భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా మారుతున్నది. దీనికి కారణం ఇండియాలోని పలు సంపన్న సంపన్న నగరాలు. వాణిజ్య పరంగా, ఆర్థికపరంగా ముంబై నగరం అగ్రస్థానంలో నిలువగా, తర్వాతి స్థానాలలో దేశ రాజధాని న్యూఢిల్లీ, కోల్కతా నగరాలు ఉన్నాయి.
దేశంలో ఏ ఏ నగరాలు సంపన్నమైనవో ప్రజలు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో సర్వే నిర్వహించారు ప్రపంచంలోని కొన్ని సంస్థలు. వాటిలో హల్లో ట్రావెల్, న్యూ వరల్డ్ హెల్త్ అనే పేర్లు గల ఎన్ జీ ఓ సంస్థలు కొన్ని ఉన్నాయి. హల్లో ట్రావెల్ సంస్థ జీడీపీ పరంగా సంపన్న నగరాల వివరాలను వెల్లడించింది. న్యూ వరల్డ్ హెల్త్ అనే సంస్థ మరో అడుగు ముందుకేసి ఆ నగరాలలో ఉన్న సంపన్నుల, కుబేరుల వ్యక్తుల నికర ఆస్తులను పరిగణలోకి తీసుకొని నివేదికను తెలిపింది.
ఇండియాలో అత్యధికులు సందర్శించే పర్యాటక ప్రదేశాలు !
విద్యపరంగా, శాస్త్ర సాంకేతిక పరంగా, ఆర్థిక పరంగా, హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్ .. ఇలా వివిధ రంగాలలో పలు దేశాలతో పోటీపడుతున్న భారత్ ... సంపన్న నగరాల విషయంలోనూ పోటీపడుతుండటం విశేషం. కుబేర నగరాలుగా చోటుసంపాదించుకున్న మొదటి 25 నగరాలను ఒకసారి పరిశీలిస్తే ...!
భారతదేశంలో ఉన్నా సందర్శించకూడని ప్రదేశాలు !!

25
మధురై తమిళనాడు రాష్ట్రంలో రెండవ పెద్ద నగరం. వైగై నది ఒడ్డున ఉన్న ఈ ఆలయ నగరంలో పురాతన కాలం నుండి జనావాసాలు ఉన్నట్లు చెబుతారు. ఇక్కడి ప్రధాన ఆకర్షణ మీనాక్షి దేవాలయం. భారతదేశంలో ప్రకటించిన సంపన్న నగరాల జాబితాలో మధురై 25 వ స్థానంలో ఉన్నది.
చిత్రకృప : Alessandro Malatesta

24
ఆగ్రా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, న్యూ ఢిల్లీ నుండి 232 కి. మీ ల దూరంలో కలదు. ఇక్కడ ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ మాత్రమే కాకుండా చేరువలో మరికొన్ని యునెస్కో వారసత్వ సంపదలు ఉన్నాయి. ఇండియాలో ప్రకటించిన సుసంపన్న నగరాల లిస్ట్ లో ఆగ్రా 24 వ స్థానాన్ని ఆక్రమించింది.
చిత్రకృప : Pedro

23
కోయంబత్తూర్ తమిళనాడు రాష్ట్రంలో విస్తీర్ణంలో రెండవది. దీనిని 'మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా' గా అభివర్ణిస్తారు. టెక్స్ టైల్స్ పరిశ్రమకు ఈ నగరం ప్రసిద్ధి. ఈ కాటన్ సిటీ అఫ్ ఇండియా సంపన్న నగరాల లిస్టులో 23 వ స్థానంలో ఉన్నది.
చిత్రకృప : Ragunathan

22
అమృత్సర్ పంజాబ్ రాష్ట్రంలో అతిపెద్ద నగరాలలో ఒకటి. ఇది సిక్కు జాతీయులకు మతపరంగా, సాంస్కృతిక పరంగా ప్రధాన కేంద్రం. ఇది సిక్కు గురువైన గురు దాస్ రామ్ జీ చే కనుగొనబడింది. స్వర్ణదేవాలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. సుసంపన్న నగరాల జాబితాలో 22 వ స్థానంలో నిలిచింది.
చిత్రకృప : Arian Zwegers

21
వడోదర దీనినే బరోడా అని పిలుస్తారు. విశ్వామిత్ర నది ఒడ్డున ఉన్న బరోడా గార్చా (నవరాత్రి) వేడుకలకి ప్రసిద్ధి. 'సంస్కారి నగరి' గా పిలువబడే వడోదర పేరుకుతగ్గట్టు సంస్కృతిని చాటిచెప్పుతున్నది. సంపన్న నగరాల జాబితాలో 21 వ స్థానాన్ని ఆక్రమించింది.
చిత్రకృప : Tanay Bhatt

20
పింప్రి - చించ్వాడ్, మహారాష్ట్రలోని పూణే మెట్రోపాలిటన్ సిటీ లో ఒక భాగం. ఇది పూణే కు నార్త్ -వెస్ట్ భాగంలో ఉంటుంది. ఓల్డ్ పూణే - ముంబై హైవే ఈ భూభాగం గుండా వెళుతుంది. పూణే లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరియా ఇది. సంపన్న నగరాల జాబితాలో ఇది 20 వ స్థానాన్ని ఆక్రమించింది.
చిత్రకృప : Binoyjsdk

19
భోపాల్, మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజధాని. ఈ నగరం చుట్టూ ఎన్నో చారిత్రక కట్టడాలు, సరస్సులు మరియు ఆసక్తికరమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. పరిశుభ్రంగా ఉండే ఈ నగరం దేశంలోని గ్రీన్ సిటీలలో ఒకటిగా, ధనిక నగరాలలో 19 వ స్థానంలో ఉన్నది.
చిత్రకృప : Udit Sharma

18
కాన్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నది ఒడ్డున్న ఉన్న అతిపెద్ద నగరాలలో ఒకటి. ఈ నగరం విద్యాసంస్థలకు నిలయం. భారతదేశములోని ప్రతిష్టాత్మకమైన, పేరెన్నికగల విద్యాలయాలు ఇక్కడ స్థాపించారు. ఇక్కడి లెదర్, కాటన్ ఉత్పత్తులు దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈ నగరం ధనిక నగరాల జాబితాలో 18 వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
చిత్రకృప : Urprakhar

17
కక్కనాడ్, కొచ్చి నగరంలోని ఒక ప్రాంతం. ఇదొక బిసినెస్ హబ్. బ్రాడ్ కాస్టింగ్ సేవలు, ఐటీ కంపెనీలు, బహుళజాతి అపార్టుమెంట్లు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. కక్కనాడ్ ప్రాంతం సంపన్న నగరాల జాబితాలో 17 వ స్థానంలో కలదు.
చిత్రకృప : Anand Venugopal

16
చండీఘడ్, పంజాబ్ - హర్యానా రాష్ట్ర రాజధాని మరియు భారతదేశ కేంద్రపాలిత ప్రాంతం. ఇండియాలో మొదటిసారిగా ప్రణాళికబద్ధంగా నిర్మించిన నగరం ఇది. హిందూ మాత దేవత అయిన చండికి అంకితం చేయబడిన ఆలయం నుండి దీనికి ఆపేరు వచ్చింది. భారతదేశంలోని ధనిక నగరాలలో ఇది 16 వ స్థానాన్ని ఆక్రమించింది.
చిత్రకృప : Sanyam Bahga

15
పాట్నా దేశంలోని పురాతన నగరాలలో ఒకటి. క్రీ.పూ. నుండి ఈ ప్రాంతం గురించి ఉంటూ వస్తున్నాం. మగధ దేశపు రాజధానిగా, 'పాటలీపుత్ర' గా ప్రస్తుత బీహార్ రాజధానైన పాట్నా సేవలు అందించింది. ఇండియాలో ఎక్కువ జనాభా గల నగరాలలో 14 వ స్థానంలో, సంపన్న నగరాల జాబితాలో 15 వ స్థానంలో కలదు.
చిత్రకృప : Oliver gedin

14
ఇండోర్, మధ్య ప్రదేశ్ లోని మాల్వా పీఠభూమి ప్రాంతంలో కలదు. దీనిని 'మధ్యప్రదేశ్ యొక్క గుండెకాయ' గా అభివర్ణిస్తారు. ఈ నగరంలో రాజభవనాలు, స్మారకాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇండియాలో సంపన్న నగరాల జాబితాలో భోపాల్ 14 వ స్థానములో కలదు.
చిత్రకృప : Al-Ram

13
నాగ్ పూర్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో గల పెద్ద నగరం. 'నారింజ నగరం' అని పిలువబడే ఈ నగరం 'భారతదేశపు పులుల రాజధాని' గా ప్రసిద్ధి చెందినది. చరిత్ర, ప్రకృతి, ఆనందాల మేలుకలయిక నాగ్ పూర్. ఇండియాలోని రిచెస్ట్ సిటీ జాబితాలో ఇది 13 వ స్థానాన్ని కలిగి ఉంది.
చిత్రకృప : Pankaj.awachar

12
లక్నో, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని. 'నవాబుల నగరం' గా పిలువబడే లక్నో గోమతి నది ఒడ్డున ఉన్నది. నవాబులకాలం నాటి మర్యాదపూర్వకమైన సంస్కృతి, మరిచిపోలేని రుచికరమైన వంటకాలు ఇప్పటికీ నగరంలో ప్రసిద్ధిచెందినవే!. ఇండియాలోని రిచెస్ట్ సిటీ జాబితాలో ఇది 12 వ స్థానాన్ని కలిగి ఉంది.
చిత్రకృప : Wikiboy2364

11
జైపూర్, రాజస్థాన్ రాష్ర రాజధాని మరియు 'గులాబీ నగరం' గా ప్రసిద్ధి చెందినది. కోటలు, రాజప్రాసాదాలు, ఉత్సవాలు, పండుగలు నగర జీవితంతో ముడిపడి ఉంటాయి. ఉల్లి, అల్లం, వెల్లుల్లి తో చేసిన రుచికరమైన కారపు వంటకాలకు ఈ నగరం ప్రసిద్ధి. సంపన్న నగరాల జాబితాలో జైపూర్ 11 వ స్థానం ఆక్రమించింది.
చిత్రకృప : Ziaur Rahman

10
గుజరాత్ లోని సూరత్ వజ్రాలకు, వస్త్రాలకు ప్రసిద్ధి చెందినది. ప్రపంచ మార్కెట్ లోని అన్ని వజ్రాలు 92% వరకు సూరత్ లోనే కోసి, మెరుగుపట్టుతారు. ఇండియాలో ఎక్కడా లేని ఎంబ్రాయిడరీ యంత్రాలు అత్యధిక సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి. సూరత్ సంపన్న నగరాల జాబితాలో 10 వ స్థానంలో కలదు.
చిత్రకృప : Rahulogy

9
పూణే, మహారాష్ట్ర లో రెండవ అతిపెద్ద నగరం. పూణే అంటే 'పుణ్యాల నిలయం' అని అర్థం. ఇక్కడ మరాఠా రాజు ఛత్రపతి శివాజీ కొంతకాలం నివాసం ఉన్నాడు. రుచికరమైన పావ్ బాజీ, సుప్రసిద్ధ మసాలా పావ్ లాంటి స్థానిక వంటకాలు రుచి చవిచూడాల్సిందే!. ఇండియాలో సంపన్న నగరాల జాబితాలో పూణే 9 వ స్థానంలో కలదు.
చిత్రకృప : Mack Male

08
వైజాగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నగరం. ఆంధ్రప్రదేశ్ లో 'గ్రేటర్ సిటీ' హోదా పొందిన తొలి నగరం (హైదరాబాద్ కంటే ముందే) ఇదే. ప్రాచీన బౌద్ధ స్థలాలతో పాటు ఎన్నో యాత్రా స్థలాలు వైజాగ్ చుట్టుపక్కల ఉన్నాయి. అరకు, బొర్రా కేవ్స్, రిషికేష్ బీచ్, రిషికొండ వాటిలో కొన్ని. సంపన్న నగరాల లిస్ట్ లో వైజాగ్ 8 వ స్థానాన్ని ఆక్రమించింది.
చిత్రకృప : Akshay Sahu

07
ఇండియాలో అహ్మదాబాద్ ను 'మాంచెస్టర్ ఆఫ్ ది ఈస్ట్' గా పిలుస్తారు. ఇది గుజరాత్ లో అమితంగా ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రదేశం. గాంధీ స్థాపించిన ఆశ్రమాలు, ఆలయాలు, మాల్స్ మొదలుగునవి పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి. భారతదేశ సంపన్న నాగరాళాలిస్ట్ లో ఇది 7 వ స్థానాన్ని ఆక్రమించింది.
చిత్రకృప : Emmanuel DYAN

06
చెన్నై, తమిళనాడు రాష్ట్ర రాజధాని. పూర్వం చెన్నై ని తెలుగులో 'చెన్నపట్నం' అని పిలిచేవారట. దీని పూర్వ నామం మద్రాస్. 1953 వరకు ఆంధ్రాకు ఇదే రాజధాని. ఇండియాలో నాల్గవ పెద్ద నగరం ఇది. చెన్నైలో, చుట్టుపక్కల చూడటానికి పర్యాటక స్థలాలు ఉన్నాయి. ఇండియా రిచెస్ట్ సిటీ జాబితాలో 6 వ స్థానంలో చెన్నై కలదు.
చిత్రకృప : Aleksandr Zykov

ఐదవది
హైదరాబాద్ ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రాజధాని. సాంస్కృతిక అస్థిత్వాన్ని కాపాడుకుంటూనే సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతున్న ఒకేఒక్క నగరంగా హైదరాబాద్ నగరాన్ని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల చూడటానికి ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయి. సంపన్న నగరాల లిస్ట్ లో హైదరాబాద్ ఐదవది.
చిత్రకృప : peculiar235

04
బెంగళూరు, కర్ణాటక రాష్ట్ర రాజధాని. 'భారతదేశపు సిలికాన్ వ్యాలీ', 'భారతదేశపు గార్డెన్ ఆఫ్ సిటీ' గా బెంగళూరు ను అభివర్ణిస్తారు. ఇండియాలో ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు ఈ నగరం నుండే ప్రారంభమయ్యాయి. సమకాలీన భారతదేశానికి బెంగళూరు ఒక కొత్త ముఖాన్ని ఇచ్చింది. సంపన్న నగరాల జాబితాలో బెంగళూరుది నాలుగవ స్థానము.
చిత్రకృప : Kailash Naik

03
కోల్కతా, పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని. ఇది ఇండియాకు గుండె వంటిది. భారతదేశ రేవు తీరాలలో కోల్కతా పురాతమైనది. కాళీ మాతా ఆలయం, విక్టోరియా మ్యూజియం, హౌరా బ్రిడ్జి మొదలుగునవి సందర్శన స్థలాలుగా ఉన్నాయి. సంపన్న నగరాల జాబితాలో కోల్కతాది మూడవ స్థానము.
చిత్రకృప : Avrajyoti Mitra

రెండవది
ఢిల్లీ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం. న్యూ ఢిల్లీ నగరం దేశంలోని అతిపెద్ద నగరాలలో ఒకటి మాత్రమే కాదు, వెలుగు జిలుగులతో అధునాతన మరియు సంప్రదాయకత లకు ప్రతీకగా నిలిచి సందర్శకులకు మధురానుభూతిని కలిగిస్తుంది. మొఘల్ కట్టడాలకు ఈ నగరం సుప్రసిద్ధి. భారతదేశ సుసంపన్న నగరాల జాబితాలో ఢిల్లీ రెండవది.
చిత్రకృప : Russ Bowling

మొదటిది
ముంబై ప్రపంచంలో రెండవ అత్యంత జన సామర్థ్యం గల నగరం. ఇది మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని. దీని పూర్వ నామము బొంబాయి. సముద్రతీరంలో సాష్టీ ద్వీపంలో ఉన్నది. ట్రెండ్ కు ట్రెండ్ .. సంప్రదాయానికి సంప్రదాయం ఈ ముంబై నగరం. భారతదేశం ధనిక నగరాల లిస్ట్ లో ముంబై మొదటిది.
చిత్రకృప : Cididity Hat



Click it and Unblock the Notifications











