Search
  • Follow NativePlanet
Share
» »గాంధీ జయంతి సంద‌ర్భంగా కోల్‌కతాలోని ఈ ప్ర‌దేశాల‌ను చుట్టేయండి..

గాంధీ జయంతి సంద‌ర్భంగా కోల్‌కతాలోని ఈ ప్ర‌దేశాల‌ను చుట్టేయండి..

గాంధీ జయంతి సంద‌ర్భంగా కోల్‌కతాలోని ఈ ప్ర‌దేశాల‌ను చుట్టేయండి..

గాంజీ జ‌యంతి రాబోతుంది. ఈ వారాంత‌పు సెలవుల్లో ఎక్క‌డికైనా వెళ్లాల‌ని ప్రణాళిక సిద్ధం చేసుకున్న వారికి కోల్‌క‌త్తాలో స‌మీపంలోని ఈ హిల్‌స్టేష‌న్‌లు స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. బిజి లైఫ్ నుంచి కాస్త విరామం పొందాల‌కునేవారు, ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో కాసేపు సేద‌తీరాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఈ ప్రాంతాల‌ను సంద‌ర్శించాల్సిందే. ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ స‌మ‌యం గ‌డప‌డం ఎంతో ఆహ్ల‌ద‌క‌రంగా ఉంటుంది. మ‌రెందుకాల‌స్యం ఆ ప్ర‌దేశాల‌ను చూసేద్దాం ప‌దండి.

డార్జిలింగ్

డార్జిలింగ్ అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో ఒకటిగా పేరుగాంచింది. హిమాలయ పర్వత ప్రాంతాలలో పేరుగాంచిన పట్టణం వలస సంప్రదాయం, సమకాలీన జీవన కలయిక ఇక్క‌డ ప‌ర్యాట‌కుల‌కు తార‌స‌ప‌డ‌తాయి. ఈ ప్ర‌దేశం చుట్టూ "షాంపైన్ ఆఫ్ టీస్" ఉత్పత్తి చేసే తోటలు మ‌రెన్నో ఉన్నాయి. ఉత్కంఠభరితమైన పర్వత దృశ్యాలు, అడవులు, జలపాతాలు, దారి పక్కనే ఉండే కాటేజీలతో ప్రసిద్ధ "టాయ్ ట్రైన్"లో ప్రయాణించడం డార్జిలింగ్‌లో కొత్త అనుభూతిని చేకూరిస్తాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించబడిన డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (DHR)లో కూడా ప్రయాణించవచ్చు. కాంచనజంగా మంచు శిఖరాల అద్భుతమైన దృశ్యాల‌ను చూడొచ్చు.

Kalimpong

కాలింపాంగ్

కాలింపాంగ్ డార్జిలింగ్ నుండి 70 కిలోమీట‌ర్ల‌ దూరంలో తీస్తా నదికి అభిముఖంగా ఉన్న డియో, డర్పిన్ అనే రెండు కొండలను కలిపే శిఖరంపై ఉంది. కాలింపాంగ్‌లో, పూల‌, ఆర్చిడ్ నర్సరీలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. బౌద్ధ ఆరామాలు, చారిత్రాత్మక చర్చిలు, దేవాలయాలు ఇక్క‌డ ఎన్నో ఉన్నాయి. కలోనియల్ బంగ్లాలు, విచిత్రమైన హోటళ్లతో, కాలింపాంగ్ ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి జ్ఞాపకాలను గుర్తుకుతెస్తుంది.

Kurseong

కుర్సెయోంగ్

కుర్సియోంగ్ విక్టోరియా స్కూల్, డౌ హిల్ స్కూల్, గోథల్స్ మెమోరియల్‌తో సహా పలు ప్రతిష్టాత్మకమైన రెసిడెన్షియల్ పాఠశాలలకు నిలయంగా ఉంది. విస్టేరియా, లేత-నీలం హైడ్రేంజతో అలంకరించబడిన లష్ కొండల అందాల‌ను తిల‌కిస్తూ, ట్రెక్కింగ్ చేయొచ్చు. నాగ్రి స్పర్‌కి ట్రెక్కింగ్, తేయాకు తోటలు, అడవులలోని అద్భుతమైన అందాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసే అవ‌కాశం ల‌భిస్తుంది. ఈగిల్స్ క్రెయిగ్ తీస్తా నది, లోతట్టు ప్రాంతాల ఉత్కంఠభరితమైన దృశ్యాలు కూడా ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. అడవి మార్గం గుండా ప్ర‌యాణం చేసి ఘూమ్‌కి ప్రధాన శిఖరం పైకి చేరుకోవ‌చ్చు.

Gandhi

లావా-లోలేగావ్

లావా, లోలేగావ్ కుగ్రామాలు డార్జిలింగ్‌లోని అత్యంత ప్రసిద్ధ పట్టణ‌మైన కాలింపాంగ్‌కు అతి స‌మీపంలో ఉన్నాయి. ఈ ప్రాంత‌మంతా చుట్టూ పైన్స్‌, ఓక్స్‌, సైప్ర‌స్ అడ‌వులతో చుట్టుముట్ట‌బ‌డి ఉన్నాయి. ఈ రెండు గ్రామాలు ఒక‌దానికికొక‌టి ద‌గ్గ‌ర‌గా ఉంటాయి. అందుకే, ప‌ర్యాట‌కులు రెండు ప్రాంతాల‌ను ఒకేసారి సంద‌ర్శిచేస్తారు. ఈ గ్రామం మ‌ధ్య‌లో బ‌జారు ప్రాంతానికి ఎదురుగా తోట‌ల‌తో నిండిన పెద్ద ప‌చ్చ‌ని స్థ‌లం ఒక‌టి ఉంది. దీనినే ఎకో పార్క్ అంటారు. ఈ పార్క్ అంతా ప‌చ్చ‌ద‌నంతో నిండి ఉంటుంది. ఈ పార్క్‌గుండా ప‌చ్చ‌ద‌నాన్ని ఆస్వాదిస్తూ, ప‌క్షుల కిల‌కిల‌రావాలు వింటూ న‌డ‌క మార్గం సాగించ‌వ‌చ్చు. ఎకో పార్క్ ఎదురుగా ప్లాట్ ల్యాండ్ కూడా ఉంది. ఇక్క‌డ కొన్ని చిన్న టీస్టాల్స్‌, దుకాణాలు అందుబాటులో ఉంటాయి.

రింబిక్

రింబిక్ సింగలీలా నేషనల్ పార్క్ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం. ఇది రమ్మన్ నదికి ఎగువన ఉన్న కొండపై ఉంది. బెంగాల్ సరిహద్దులో ఉన్న చివరి పెద్ద కుగ్రామాలలో ఇది ఒకటి. తరచుగా ఇది సింగలీలా నేషనల్ పార్క్ సందర్శ‌కుల‌కు ట్రెక్కింగ్ చేసే హైకర్లకు కేంద్రంగా పరిగణించబడుతుంది. రింబిక్ శ్రీఖోలా, గురుదుంగ్‌తో సహా అనేక ట్రెక్‌లకు ప్రారంభ స్థానంగా చెప్పుకుంటారు. సాహ‌స ప్రియుల‌కు ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ది. రింబిక్ నుండి డార్జిలింగ్‌కు లోదోమా, జెపి, బిజన్‌బారి మీదుగా ట్రెక్కింగ్‌ని చేయొచ్చు.

More News

    Read more about: west bengal kolkata
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+