Search
  • Follow NativePlanet
Share
» »ఓనం వేడుక చూసేందుకు.. కేర‌ళ‌లోని ఉత్త‌మ ప్రాంతాలు ఇవే..!

ఓనం వేడుక చూసేందుకు.. కేర‌ళ‌లోని ఉత్త‌మ ప్రాంతాలు ఇవే..!

ఓనం వేడుక చూసేందుకు.. కేర‌ళ‌లోని ఉత్త‌మ ప్రాంతాలు ఇవే..!

కేరళలో జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగల్లో ఓనమ్ ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఎంత బాగా జరుపుకుంటామో కేరళలో అంతే సందడిగా ఓనమ్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఉత్తర భారతదేశంలో హోలీ, దీపావళికి ఎంత ప్రాధాన్యత ఉందో కేరళలో ఓనమ్‌కి అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో, రైతులు తాము పండించిన పంట కోతకు రావడంతో అందుకు ఆనందపడుతూ చేసుకునే పండగ ఇది. పురాణాల ప్రకారం.. ప‌ది రోజుల ఓనమ్ పండగను గొప్ప మహా రాజైన మహాబలిని ఆహ్వానించే సంజ్ఞగా జరుపుకుంటారు.

ఓనమ్ సందర్భంగా ఆ గొప్ప రాజుకు చెందిన ఆత్మ ఆ రాష్ట్రానికి వస్తుందని వాళ్ల నమ్మకం. ఈ స‌మ‌యంలో కేరళ మొత్తం పెళ్లికూతురులా ముస్తాబ‌వడం చూస్తాం. రంగోలీతో అలంకరించబడిన ఇళ్ళు, ఇళ్ల నుండి వచ్చే వంటకాల సువాసన, సాంప్రదాయ దుస్తులలో ఓనం జరుపుకునే ప్రజలు, ఇలాంటివి ఈ సమయంలో జరుగుతాయి. కేరళ అందాలను చాలా సార్లు చూసి ఉంటారు. కానీ ఇలాంటి ప్ర‌త్యేక సంద‌ర్భంలో కేర‌ళ‌ను సంద‌ర్శిస్తే ఓనం జ‌రుపుకునే తీరు, ఇక్క‌డి ఆచారాలు, సంప్ర‌దాయ‌లు అన్నింటిని తెలుసుకోవ‌చ్చు. ఓనం సందర్భంగా కొన్ని ప్రదేశాలలో ఎంతో సరదాగా ఉంటుంది. కాబట్టి కేర‌ళ‌లోని కొన్ని ఓనం జ‌రుపుకునే ప్ర‌దేశాల‌ను సంద‌ర్శిద్దాం ప‌దండి.

1

త్రిస్సూర్

త్రిస్సూర్‌లో కూడా ఈ వేడుక ఘనంగా నిర్వహిస్తూ పులి వేషం ధరించిన వారికి బహుమతులు ప్రదానం చేస్తుంటారు. అంతేకాదు ఓనం పండుగలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో అందంగా ముస్తాబై యువత ఓనం పాటలు పడుతూ.. ఎత్తైన కొమ్మ మీద తాడు వేసి ఊయల కట్టి అందులో కూర్చొని ఒకరికొకరు ఊపుకుంటూ ఆనందంగా వేడుకలను జరుపుకుంటారు. ఈ ప్రదేశం దేవాలయాలకు చాలా ప్రసిద్ది చెందింది. ఇక్కడ 'వడక్కుమనాథన్' అనే పేరుతో చాలా పెద్ద శివాలయం ఉంది. వీరి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఓనం సందర్భంగా ఇక్కడికి రావడం ద్వారా సంప్రదాయ పులి నృత్యాన్ని చూడవచ్చు. ఈ సందర్భంగా ఇక్క‌డ పులిక్కలి అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వ‌హిస్తారు. త్రిస్సూర్‌ను పండుగల భూమి అని ముద్దుగా పిలుచుకుంటారు.

అలెప్పి

అలెప్పీ కేరళలోని అత్యంత అందమైన ప్రదేశం. ఇది సంవత్సరంలో చాలా నెలలు పర్యాటకులతో నిండి ఉంటుంది. ఓనం సందర్భంగా ఈ నగరం కూడా పెళ్లికూతురులా ముస్తాబై ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంఇ. అలెప్పీ బ్యాక్ వాటర్స్ లో తిరుగుతూ అందమైన పల్లెటూర్లను చూడటం, అక్కడి వంటకాలను రుచి చూడటం వేరు. ఇక, ఓనమ్ స‌మ‌యంలో అయితే ఇక్కడ ఒకేసారి అనేక వంటకాలను రుచి చూడొచ్చు. పున్నమడ సరస్సులో స్నేక్ బోట్ రేస్ చూసేందుకు ఇత‌ర‌ దేశాల నుంచి, సూదుర ప్రాంతాల నుంచి ప‌ర్యాట‌కులు త‌ర‌లి వస్తుంటారు. ఈ పడవ పోటీని వల్లంకలి అని కూడా అంటారు.

2

పాలక్కాడ్

ఓనం సంద‌ర్భంగా కేర‌ళ వచ్చినప్పుడు త‌ప్ప‌కుండా పాల‌క్కాడ్ సంద‌ర్శించాల్సిందే. ఎందుకంటే, మధ్య, ఉత్తర కేరళలో ఓనం పండుగలో ప్రదర్శించబడే ప్రత్యేక కుస్తీ క్రీడను ఓనతల్లు అని పిలుస్తారు. ఇది చాలా వరకు కుస్తీ లాంటిదే. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ఢీకొని ఒకరినొకరు విసిరేందుకు ప్రయత్నించుకుంటారు. ఇది ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆట‌. ఎన్నో సంవత్సరాలుగా మధ్య-ఉత్తర కేరళలో ఆచరించబడుతూ వ‌స్తున్న ఆచారం ఇది. మ‌ధ్యాహ‌న్నం భోజన అనంత‌రం ఓనతల్లు పోటీని నిర్వ‌హిస్తారు.

More News

    Read more about: onam celebration
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+