా 1980 లలో దాని అమ్మకాలు మొదలు పెట్టింది, అప్పటి నుండి నిరాటంకంగా ఇక్కడ అమ్మకాలు, కొనుగోళ్ళు జరిగిపోతున్నాయి. టూరిస్ట్ లు ఇక్కడ నకలు ఫాషన్ నగలు, ఎలక్ట్రానిక్ గూడ్స్, హేండి క్రాఫ్ట్స్, పెయింటింగ్ లు, మిర్రర్ పనితనం కల కోట్లు,దుస్తులు, ఫాషన్ కలిగిన పై దుస్తులు మొదలగునవి కొంటారు.

ఈ వీధి బజారు పూర్త్లిగా అమ్మకం దార్ల తో నిండి వుంటుంది. దేశ వ్యాప్తంగా వచ్చిన పర్యాటకులకు వివిధ రకాల వస్తువులు అమ్ముతుంది. ఉదయం 10:30 గం. లకు తెరిచిన ఈ మార్కెట్ సాయంత్రం 6:30 వరకూ సాగుతుంది. ఈ కొనుగోళ్ళు అమ్మకాలు అంజునా బీచ్ కు దక్షిణ భాగంలోని దండో వద్దో వద్ద అధికంగా జరుగుతాయి. అంజునా మార్కెట్ సెప్టెంబర్ నుండి మార్చ్ వరకూ జరుగుతుంది. ఈ సమయంలో ప్రపంచ వ్యాప్త పర్యాటకులు, గోవా సందర్శిస్తారు.

శని వారం నైట్ బజార్
బుధ వారం నిర్వహించిన అంజున మార్కెట్ లోనే, శనివారాలు, నైట్ బజార్ లు నిర్వహిస్తారు. ఇక్కడి వస్తువులలో స్థానిక బ్రాండ్ లు అధికంగా వుంటాయి. ఈ మార్కెట్ చరిత్ర మూలాలు కూడా హిప్పీ ల కాలం నాటివే. ఈ మార్కెట్ లో అమ్మకం దారులు ప్రతి ఒక్క వస్తువు అమ్ముతారు. ఈ శనివారం బజారు, రాత్రి 7 గంటలకు మొదలై, సుమారుగా, అర్ధ రాత్రి తర్వాత తెల్లవారి 1 గంట వరకూ కూడా వుంటుంది. ఈ మార్కెట్ నవంబర్ నుండి మార్చ్ వరకూ గల వింటర్ సీజన్లో వుంటుంది.

శుక్రవారం బజార్ - మాపూసా
మాపూసా లో నిర్వహించే మార్కెట్ చాలా ప్రసిద్ధి చెందినది. స్థానిక అమ్మకం దార్లు, హిప్పీలు వివిధ రకాల వస్తువులు, వంటలకు అవసరమైన మసాలా వస్తువుల నుండి మంచి తోలు వస్తువులు, బ్యాగులు, కోట్లు , దుస్తులు , వంటివి ఎన్నో అమ్ముతారు. సముద్రపు చేప విరివిగా దొరుకుతుంది. వెదురు వస్తువులు అనేక రకాలు కూడా ఇక్కడ సరసమైన ధరలలో దొరుకుతాయి. గోవా ఫ్రైడే బజార్ మాపూసా మునిసిపల్ మార్కెట్ లో నిర్వహిస్తారు. ఇది ఉదయం 8 గం. నుండి సా. 7 గం. వరకూ అమ్మకాలు సాగిస్తుంది. ఇక్కడ మీరు జీడిపప్పు, జీలకర్ర, గోవా పచ్చళ్ళు, సాల్ట్ ఫిష్ వంటివి తప్పక కొని తిని ఆనందించాలి. ఇక్కడ కొనే వారు ఎక్కువగా బేరసారాలు చేయటం చేయాలి. టూరిస్ట్ లు ఇక్కడ దొరికే తాజా, రుచికర వేడి బన్నులు, బ్రెడ్ కూడా కొని తింటారు.

 గోవా లో వీధి షాపింగ్ మార్కెట్ లు!

ఇంగోస్ సాటర్ డే నైట్ మార్కెట్
ఈ మార్కెట్ గోవా లో ప్రసిద్ధ మార్కెట్. దీనిని బాగా బీచ్ సమీపంలో కల అర్పోరా గ్రౌండ్స్ లో నిర్వహిస్తారు. ఇక్కడ టూరిస్ట్ లు వివిధ రకాల చేతి తయారీ లెదర్ చెప్పులు, అందమైన ఆభరణాలు, ఇంకా ఇతర కళా వస్తువులు కొనవచ్చు. ఇక్కడ మీకు భవిష్యత్తు చెప్పే, సోదే వారు లేదా జోస్యం చెప్పు వారు కూడా దొరుకుతారు. ఆసక్తి కల పర్యాటకులు ఇక్కడ కల టాటూ పార్లర్లు కూడా ఉపయోగించుకొనవచ్చు. వివిధ రకాల డిజైన్ లను వారి శరీరాల పై వేయిన్చుకోనవచ్చు.

రుచికర ఆహారాలు
పర్యాటకులు, గోవా , చైనీస్ మరియు తాయ్ ఆహారాలను కడుపు నిండా ఈ మార్కెట్ లో తిని ఆనందించవచ్చు. దొమ్మరి వారు , స్థానిక సంగీతకారులు, బెల్లీ డాన్సర్ లు, వంటి వారు బాగా ఆకర్షిస్తారు. ఈ మార్కెట్ ఉదయం 7 గం. నుండి అర్ధ రాత్రి 1 గంట వరకూ కూడా తెరిచే వుంటుంది. ఈ మార్కెట్ నవంబర్ నుండి మార్చ్ వార్తకూ నడుస్తుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+