Search
  • Follow NativePlanet
Share
» »నాగార్జున సాగ‌ర్ టూర్ పేరుతో తెలంగాణ టూరిజం అందిస్తోన్న స‌రికొత్త ప్యాకేజీ...

నాగార్జున సాగ‌ర్ టూర్ పేరుతో తెలంగాణ టూరిజం అందిస్తోన్న స‌రికొత్త ప్యాకేజీ...

రెండు తెలుగురాష్ట్రాల్లో ప్ర‌స్తుతం ద‌స‌రా సెల‌వులు కొన‌సాగుతున్నాయి. ఈ త‌రుణంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉండే చాలామంది ఈ సెల‌వుల్లో స‌మీపంలోని ప్రాంతాల‌ను సంద‌ర్శించేందుకు బ‌య‌లుదేరుతుంటారు. అలాంటివారికోసం తెలంగాణ టూరిజం ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్‌లో భాగంగా నాగార్జున సాగర్ అందాలను ప్ర‌త్య‌క్షంగా వీక్షిస్తూ బోటు షికారు చేయొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ తెలంగాణ టూరిజం అతి తక్కువ ధరలోనే ప‌ర్యాట‌కుల‌కు అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ ట్రిప్ ప్రారంభ‌మ‌వుతుంది. కేవలం రూ. 800 టికెట్ ధరతోనే ఈ ప్యాకేజీ ఉంటుంది. ఈ టూర్ షెడ్యూల్‌తో పాటు మరిన్ని వివరాలను కూడా ఇక్క‌డ చూసేయొచ్చు.

నాగార్జున సాగ‌ర్ టూర్ పేరుతో..

ఈ ప్యాకేజీలో భాగంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుతో పాటు సమీపంలో ఉన్న అద్భుతమైన ప్రాంతాలను కూడా చూసే అవ‌కాశం ఉంటుంది. ఇదంతా కేవలం ఒక్క‌రోజు ప‌ర్య‌ట‌న‌లోనే జ‌రుగుతోంది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ అవుతోంది. ప్రతి శని, ఆదివారం తేదీల్లో ఈ ప్యాకేజీ ప్ర‌యాణికుల కోసం ఉంటుంది. అయితే, ప‌ర్యాట‌కులు అంతకంటే ముందుగానే టిక్కెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇత‌ర పూర్తి సమాచారం కోసం లేదా టిక్కెట్లు బుకింగ్ కోసం ప‌ర్యాట‌కులు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను https://tourism.telangana.gov.in/ స‌ంప్ర‌దించ‌గ‌ల‌రు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఈ నెల (అక్టోబర్) 12, 13వ తేదీల్లో ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ తేదీలు మిస్ అయితే, మ‌రో తేదీల్లో ఈ జ‌ర్నీ ప్లాన్ చేసుకునే అవ‌కాశం కూడా ఉంది. ఈ ప్యాకేజీ Nagarjuna sagar Tour ' పేరుతో తెలంగాణ టూరిజం ఆప‌రేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి బస్సులో(నాన్ ఏసీ కోచ్) ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది.

nagarjunasagartour Hyderabad

ప్యాకేజీ ధ‌ర‌లివే..

హైదరాబాద్ టు నాగార్జున సాగర్ టూర్ ప్యాకేజీ ధ‌ర‌లిలా ఉన్నాయి. పెద్దలకయితే రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. అదే చిన్న‌పిల్ల‌ల‌కయితే రూ. 640 చెల్లించాలి. ఇంత అందుబాటు ధ‌ర‌ల్లో ఈ ప్యాకేజీని ప్ర‌క‌టించ‌డంతో మంచి డిమాండ్ పెరిగింద‌ని అధికారులు చెబుతున్నారు.

టూర్ ప్యాకేజీ షెడ్యూల్ ఇదే..

ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 7.30 గంటలకు హైద‌రాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి బస్సు జర్నీ ప్రారంభ‌మ‌వుతంది. ఇదే బస్సు ఎనిమిది గంట‌ల స‌మ‌యానికి బషీర్ బాగ్ చేరుకుంటుంది. ఉదయం 11:30 గంటలకి నాగార్జున సాగర్‌కు చేరుకుంటారు. అనంత‌రం అక్క‌డి నుంచి ఉదయం 11:40 గంట‌ల‌కు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన బుద్దవనం ప్రాజెక్ట్ కు ప్ర‌యాణం ఉంటుంది. ఆ త‌ర్వాత మ‌ధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది.

nagarjunasagartour Telangana

అనంత‌రం నాగార్జునకొండ కు లాంచీలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్క‌డ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ వంటి ప్ర‌దేశాల సంద‌ర్శ‌న ఉంటుంది. సాయంత్రం నాలుగు గంటలకు నాగార్జున సాగర్ డ్యామ్ ప‌ర్య‌ట‌న ఉంటుంది. ఆ త‌ర్వాత‌ సాయంత్రం ఐదుగంట‌ల‌కు నాగార్జున సాగర్ నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది. రాత్రి తొమ్మిది గంటలకు హైదరాబాద్ చేరుకోవ‌డంతోఈ ఒన్ డే ట్రిప్ ముగుస్తోంది. మ‌రెందుకాల‌స్యం కుటుంబ‌స‌మేతంగా మీ ప్రయాణానికి సిద్ధంకండి..హ్య‌పీ జ‌ర్నీ..

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+