ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాహసంతో కూడిన ట్రెక్కింగ్ చేయాలనుకునేవారికి హైదరాబాద్ నగరానికి 140 కిలోమీటర్ల దూరంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న కోయిలకొండ కోట సరైన ఎంపిక. ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు కోయిలకొండ కోట నిత్యం ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది. ఈ కోట పైభాగానికి మెట్ల మార్గంలో చేరుకోవడానికి పర్యాటకులు లోయగుండా నడవాల్సి ఉంటుంది. ఇది కుతుబ్ షాహీ రాజవంశం యొక్క పూర్వపు అవుట్‌పోస్ట్. ఇది కొండపై భాగాన ఉంటుంది. ఈ నటక మార్గం మీకు సరికొత్త అనుభవాన్ని పరిచయం చేస్తుంది.
పైకి వెళ్లే మార్గం ఎంతో కఠినతరం..
కోయిల కొండ కోటలోకి ప్రవేశించడానికి మీరు ఏడు ద్వారాలు దాటాల్సి ఉంటుంది. మొదటి ద్వారం 1550 నాటి ఇబ్రహీం కుతుబ్ షా శాసనంతో ఆకర్షించబడి, నేలపై పడి ఉన్న విశాలమైన గొలుసు నిర్మాణం ఇక్కడి చారిత్రక నేపథ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ఇక్కడి నాల్గవ ద్వారం శిధిలమైన ప్యాలెస్ లేదా రాజ నివాసానికి దారి తీస్తుంది. కోట పైకి వెళ్లే మార్గం ఎంతో కఠినతరంగా ఉంటుంది. అందుకే కోయిలకొండ కోట సందర్శన ఓ సాహన యాత్రగా చెబుతారు.

ముళ్ల పొదలు, బండరాళ్లతో నిండి ఉండడంతో వర్షాల సమయంలో ఈ మార్గంలో నడక ప్రమాదకరంగా ఉంటుంది. అయితే, ఆ సమయంలోనే ఇక్కడి పచ్చదనం ఎంతో ఆహ్లాదభరితంగా కనువిందు చేస్తుంది. అలా కనీసం ఒక గంట సమయంపాటు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. ఈ కోట నడక మార్గంలోనే ఒక మసీదు, దర్గాతోపాటు పెద్ద చెరువు తారసపడతాయి. కోటలో బీబీ ఫాతిమాకు అంకితం చేసిన 'అషుర్ఖానా' కూడా ఉంది.
సూర్యాస్తమయానికి ముందే ..
కొండపైభాగానికి చేరుకున్న తర్వాత అసలైన ప్రకృతి దృశ్యం కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతంతోపాటు అక్కడి చుట్టుపక్కల పచ్చదనం, కోయిల్‌సాగర్ డ్యామ్ అందాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. పైభాగంలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే సందర్శకులు రోజు ముగిసే వరకు ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. పైనుండి అందమైన సూర్యాస్తమయాన్ని జీవితంలో మర్చిపోలేని అనుభవంగా చెప్పొచ్చు. కానీ, కోట ప్రాంతం పూర్తిగా నిర్మాణుష్యంగా ఉంటుంది.

ఈ కారణంగా రాత్రి పొద్దుపోయే వరకు కోట పరిసర ప్రాంతాల్లో ఉండడం సురక్షితం కాదని స్థానికులు చెబుతూ ఉంటారు. అలాగే, పగటిపూట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బృందాలుగా కలిసి ఇక్కడకు వెళ్లడం మంచిది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించే సాహసం అస్సలు చేయకూడదు. సూర్యాస్తమయానికి ముందే తిరుగు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పైన ఎయిర్‌టెల్, జియో మొబైల్ సిగ్నల్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
కోయిల్‌సాగర్ డ్యామ్ అందాలు..
కోట ట్రెక్కింగ్‌కు సిద్ధమయ్యేవారు తప్పనిసరిగా ట్రెక్కింగ్ ప్యాంట్లు లేదా జాగర్లు ధరించాలి. అలాగే, తొలకరి సమయంలో ఇక్కడి రాళ్లు జారుగా ఉంటాయి కాబట్టి ట్రెక్కింగ్ బూట్లు ధరించండం అస్సులు మర్చిపోవద్దు. ట్రెక్కింగ్‌లో ఫుడ్ స్టాల్స్, నీటి వనరులు ఉండవు. అంచేత అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే, ప్రాథమిక ప్రథమ చికిత్స వస్తు సామగ్రిని తీసుకు వెళ్లాలి. ఈ గ్రామీణ ప్రాంతాల గుండా ప్రయాణం మాత్రం మీకు సరికొత్త అనుభవాన్ని పరిచయం చేస్తుంది.
కోట నుండి 34 కి.మీ దూరంలో ఉన్న కోయిల్‌సాగర్ ఆనకట్టను సందర్శించవచ్చు. మీరు ఇక్కడ క్యాంపింగ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే కోయిల్‌సాగర్ డ్యామ్ యొక్క వాటర్ బెడ్ సరైన ఎంపిక. ఇది 1945-48 మధ్యకాలంలో నిజాంల కాలంలో నిర్మించిన మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు. ఇది కృష్ణా నదికి చిన్న ఉపనది అయిన పెద్దవాగు నది మీదుగా విస్తరించి ఉంది. ఈ సుందరమైన జలాశయం యొక్క పశ్చిమ భాగం చుట్టూ కొండలు ఉన్నాయి. ఇక్కడి సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయం కనులకు విందుగా ఉంటుంది. మీరు ఫిషింగ్‌ను ఇష్టపడితే, ఫిష్ క్యాచ్‌ల కోసం ఫిషింగ్ రాడ్‌లను తీసుకువెళ్లడం మర్చిపోవద్దు.



Click it and Unblock the Notifications












