Search
  • Follow NativePlanet
Share
» »ప్రయాణంలో అత్యవసర వస్తువులు !

ప్రయాణంలో అత్యవసర వస్తువులు !

ప్రయాణం మొదలు పెడుతున్నాం అంటే ఎన్నో వస్తువులు ప్యాక్ చేసుకుంటాం. అయినప్పటికీ కొన్ని వస్తువులను ఎంతో అవసరమైనవాటిని మరచి పోతూ వుంటాం. ఈ వస్తువులు చిన్నవి అయినప్పటికీ అవసరపడితే, ఆ సమయాలలో ఎంతో అసౌకర్యం కలిగిస్తాయి. ప్రయాణం అంతా ఇక గజి బిజీ గా సాగిపోతుంది. వాటి కొరకు కొత్త ప్రదేశంలో సమయం వెచ్చించి, శ్రమకోర్చి ఎన్నో కష్ట నష్టాలకు కూడా గురి కావలసి వస్తుంది. తీరా వాటిని పొంది ఉపయోగించే సమయానికి కొన్నిమార్లు నష్టం కూడా జరిగిపోతుంది. మరి సాధారణంగా మనం మరచి పోతూ, అసౌకర్యానికి గురయ్యే వస్తువుల జాబితా ఏమిటో చూద్దాం.

ట్రావెల్ అవసరాలు

ప్రయాణంలో అత్యవసర వస్తువులు !

Photo Courtesy: arvindgrover

మెడికల్ కిట్ - పర్యటనలో ఒక మెడికల్ కిట్ మీతో వుంచుకొనడం తప్పని సరి. మీరు వెళ్ళే ప్రతి ప్రదేశంలోనూ మెడికల్ షాపులను లేదా మెడికల్ సౌకర్యాలను ఆశించలేరు. కనుక మార్కెట్ లో కల రెడీ మేడ్ మెడికల్ కిట్ ను ఒక దానిని మీ వద్ద వుంచుకోనండి. లేదా మీ కై మీరే కనీస అవసరాల టాబ్లెట్ లు, చిన్న కాటన్ రోల్, ఫస్ట్ ఎయిడ్ అంటి సెప్టిక్ కరీం, దయోరియా , ఫీవర్ టాబ్లెట్స్, కరీం ఫర్ బుర్న్స్, ఆస్ప్రిన్, బ్యాండ్ ఎయిడ్ , మొదలైన వాటితో ఒక చిన్న కిట్ తయారు చేసికోనండి.

చిన్న బాగ్ - మీ లగేజ్ లేదా బ్యాక్ ప్యాక్ అంతా మీరు ఎక్కడకు వెళితే అక్కడకు తీసుకు వెళ్ళటం కష్టంగా వుంటుంది. కనుక ఈ అవసరాలను ను ఒక చిన్న కాన్ వాస్ బాగ్ లో వేరుగా వుంచండి.

మస్కిటో రెపెల్లంట్ - ఒక చిన్న స్ప్రే లేదా ఒక క్రీం వంటివి దోమల బాధనుండి కొన్ని ప్రదేశాలలో తప్పిస్తాయి.

ఇయర్ ప్లగ్స్ - ట్రావెల్ లో కొన్ని సమయాలలో ఎన్నో రణగొణ ధ్వనులు వినవలసి వస్తుంది. మీకు ఎంతో అసౌకర్యం అనిపిస్తుంది. అటువంటపుడు, ఈ ఇయర్ ప్లగ్ లను చెవుల్లో పెట్టి హాయిగా కోర్చోని ఆనందించండి.

టిష్యూ పేపర్ లు - ఎక్కడైనా మీకు నీరు దొరకనిపరిస్తులలో ఈ టిష్యూ పేపర్ ఉపయోగపడుతుంది. కనుక ఇది తప్పని సరి గాపెట్టుకోనండి.

హెడ్ టార్చ్ - సాధారణమైన టార్చ్ కంటే కూడా హెడ్ టార్చ్ ఉపయోగంగా వుంటుంది. ప్రత్యేకించి కరెంట్ ఎపుడు పోతోందో చెప్పలేని పరిస్తులు కల ఇండియా లో టార్చ్ అవసరం ఎంతో వుంటుంది.

చిన్న పాడ్ లాక్ - మీరు ఎయిర్, ట్రైన్ లేదా బస్సు దేనిలో ట్రావెల్ చేసినప్పటికీ మీ లగేజ్ కు భద్రంగా ఉండేందుకు ఒక చిన్న పాడ్ లాక్ అవసరమనుకుంటే ఒక పొడవాటి చైన్ దగ్గర వుంచుకోనండి. ఇక మీ లగేజ్ సురక్షితం. మీరు భద్రం.

తాడు - మీ ట్రావెల్ బాగ్ లో పొడవాటి కొద్ది మీటర్ల తాడు ఉంచుకోండి. ఈ తాడు, ఎక్కడైనా మీరు గుడ్డలు అరెసుకోవాలన్నా లేక లగేజ్ ని కట్టుకోవలన్నా పనికి వస్తుంది.

ఫోర్క్ లేదా స్పూన్ -కొన్ని ప్రదేశాలలో ఏదైనా తినాలంటే ఫోర్క్ లేదా స్పూన్ వంటివి సౌకర్యంగా వుండి త్వరగా తినటం ముగించవచ్చు. కనుక వివిధ రకాలుగా ఉపయోగపడే ఒక స్పూన్ లేదా ఫోర్క్ ను మీ ట్రావెల్ బాగ్ లో పెట్టటం మరువకండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+