Search
  • Follow NativePlanet
Share
» »పిల్లలతో పార్క్ కు వెళుతున్నారా ?

పిల్లలతో పార్క్ కు వెళుతున్నారా ?

పిల్లలతో కలసి పార్క్ లకు వెళ్ళటం అందరికీ సరదాయే. అందులోనూ నేడు ఆధునికంగా వస్తున్న వాటర్ థీం పార్క్ ల వంటివి మరింత ఆనందాన్ని ఇస్తాయి. అక్కడ కల రోలరు కోస్టర్, పెండులం రైడ్స్ వంటివి వారికి ఎంతో ఇష్టంగా వుంటాయి. మరి ఈ రకమైన వాటర్ థీం పార్క్ లకు పిల్లలను తీసుకు వెళ్ళాలంటే తల్లి తండ్రులకు వారి నిర్వహణ కొంచెం కష్టం గా నే వుంటుంది. అయినప్పటికీ ఈ పార్క్ లలో తల్లి తండ్రులు, పిల్లలు ఆనందంగా గడిపెయాలంటే కొన్ని చిట్కాలు పరిశీలించండి.

పిల్లలతో పార్క్ కు వెళుతూన్నారా ?
భద్రత
ఈ పార్క్ లకు వెళ్ళేటపుడు తల్లి తండ్రులు పిల్లల పట్ల కొద్దిపాటి జాగ్రత్తత తో , సరైన తీరుతో వ్యవహరించాలి. మీరు వెళ్ళవలసిన పార్క్ ముందుగా నిర్ణయించుకుంటే, అక్కడ కల రైడ్స్, సౌకర్యాలు, భద్రత వంటి అంశాలు పరిశీలించండి. మీరు ఒక్కరే కాదు, మీతో పాటు మీ పిల్లలు కూడా వున్నారని తెలుసుకోండి. వారికి కావలసిన రీతిలో వారిని ఆనందించండి. ఆహ్లాదకరంగా వారు ఆడుకుంటూ వుంటే, మీకు సంతోషంగా వుంటుంది.

ఆటలు
మీకు ఇష్టం కదా అని కొన్ని ఆటలను ఆడమని ప్రోత్సహిస్తూ వారికి ఇష్టమైన ఆటలకు అడ్డు చెప్పకండి. కొన్ని ఆటలకు టికెట్ తీసుకోవాలంటే, పొడవాటి క్యూ లుంటాయి. వాటిలో నిలబడి పిల్లలకు ఇష్టం లేని విధంగా సమయం వృధా చేయటం సరైన ఆలోచన కాదు. పిల్లలు ఆ ప్రదేశంలో ఆటలు ఆడేటపుడు, వారు మీ దృష్టి నుండి దూరంగా వెళ్ళకుండా చూడండి. అవసరం అనుకుంటే, వారి దుస్తులపై, మీ పేరు, ఫోన్ నెంబర్ వంటి వివరాల చిన్న స్లిప్ ను అంటించండి. పార్క్ లో ఏదైనా కొన్ని పరిస్తితులలో వారు తప్పి పోతే, ఏమి చేయాలనేది వారికి ముందుగా వివరించండి.

స్నాక్స్ అండ్ వాటర్
పార్క్ కు వెళ్ళేటపుడు, డ్రీంకింగ్ వాటర్, ఇతర తినుబండారాలను తగినన్ని తప్పక తీసుకు వెళ్ళండి. అక్కడ దొరికేవి చాలా ఖరీదు వుంటాయి. ఈ చిట్కా ఆచరిస్తే, మీ సొమ్ము అధికంగా వ్యయం కాకుండానూ, పిల్లలు ఖాళీ కడుపులతో ఇంటికి రాకుండానూ కూడా వుంటుంది. పిల్లలు పార్క్ లో వివిధ రకాల ఆటలు ఆడి అలసిపోతారు, కనుక వారికి తగినంత ఆహారం, నీరు వెంటనే అవసరమవుతాయి.

అక్కడ కల ఆటలు అన్నీ మీరు టికెట్ లు కొన్నారు కదా అని పిల్లలను ఆడామని బలవంత పెట్టకండి. వారికి ఇష్టమైన, మంచి ఆటలకు ప్రోత్సహించండి. ఈ రకమైన ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే, మీ పార్క్ ట్రిప్ పిల్లలతో ఆనందంగా గడిచి ఇంటికి సంతోషంగా తిరిగి వచ్చేస్తారు.

More News

    Read more about: amusements parks tips adventure
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+