పిల్లలతో కలిసి టూర్ ప్లాన్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎటువంటి ప్రణాళిక లేకుండా పిల్లలతో కలిసి ప్రయాణం చేస్తే చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణం చేయడం అంటే అందరికీ ఇష్టమే. పిల్లలు కూడా ప్రయాణానికి ఎంతో ఇష్టపడతారు. కానీ, పిల్లలతో కలిసి విహారయాత్రలు ప్లాన్ చేయడమంటే కాస్త కష్టంతో కూడుకున్న పనే అని చెప్పుకోవాలి. ప్రయాణంలో పిల్లలు ఉంటే తల్లిదండ్రులను ప్రశాంతంగా ఉండవనివ్వరు. ప్రయాణమంతా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. పిల్లలతో కలిసి టూర్ ప్లాన్ చేస్తుంటే మాత్రం గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
పిల్లలతో కలిసి ట్రిప్ ప్లాన్ చేయడం చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. చాలా చిన్నపిల్లలయితే వారి అల్లర్లను అస్సలు భరించలేం. చిన్నగా ఉన్నప్పుడు మరియు అల్లర్లు చేయకుండా అస్సలు ఉండరు. చిన్నవయసులోనే ప్రయాణాల పట్ల ఉత్సాహం వారికి ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, వారు మీ టూర్ ప్లాన్‌లో గందరగోళం సృష్టిచవచ్చు. కొన్నిసార్లు కదులుతున్న వాహనం నుండి బయటకు చూడటం, అద్దం వెలుపల చేతులు పెట్టడం వంటి చేస్తూ ఉంటారు. ప్రయాణాల్లో పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ కోల్పోయినా అది పెద్ద విపత్తుకు దారి తీస్తుంది. కాబట్టి పిల్లలతో కలిసి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పడు తెలుసుకుందాం.

సీట్ బెల్ట్ ధరించడం ముఖ్యం..
చాలామంది పిల్లలు కారులో ప్రయాణించేటప్పడు సీటు బెల్ట్ పెట్టుకునేందుకు నిరాకరిస్తుంటారు. కాబట్టి వారి అల్లరికి బ్రేక్ వేయాలంటే ముందుగా వారికి సీట్ బెల్ట్‌ను ధరించండి. దాంతోవారు ఒక్కచోట కుదురుగా కూర్చుంటారు. రోడ్డు ప్రయాణం చేసేటప్పడు సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణించడం చాలా ప్రమాదకం. దీనివ్లలే రోడ్డు ప్రమాదాలు సంఖ్య పెరిగిపోతూ ఉంది. కాబట్టి, అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ముందుకుగా సీటుబెల్ట్ ధరించడం ముఖ్యం.
పిల్లల బొమ్మలు తీసుకెళ్లండి...
పిల్లలతో టూర్ ప్లాన్ చేస్తున్నప్పుడు తప్పకుండా వారికి ఇష్టమైన కొన్ని బొమ్మలను మీతోపాటు తీసుకెళ్లండి. అల్లరి చేయడమనేది పిల్లల స్వభావం. అటువంటి పరిస్థితిలో, వారు తమ సీటు బెల్ట్‌లను ధరించి ఒక దగ్గర నిశ్శబ్దంగా కూర్చోవాలని మీరు కోరుకుంటారు. కానీ, అది అస్సలు జరగదు. కాబట్టి వారిని ఆ దృష్టినుంచి మరల్చేందుకు పిల్లల బొమ్మలను మీతో పాటు తీసుకెళ్లడం అస్సలు మర్చిపోవద్దు. అవి ప్రయాణంలో ఎంతగానో సహాయపడతాయి.

కార్ డోర్‌ను తప్పనిసరిగా లాక్ చేయండి...
కారులో ప్రయాణంలో పిల్లలు తరచుగా తమ చేతులు మరియు నోటిని కారు నుండి బయటకు తీస్తుంటారు. లేదా కదిలే వాహనం యొక్క తలుపు తెరవడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి, అటువంటి పరిస్థితిలో కారులో చైల్డ్ సేఫ్టీ లాక్ సరిగ్గా పనిచేస్తుందో లేదో ముందుగా చెక్ చేసుకోవడం మంచిది. దీంతో పెను ప్రమాదాలను నివారించవచ్చు. కార్ డోర్‌ను తప్పనిసరిగా లాక్ చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు కారు తలుపు తెరవలేరు, ప్రమాదం నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
అతిగా తినొద్దు..
ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పడు. పిల్లలు వారికి తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. పిల్లలు వారి అభిరుచుల కారణంగా తరచుగా ఎక్కువగా తింటుంటారు. అటువంటి పరిస్థితిలో, వారి ఆహారం మరియు పానీయాలపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వంకరగా ఉన్న రోడ్లలో, ఆహారం కూడా గొంతులో చిక్కుకుపోయే సమస్యలు వస్తాయి. కాబట్టి తినేటప్పడు జాగ్రత్త వహించాలి. అతిగా తినకుండా జాగ్రత్తపడాలి. అతిగా తినడం వల్ల కడుపు నొప్పి లేదా వాంతులు సంభవించే ప్రమాదం ఉంది.



Click it and Unblock the Notifications











