Search
  • Follow NativePlanet
Share
» »కాశీలోని ఈ దేవాల‌యం ఆసియాలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం...

కాశీలోని ఈ దేవాల‌యం ఆసియాలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం...

వారణాసి లేదా కాశీ భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటిగా పేరుచెందింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న ఈ ప్రాంతం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు తొలిగిపోతాయ‌ని భ‌క్తుల నమ్మ‌కం. అందుకే చాలామంది కాశీని సంద‌ర్శిస్తుంటారు. ఇప్ప‌డు వార‌ణాసిలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి ప్రారంభించిన ధ్యాన కేంద్రం అత్యంత ప్ర‌సిద్ధిచెందింది. ఈ ధ్యాన కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్ద యోగా కేంద్రంగా పిలువబడుతుంది. ఇక్కడ యోగాలో 20 వేల మంది ఒకేసారి పాల్గొన‌వ‌చ్చు.

రూ.35 కోట్లతో నిర్మించిన ధ్యాన కేంద్రం...

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి పర్యటన సందర్భంగా నగరంలో ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు వారణాసిలోని ఉమ్రాలో నిర్మించిన స్వర్వేద్ మహామందిర్ ధామ్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు.

విహంగం యోగా ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడైన సెయింట్ సదాఫల్ మహారాజ్‌కి ప్రపంచంలోని డజన్ల కొద్దీ దేశాల్లో వందలాది ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో వారణాసికి చెందిన ఈ స్వరవేద మహామందిరం అతి పెద్దది. దీని నిర్మాణానికి సుమారు 20 ఏళ్లు ప‌ట్టింది. రూ.35 కోట్లతో ఈ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. ఇది ఏడు అంత‌స్థుల్లో ఉంది. ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రమ‌ని చెప్పుకోవ‌చ్చు. ఈ ధ్యాన కేంద్ర విశేష‌త‌లేంటో తెలుసుకోండి..

swarvedmahamandir

స్వర్వేద్ మహామందిర్ ధామ్ కేంద్రాన్ని ప్ర‌ధాని ప్రారంభించారు. స్వః, వేద అనే రెండు పదాలతో ఈ కేంద్రం రూపొందించబడింది. స్వాః అంటే ఆత్మ, వేదం అంటే జ్ఞానం. స్వాహా రెండవ అర్థం దేవుడు, వేదం అంటే జ్ఞానం. ఆత్మ జ్ఞానాన్ని పొందే మాధ్యమాన్ని స్వర్వేదం అంటారు.

అయితే, ఈ ఆల‌యంలో ప్ర‌త్యేకంగా ఏ దేవుడిని పూజించరు. ఇక్క‌డికి వ‌చ్చిన వారంతా ధ్యానం చేస్తారు. ఇది ఒక ధ్యాన స్థలం మాత్రమే. ఈ దేవాలయంలోని అన్ని అంతస్తుల్లోని లోపలి గోడలపై సుమారు నాలుగు వేల ద్విపద స్వర వేదాలు ర‌చించ‌బ‌డ్డాయి. బయటి గోడపై వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతం, రామాయణం, గీత తదితర అంశాలపై 138 పెయింటింగ్‌లు వేయబడ్డాయి.

600 మంది కార్మికుల కృషి ఫ‌లిత‌మే ఈ ధ్యాన కేంద్రం...

వార‌ణాసిలో నిర్మించిన ఈ అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని సుమారు మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. దాదాపు 125 రేకుల తామర గోపురాల డిజైన్‌తో అత్యంత అద్దంగా దీన్ని తీర్చిదిద్దారు. అంతేగాదు ఒకేసారి 20 వేలమంది కూర్చొగలిగే సామర్థ్యం కలిగింది. ఈ ధ్యాన‌కేంద్రాన్ని వారణాసి సిటీ సెంటర్‌కి దాదాపు 12 కిలోమీట‌ర్ల దూరంలోని ఉమరహా ప్రాంతంలో నిర్మించారు.

ఈ ఆలయం మకరతోరణంపై దాదాపు 3 వేలకు పైగా స్వర్వేద్‌ శ్లోకాలు చెక్క‌బ‌డిన‌వి. ఈ గుడి గోడల చుట్టూ గులాబీరంగు ఇసుకరాయి మంచి అలంకరణగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తలుపులపై పలు శిల్పాలను చెక్కారు. పైగా ఇందులో దాదాపు 101 పౌంటైన్‌లు ఉన్నాయి. ఈ దేవాల‌యాన్ని 2004లో ప్రారంభించారు. దీని నిర్మాణానికి సుమారు 15 మంది ఇంజనీర్లు, సుమారు 600 మంది కార్మికులు క‌ష్ట‌ప‌డ్డారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+