Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలోని త‌క్కువ బ‌డ్జెట్‌తో సంద‌ర్శించే ప్ర‌దేశాలు ఇవే..

ఇండియాలోని త‌క్కువ బ‌డ్జెట్‌తో సంద‌ర్శించే ప్ర‌దేశాలు ఇవే..

ఇండియాలోని త‌క్కువ బ‌డ్జెట్‌తో సంద‌ర్శించే ప్ర‌దేశాలు ఇవే..

ప్ర‌యాణించాలంటే ఎంతో కొంత డబ్బు ఉండాలి. ఏదైనా ప్రాంతాన్ని సంద‌ర్శించాల‌న‌కున్న‌పుడు త‌ప్ప‌కుండా ముందే దానికి కావ‌ల‌సిన ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంటాం. టిక్కెట్‌లు బుక్‌చేసుకోవ‌డం, అక్క‌డ స్టే చేసుకునేందుకు రూమ్ బుక్ చేసుకోవ‌డం.. ఇవ‌నీ ప్ర‌యాణంలో భాగ‌మే. ఇవ‌న్నీ డ‌బ్బుతో ముడిప‌డిన‌వే. ప్ర‌యాణంలో ఇంకా బోలేడ్ ఖ‌ర్చులుంటాయి. షాపింగ్‌, తినేందుకు.. ఇలా చాలార‌కాలుగా డ‌బ్బు అవ‌సర‌మ‌వుతుంది. చాలామంది ప‌ర్యాట‌కులు అతితక్కువ ఖ‌ర్చుతో తెలిపోయే ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించేందుకు ముందుగా ఆలోచిస్తుంటారు. ఇండియాలోని త‌క్కువ బ‌డ్జెట్‌తో సంద‌ర్శించే ప్ర‌దేశాలు ఇవే. రండి ఆ ప్ర‌దేశాలేంటో, వాటి ప్రాముఖ్య‌త‌లేంటో తెలుసుకుందాం.

1

వారణాసి

బనారస్ అనేక విషయాల మిశ్రమం. ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు కేంద్రంగా కూడా ప్ర‌సిద్ధి చెందింది. ఇక్క‌డ అనేక ఘాట్‌లు ఉన్నాయి. ఇక్కడి స్టాల్స్ లేదా స్ట్రీట్ ఫుడ్ కూడా ప్రజలకు నోరూరించే వంట‌కాల‌ను అందిస్తాయి. ఇక్కడ కచోరీ ఆలూ తినేందుకు జలేబీలో కలిపిన రబ్డీ వంటి ఫేమ‌స్ వంట‌కాలేన్నో ఉన్నాయి. బెంగుళూరు నుంచి వారణాసికి దాదాపు రూ.17,6423, ఢిల్లీ నుంచి వారణాసికి దాదాపు రూ.7,857, ముంబై నుంచి వెళితే దాదాపు రూ.9000 ఖర్చు అవుతుంది.

2

మేఘాలయ

మేఘాలయ రాజధాని షిల్లాంగ్. ఈ ప్రాంతం దాని సహజ సౌందర్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పచ్చటి వాతావరణం, గడ్డి మైదానాలు, అడుగడుగునా జలపాతాలు, అందమైన చర్చిలు, రుచికరమైన ఆహారం షిల్లాంగ్ సందర్శనకు భిన్నమైన ఆనందాన్నిఇస్తాయి. కోల్‌కతా నుండి విమానంలో లేదా గౌహతి నుండి ఈ ప్రాంతాన్ని చేరుకోవ‌చ్చు. బెంగళూరు నుండి షిల్లాంగ్‌కు రూ. 24,5811, న్యూఢిల్లీ నుండి షిల్లాంగ్ వరకు రూ. 16,525, ముంబై నుండి షిల్లాంగ్ వరకు రూ. 21,902 ధర ఉంటుంది.

3

రాజస్థాన్‌

మెరిసే రాజభవనాల నుండి భారీ కోటల వరకు, రాజస్థాన్ రాజధాని జైపూర్ పర్యాటకానికి సరైన ప్రదేశం. ఇక్కడ స్టే చేసేందుకు టైగ్రెస్ రిసార్ట్ & స్పా, రణతంబోర్ వంటి కేంద్రాలు ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడ లగ్జరీ రిసార్ట్, హోటల్‌లో బస చేయవచ్చు. జంగిల్ సఫారీ, ఫోర్ట్, టెంపుల్, రాజీవ్ గాంధీ నేషనల్ మ్యూజియం వంటి ప్రదేశాలను సంద‌ర్శించొచ్చు. బెంగళూరు నుండి జైపూర్‌కు రూ. 15,1375, న్యూఢిల్లీ నుండి జైపూర్‌కి సుమారు రూ. 7,225, ముంబై నుండి జైపూర్‌కి రూ. 12,114 నుండి మొదలవుతుంది.

4

హైదరాబాద్‌

హైదరాబాద్ చరిత్ర, వారసత్వం, సంస్కతుల‌కు ప్ర‌సిద్ధి చెందింది. ఇక్క‌డి వంట‌కాలు కూడా ఎంతో మంది ప‌ర్యాట‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాయి. అంతే కాదు ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలలో గోల్కొండ కోట, సాలార్ జంగ్ మ్యూజియం కూడా ఉన్నాయి. బెంగళూరు నుండి హైదరాబాద్‌కు దాదాపు రూ. 5,3594, న్యూఢిల్లీ నుండి హైదరాబాద్‌కు రూ. 8,664, ముంబై నుండి హైదరాబాద్‌కు రూ. 4,712 ఖర్చు అవుతుంది.

గోవా

గోవా భారతదేశంలో అత్యధికంగా సందర్శించే ప్రదేశం. యువత ఎక్కువగా ప‌ర్యటించే ప్ర‌దేశాల‌లో ఈ ప్ర‌దేశం మొద‌టి స్థానంలో ఉంది. ఇది ఆకర్షణీయమైన బీచ్‌లు, రుచికరమైన సముద్రపు ఆహారం, అందమైన చర్చిలు, ఉత్కంఠభరితమైన సూర్యాస్తమయాలు ప్రసిద్ధి చెందింది. గోవాను సందర్శించాలనుకుంటే మాత్రం బెంగళూరు నుండి గోవాకు దాదాపు రూ. 11,5322, న్యూఢిల్లీ నుండి గోవాకు దాదాపు రూ. 21,086, ముంబై నుండి గోవాకు రూ. 12,684 ఖ‌ర్చువుతుంది.

More News

    Read more about: varanasi meghalaya
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+