Search
  • Follow NativePlanet
Share
» »పుస్త‌క ప్రియుల‌ను విశాఖ‌లోని ఓల్డ్‌ బుక్ మార్కెట్ పిలుస్తోంది!

పుస్త‌క ప్రియుల‌ను విశాఖ‌లోని ఓల్డ్‌ బుక్ మార్కెట్ పిలుస్తోంది!

పుస్త‌క ప్రియుల‌ను విశాఖ‌లోని ఓల్డ్‌ బుక్ మార్కెట్ పిలుస్తోంది!

విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ తర్వాత, ఇది ఈ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ కాలంలో కూడా ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా వెలుగొందింది. ప్రస్తుత కాలంలో ప్రపంచంలో కొన్ని ప్ర‌ముఖ‌ నగరాలు కలిగి ఉన్న ప్రత్యేక భౌగోళిక స్థానాన్ని పంచుకుంటుంది. ఈ నగరం పశ్చిమ సరిహద్దులో కొండలతో మరియు తూర్పు వైపున బంగాళాఖాతం కలిగి ఉంది.

ప్రముఖ ఓడరేవు నగరంగా ఉండటంతో పాటు ఉష్ణమండల బీచ్‌లతో కూడిన అందంతో నిత్యం సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షిస్తూనే ఉంది. ఈ కార‌ణంగానే ప్రతి సంవత్సరం చాలా మంది దీనిని ప‌ర్యాట‌కులు ఇక్క‌డ సేద‌దీరేందుకు క్యూ క‌డుతుంటారు. అయితే, విశాఖపట్నంలో షాపింగ్ చేయడం గొప్ప‌ అనుభూతిని కలిగిస్తుంది. ఇది కార్పొరేట్ నగరంగా మాత్రమే కాకుండా అద్భుతమైన పర్యాటక ఆకర్షణగా కూడా ఉండ‌డంతో షాపింగ్‌కు కేంద్ర‌బిందువుగా మారిపోయింది.

theoldbookmarket1

మీరు ఫిక్షన్ & నాన్ ఫిక్షన్ పేజీలతో మిళ‌త‌మైన అకడమిక్ పుస్తకాలను కొనాలని చూస్తున్నట్లయితే వైజాగ్ మీకు ఆహ్వానం ప‌లుకుతుంది. ఇక్క‌డి పూర్ణామార్క‌ట్ ద‌గ్గ‌ర‌లోని ఓల్డ్‌ బుక్ మార్కెట్ అలాంటి వారికి సరైన ప్రదేశంగా పేరుగాంచింది. బ్యారక్స్ ప్రాంతంలో కూడా, సెకండ్ హ్యాండ్ పుస్తకాలను కొనుగోలు చేయడానికి మంచి దుకాణాలు ఉన్నాయి. ఎక్కువ‌గా సంద‌ర్శ‌కులు దీనిని అకడమిక్ పుస్తకాల కోసం ఇష్టపడతారు. పేరుకు త‌గ్గ‌ట్టుగానే ఇక్క‌డ దొర‌క‌ల‌ని పుస్త‌కాలు అంటూ ఏవీ ఉండ‌వంటే న‌మ్మండి. పురాత‌న ఇతిహాసాలు, చారిత్ర‌క నేప‌థ్యంపై ఆస‌క్తి ఉన్న‌వారికి ఈ మార్కెట్ స్వ‌ర్గ‌ధామంగా చెబుతారు.

మీ పుస్త‌కాల‌ను విక్ర‌యించ‌వ‌చ్చు..

ఈ మార్కెట్‌లో ఇంకో ప్ర‌త్యేక‌త కూడా ఉంది. మీ ద‌గ్గ‌ర ఉన్న పుస్త‌కాల‌ను ఇక్క‌డ విక్ర‌యించేందుకు కూడా అవ‌కాశం ఉంది. మీరు నిర్ణ‌యించే ధ‌ర‌ల‌ ఆధారంగా మీ పాత పుస్తకాలను విక్రయించవచ్చు. అలాగే, మీ ద‌గ్గ‌ర ఉన్న పుస్త‌కాలను ఇచ్చి, మీకు కావాల్సిన పుస్త‌కాల‌ను తీసుకువెళ్లే వెసులుబాటు కూడా ఇక్క‌డ ఉందండోయ్‌. బ‌య‌టి మార్కెట్‌లో ఈ అవ‌కాశం ఉన్న పుస్త‌క మార్కెట్ బ‌హుశా ఇదే కావ‌చ్చు.

theoldbookmarketvishaka1

మీరు మంచి నవలల కోసం నిరంతరం వెతుకుతున్న పాఠకులైతే, ఈ స్థలం మీకు మంచి గ‌మ్య‌స్థానంగా చెప్పొచ్చు. ఈ మార్కెట్‌లో ప్ర‌ధానంగా సెకండ్ హ్యాండ్ పుస్తకాల కొనుగోలు, మీ పుస్తకాల‌ మార్పిడి చేసుకోండి, మీ పాత పుస్తకాలను విక్రయించండి. పుస్తకాలతో పాటు మీకు ఆకలిగా అనిపించినప్పుడు మ‌న‌స్పూర్తిగా ఆర‌గించేందుకు మంచి ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్క‌డి చుట్టుప‌క్క‌ల అందుబాటులో ఉన్నాయి.

ఇక్క‌డికి చేరుకునేందుకు పూర్తి చిరునామాః పోలీస్ బ్యారక్స్, పూర్ణా మార్కెట్, జగదాంబ జంక్షన్, విశాఖపట్నం. అందాల న‌గ‌రం విశాఖ చేరుకునేందుకు రోడ్డు, రైలు, విమాన సౌక‌ర్యాలు ఉన్నాయి. పూర్ణా మార్కెట్‌, ఓల్డ్ బుక్ మార్కెట్‌కు ఆర్‌టీసీ బ‌స్ స్టాండ్‌, రైల్వే స్టేష‌న్ నుంచి నిత్యం బ‌స్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. అలాగే, ఉద‌యం తొమ్మిది నుంచి రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కూ మార్కెట్ తెర‌చి ఉంటుంది. ఆదివారం మాత్రం ఓల్డ్ బుక్ మార్కెట్‌ షాపింగ్‌కు ప్లాన్ చేయ‌వ‌ద్దు. ఆ రోజు మార్కెట్ మూసివేయ‌బ‌డి ఉంటుంది.

More News

    Read more about: old book market visakhapatnam
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+