Search
  • Follow NativePlanet
Share
» »దేశంలో వ‌చ్చే ఏడాది ప్రారంభం కానున్న హిందూ దేవాల‌యాలు ఇవే..

దేశంలో వ‌చ్చే ఏడాది ప్రారంభం కానున్న హిందూ దేవాల‌యాలు ఇవే..

మ‌రికొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్ట‌బోతున్నాం . న్యూయ‌ర్ సంద‌ర్భంగా చాలామంది కొత్త కొత్త ఆలోచ‌న‌లు చేస్తుంటారు. కొత్త కొత్త ప్ర‌దేశాల‌కు వెళ్లాల‌ని కూడా చాలామంది అనుకుంటుంటారు. భార‌త‌దేశంలో పురాత‌న దేవాల‌యాలు ఎన్నో ఉన్నాయి. అవి నిర్మాణాల‌కు ఎంత‌గానో ప్ర‌సిద్ధిచెందాయి. అయితే వాటిని చూసేందుకు దేశ విదేశాల నుంచి ప‌ర్యాట‌కులు త‌ర‌లి వ‌స్తుంటారు. ఇక వ‌చ్చే ఏడాది అంటే 2024లో దేశంలో ఎన్నో ప్ర‌ముఖ దేవాల‌యాలు ప్రారంభం కానున్నాయి. అవి వాటి అద్భుత‌మైన నిర్మాణాల‌కు ప్ర‌సిద్ధిచెంద‌డ‌మే కాకుండా, సాంస్కృతిక గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేయ‌నున్నాయి. రండి ఆ దేవాల‌యాల గురించి తెలుసుకుందాం.

viratramayanatemple

విరాట్ రామాయణ దేవాలయం

విరాట్ రామాయ‌ణ దేవాల‌యం బీహార్‌లోని తూర్పు చంపారన్‌లో ఉంది. దీనిని 'ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ దేవాలయం' గా అభివ‌ర్ణిస్తారు. ఈ ఆల‌య నిర్మాణం 2023 జూన్ 20న ప్రారంభమైంది. దీనికి మాజీ IPS అధికారి ఆచార్య కిషోర్ కునాల్, మాజీ చీఫ్ జస్టిస్ S.N. ఝా పునాది రాయి వేశారు. విరాట్ రామాయణ దేవాలయం, 2024 చివరి నాటికి రూ.500 కోట్లతో పూర్తి కానుంది. దీని ఎత్తు కంబోడియాలోని అంగ్కోర్ వాట్ కంటే ఎక్కువ‌గా ఉంటుంది. ఈ ఆల‌యం కైత్వాలియా-బహురా గ్రామాలలో వెల‌సింది. ఇది 3.76 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. మొత్తం 12 గోపురాలు, 22 గర్భాలయాలతో ఈ ఆల‌య నిర్మాణం రూపు దిద్దుకుంటోంది. ఈ ఆలయంలో 33 అడుగుల నల్ల గ్రానైట్ శివలింగాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ శివ‌లింగం అంగ్‌కోర్ వాట్, రామనాథస్వామి, మీనాక్షి సుందరేశ్వరర్‌ ఆలయాల వ‌లె ఉంటుంది. ఈ ఆలయంలో మొత్తం 20,000 మంది వ‌స‌తి పొందొచ్చు.

శ్రీ జగన్నాథ్ పూరి హెరిటేజ్ కారిడార్

ఈ ఆల‌యం ఒడిసాలో వెల‌సింది. జ‌గన్నాథ పూరి హెరిటేజ్ కారిడార్ ఆల‌యం జ‌న‌వరి 17, 2024లో ప్రారంభం కానుంని. ఈ ఆల‌య నిర్మాణాకి సుమారు రూ.943 కోట్లు ఖ‌ర్చ‌వుతుందని అంచ‌నా. ఈ కారిడార్‌తో 1.5 కిలోమీట‌ర్ శ్రీమందిర్ పరిక్రమ ఆలయం పరిసరాలను అందంగా మార్చనున్నారు. ఈ ఆల‌య శంకుస్తాప‌న ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ 2021లో చేశారు. ఈ ఆల‌య‌ ప్రారంభోత్సవానికి ప్రముఖ వ్యక్తులు హాజరుకానున్నారు. ఇది ఒడిశా ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్రలో ఒక కీల‌క‌మైన ద‌శ అని చెప్పుకోవ‌చ్చు. పూరీ పరిశుభ్రత, అవస్థాపనకు రూ.3,300 కోట్లు ఖ‌ర్చు కానుంది.

srisrirukminidwarkadhishmandir

శ్రీ శ్రీ రుక్మిణీ ద్వారకాధీశ్ మందిర్, ఢిల్లీ..

ఢిల్లీలోని శ్రీ రుక్మిణీ ద్వార‌కాధీశ్ ఆల‌యం 2024 మే ప్రారంభం కానుంది. శ్రీ శ్రీ రుక్మిణీ ద్వారకాధీశ్ ఆలయాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ ఆలయం రెండు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. క‌రోనా స‌మ‌యంలో ఈ ఇస్కాన్ ద్వారాక ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది. కరోనా మహమ్మారి సమయంలో 5 కోట్ల మందికి పైగా భోజనాన్ని పంపిణీ చేసింది. అంతేకాకుండా 200 పడకల ఆసుపత్రిని స్థాపించింది. త్వరలో అందుబాటులోకి రానున్న 'సెంటర్ ఫర్ పర్మనెంట్ హ్యాపీనెస్'లో రోజూ లక్ష మందికి భోజనం అందించేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంది. అందుకోసం ఆధునిక వంటగదిని కూడా ఏర్పాటు చేయ‌నుంది. దీంతో పాటు విద్య కోసం తరగతి గదులు, 10,000 మందికి పైగా ధ్యానం చేసుకునే మందిరాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు.

ayodhyaramtemple2

అయోధ్య రామ మందిరం..

2024 జనవరిలో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరగ‌నుంది. ఈ ఆల‌య ప్రారంభోత్స‌వం కోసం ఎంతోమంది భ‌క్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య అపారమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. జ‌న‌వ‌రి 22, 2024 న రామమందిర నిర్మాణం జ‌ర‌గ‌నుంది. ఈ ఆల‌యం ప్రారంభోత్స‌వం ప్ర‌ధాని చేతుల మీదుగా ఉంటుంది. ఈ ప్రారంభోత్స‌వానికి ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు, సినీ న‌టుల‌కు ఇప్ప‌టికే ఆహ్వ‌నం అందింది. ఈ ఆలయానికి 2020 ఆగస్టు 5న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

శ్రీ మాయాపూర్ చంద్రోదయ మందిర్, పశ్చిమ బెంగాల్‌

ఈ ఆల‌యం పశ్చిమ బెంగాల్ ఉంది. ఈ ఆల‌యాన్ని టెంపుల్ ఆఫ్ ది వేద ప్లానిటోరియం అని పిలుస్తారు. 113 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దేవాల‌యం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా మార‌నుంది. ఈ ఆల‌యంలో 10,000 మందికి వ‌ర‌కూ ఉండొచ్చు. ప్రపంచంలోని అతిపెద్ద గోపురాలలో ఇది ఒకటి. 2010లో నిర్మాణం ప్రారంభమై, పూర్తయ్యే దశకు చేరుకుంది. కరోనా మహమ్మారి కారణంగా పనులు ఆలస్యం కావడంతో 2024లో ప్రారంభోత్సవం జరగనుంది. కోల్‌కతా నుంచి 80 మైళ్ల దూరంలో మాయాపూర్‌లో ఈ ఆల‌యం ఉంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+