Search
  • Follow NativePlanet
Share
» »తిరుత్తణి - శ్రీ సుబ్రమణ్యస్వామి కోవిల్ !!

తిరుత్తణి - శ్రీ సుబ్రమణ్యస్వామి కోవిల్ !!

తిరుత్తణి మురుగన్ టెంపుల్ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సుబ్రమణ్యస్వామి ఆలయాలలో ఒకటి. పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రదేశాలలో ఇది ఒకటి.

By Mohammad

తిరుత్తణి తమిళనాడులో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దైవం కార్తికేయుడు/మురుగన్. కొండపై ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఈ దివ్య క్షేత్రంలో శ్రీ సుబ్రమణ్యస్వామి వల్లీ దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువయ్యారు. తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేరుగాంచిన ఈ క్షేత్రం తమిళులందరికీ ఆరాధ్య క్షేత్రం. తమిళుల ఇష్టదైవంగా, ఇలవేల్పుగా పూజలందుకుంటున్నసుబ్రమణ్యస్వామి ఇక్కడ 'మురుగపెరుమాళ్ళు' గా పూజలందుకుంటున్నాడు. శ్రీవారు వెలసి ఉన్న కొండకు ఇరుప్రక్కలందూ పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి.

కుమారస్వామికి శివపార్వతులు ఇచ్చిన ఫలం .. పళని !!

ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడంవల్ల దీనిని 'బియ్యపుకొండ' అని పిలుస్తారు. దక్షిణం వైపునగల కొండ కొంచెం నల్లగా ఉండడంవల్ల దానిని 'గానుగ పిండి కొండ' అని పిలవడం జరుగుతోంది. సుబ్రమణ్యస్వామి దేవతలు, మునుల బాధలు పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం, వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చేసి చిన్నపోరు ముగిసిన అనంతరం శాంతించి, ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యాడు కనుక ఈ క్షేత్రానికి 'తణిగై' లేదా 'శాంతిపురి' అనే పేరొచ్చింది. అలాగే 'తణిగ' అనే పదానికి మన్నించుట, లేదా ఓదార్చుట అని అర్థం చెబుతారు. స్వామి భక్తుల తప్పులను, పాపాలను మన్నించి, కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి 'తిరుత్తణి' అని పేరు వచ్చింది.

స్థల పురాణము

స్థల పురాణము

త్రేతాయుగములో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారము చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుడిని ఆరాధిస్తాడు. అక్కడ, ఈశ్వరుడి ఆనతి మేరకు, శ్రీ రాముడు ఈ తిరుత్తణి క్షేత్రము దర్శించాడు. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పూర్తి మనశ్శాంతి కలిగింది.

చిత్రకృప : poobesh a.k.a ECTOTHERMS lakshman

అర్జునుడు

అర్జునుడు

ద్వాపర యుగములో, మహా వీరుడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థ యాత్రలు చేస్తూ, ఇక్కడ తనికేశన్ స్వామి వారిని కొలిచాడు. శ్రీ మహా విష్ణువు ఈ క్షేత్రములోనే సుబ్రమణ్యుడి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంఖు, చక్రములను తిరిగి పొందినాడు.

చిత్రకృప : Srithern

బ్రహ్మ తీర్థం

బ్రహ్మ తీర్థం

చతుర్ముఖ బ్రహ్మ ప్రణవ అర్ధమును చెప్పలేకపోవడం వలన, మన ముద్దులొలికే సుబ్రమణ్యుడి చేత బంధింపబడి, ఆయన సృష్టి చేసే సామర్థ్యం కోల్పోతాడు. ఇక్కడ తిరుత్తణిలో ఉన్న బ్రహ్మ తీర్థములో కార్తికేయుని పూజించి, ఆయన తిరిగి శక్తి సామర్ధ్యములను పొందాడు.

చిత్రకృప : Rajachandra~tewiki

ఇంద్రుడు

ఇంద్రుడు

దేవేంద్రుడు ఈ క్షేత్రములోనే, ఇంద్ర తీర్థములో, " కరున్ కువలై " అనే అరుదైన పూల మొక్కను నాటి, ప్రతి రోజూ ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పములతో ఇక్కడ షణ్ముఖుని పూజించాడు. ఆ తర్వాతనే, ఇంద్రుడు తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న " సంఘనీతి, పద్మనీతి, చింతామణి " మొదలైన దేవలోక ఐశ్వర్యమును తిరిగి పొందాడు.

చిత్రకృప : Rajachandra~tewiki

ప్రత్యేకత

ప్రత్యేకత

ఇక్కడ ఉత్సవ మూర్తులుగా ఉన్న వల్లీ, దేవసేనా, సుబ్రహ్మణ్యులకు పైన ఉండే విమానము (ఛత్రము) రుద్రాక్షలతో చేసినది. చాలా అందముగా ఉంటుంది. అంతేకాదు, స్వామి వారు ఒక ఆకు పచ్చని రంగులో ఉండే షట్కోణ పతకము ధరించి మిల మిల మెరిసి పోతూ ఉంటారు. ఇక్కడ బంగారు బిల్వ పత్రముల మాలతో కూడా స్వామి వారిని అలంకరిస్తారు.

చిత్రకృప : Rajachandra~tewiki

ఆలయ సందర్శన వేళలు

ఆలయ సందర్శన వేళలు

తిరుత్తణి మురుగన్ టెంపుల్ ను ప్రతిరోజూ తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాలకు తెరుస్తారు. రాత్రి 9 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ప్రత్యేకదినాలలో అనగా పండుగలు, ఉత్సవాలు, వేడుకలు, జాతరలు, విశిష్ట రోజులలో గుడిని అర్ధరాత్రి వరకు తెరిచే ఉంచుతారు.

చిత్రకృప : Rajachandra~tewiki

మురుగన్ ఆలయంలో పండుగలు

మురుగన్ ఆలయంలో పండుగలు

మురుగన్ ఆలయంలో సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పండుగలు జరుపుతారు. ఆది కృత్తికై పండగ అందులో ప్రధానమైనది. ఇది ప్రతిఏటా జులై - ఆగస్టు నెలలో వస్తుంది. ఆ సమయంలో గుడి ప్రాంగణం మొత్తం ఇసుకేస్తే రాలనంత భక్తులతో నిండిపోయి ఉంటుంది. అలాగే నూతన సంవత్సరం ప్రారంభమయ్యే చివరి రోజు (డిసెంబర్ 31) మెట్ల పండగ నాడు కూడా అశేష భక్తులు హాజరవుతారు. ఇక పండుగలు, సెలవుదినాలలో ప్రత్యేకంగా చెప్పాలా !!

చిత్రకృప : Senthil Kumar

కుమారతీర్థము

కుమారతీర్థము

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించ తలచి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగ ప్రతిష్టచేసి సేవించాడట. కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన సాంబశివుడు సంతోషించి కుమారస్వామికి ‘జ్ఞానశక్తి' అనే ‘ఈటె'ను అనుగ్రహించాడట. ఇక్కడ కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడనే పేరొచ్చింది. కుమారస్వామి, శివుని అర్చించడానికి సృష్టించిన తీర్థమే కుమారతీర్థము. దీనిని శరవణ తీర్థమని కూడా పిలుస్తారు.

చిత్రకృప : Srithern

కాలి నడకన మురుగన్ ఆలయం చేరుకునే విధం

కాలి నడకన మురుగన్ ఆలయం చేరుకునే విధం

రైలులో తిరుత్తణి వెళ్తే, రైల్వే స్టేషను బయటకి వస్తే రోడ్డు కనిపిస్తుంది . అక్కడ నుంచి ఎడమ వైపుకి నడిస్తే బస్సు స్టాండుని చేరుకుంటాం . బస్సు స్టాండు నుంచి కొండ పైకి బస్సులు ఆటోలు ఉంటాయి. మెట్ల మార్గం కూడా ఉంటుంది. ఇక్కడ మనకి కొండ క్రిందనే కల్యాణకట్ట ఉంటుంది. ఇక్కడ మొత్తం 365 మెట్లున్నాయి. ఈ మెట్లను సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకలుగా చెబుతారు. తిరుపతి లాగే ఇక్కడ కూడా మెట్లకు పసుపు, కుంకుమ రాయడం, కర్పూరం వెలిగించడం చేస్తారు.

చిత్రకృప : Rajachandra~tewiki

తిరుత్తణి ఎలా చేరుకోవాలి ?

తిరుత్తణి ఎలా చేరుకోవాలి ?

తిరుత్తణి తమిళనాడులో తిరుపతి నుంచి ఆరక్కోణం వెళ్ళే దారిలో ఉంది. రోడ్డు ద్వారా: చెన్నై నుండి 84 కి.మీ., తిరుపతి నుండి 68 కి.మీ., అరక్కోణం నుండి 13 కి.మీ., కాణిపాకం నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ప్రదేశాలు అన్నిటి నుంచి బస్సు సౌకర్యం ఉంది. మన ఎపి ఎస్ ఆర్టీసీ కూడా తిరుపతి నుంచి అనేక బస్సులు నడుపుతుంది.

రైలు ద్వారా: దీనికి దగ్గరలోని రైల్వే స్టేషను అరక్కోణం. ఇది ఒక రైల్వే జంక్షన్. అంతేకాక, చెన్నై నుండి తిరుత్తణికి అనేక లోకల్ రైళ్ళు నడుస్తాయి.

సమీప విమానాశ్రయం : చెన్నై లో అంతర్జాతీయ విమానాశ్రయం, తిరుపతి రేణిగుంటలో దేశీయ విమానాశ్రయం కలదు.

చిత్రకృప : poobesh a.k.a ECTOTHERMS lakshman

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+