Search
  • Follow NativePlanet
Share
» »Travel Tips: ట్రావెలింగ్‌లో ఆరోగ్యం కోసం పాటించాల్సిన నియ‌మాలివే...

Travel Tips: ట్రావెలింగ్‌లో ఆరోగ్యం కోసం పాటించాల్సిన నియ‌మాలివే...

ట్రిప్‌కి వెళ్లడం అనేది ఎల్ల‌ప్ప‌డూ ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మన ఆహారపు అలవాట్లలో అజాగ్రత్తవ‌ల్ల ఆరోగ్యం దెబ్బ‌తిన‌డంతో పాటు యాత్ర‌ను కూడా పూర్తిగా నాశ‌నం చేస్తుంది. కాబ‌ట్టి, ప్ర‌యాణం చేసేట‌ప్ప‌డు త‌ప్ప‌కుండా కొన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ఆహార‌పు అల‌వాట్లు ఎంతో అవ‌స‌రం. ప్రయాణంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవ‌చ్చో కింది విష‌యాల ద్వారా తెలుసుకోండి.

ప్రయాణం అనేది చాలామందికి థ్రిల్లింగ్ అనుభవం. ఈ సమయంలో కొన్ని కొత్త విషయాలను అన్వేషించే అవకాశాన్ని పొందొచ్చు. ప్రయాణం చేసేట‌ప్ప‌డు మన సమస్యలను మరచిపోయి స‌ర‌దాగా గ‌డుపుతుంటాం. అయితే, ప్రయాణంలో కూడా ఆరోగ్యం గురించి చింతించాల్సిన అవ‌స‌రం లేదు. నిజానికి, చాలామంది ట్రావెల్ చేసేట‌ప్ప‌డు ఆరోగ్యంపై శ్ర‌ద్ధ‌పెట్ట‌రు. దీనికి అతి పెద్ద కారణం అనారోగ్యకరమైన ఆహారపు అల‌వాట్లే. కాబ‌ట్టి ఇలాంటి స‌మ‌యాల్లో ఆహార‌పు అల‌వాట్ల మీద కొంచెం శ్ర‌ద్ఢ‌పెడితే ట్రావెల్ చేసేట‌ప్ప‌డు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ద‌రిచేర‌వు. అవెంటో ఓసారి చూద్దాం.

traveltips

వెంట ఒక వాట‌ర్ బాటిల్‌ను ఉంచుకోవాలి...

ట్రావెలింగ్ చేసేట‌ప్ప‌డు చాలామంది డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతుంటారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం. శ‌రీరానికి స‌రిప‌డిన‌ని నీటిని అందించ‌క‌పోవ‌డ‌మే. శరీరంలో నీటి కొరత అనేక సమస్యలకు దారి తీస్తుంది అనే విష‌యాన్ని త‌ప్ప‌క గుర్తుంచుకోండి. ప్ర‌యాణపు ఆనందాన్ని ఇది పాడు చేస్తుంది. కాబ‌ట్టి ప్ర‌యాణంలో త‌ప్ప‌నిస‌రిగా మీ వెంట వాట‌ర్ బాటిల్‌ను ఉంచుకోండి. ఇంట్లో ఉన్న‌ప్ప‌టికి అంటే ట్రావెల్ చేసేట‌ప్ప‌డు అధికంగా నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. దీనివ‌ల్ల శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గురికాదు.

డ్రింక్స్‌ను దూరంగా ఉంచండి..

ట్రావెలింగ్ చేసేట‌ప్ప‌డు చాలామంది ఎక్కువ డ్రింక్స్ తాగుతుంటారు. చాలాసార్లు చక్కెర, కార్బోనేటేడ్ అధికంగా ఉండే పానీయాలను తాగుతుంటారు. అలాంటి డ్రింక్స్ తాగేందుకు రుచిగా ఉన్న అరోగ్యానికి అస్స‌లు మంచివి కాదు. వాటివ‌ల్ల శ‌రీరంలో బ్లడ్ షుగర్ లెవ‌ల్స్ అధికంగా పెరిగి అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల, అటువంటి పానీయాలను వీలైనంత దూరంగా ఉంచ‌డం మంచిది. అలాంటి పానియాల‌కు బ‌దులు కొబ్బరినీళ్లు, నిమ్మరసం, పండ్లరసాలు వంటివి తాగొచ్చు.

ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తీసుకెళ్లండి...

ప్రయాణంలో అలసట కారణంగా చాలామందికి విప‌రీత‌మై ఆక‌లి వేస్తుంటుంది. దీనివ‌ల్ల చాలామంది ప్ర‌యాణంలో దొరికే ఫుడ్‌నే ఎక్కువ తీసుకుంటుంటారు. జంక్‌ఫుడ్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంత‌మాత్రం మంచిది కాదు. వీటికి బదులుగా కొన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్ మీతోపాటే తీసుకెళ్లేలా ప్ర‌ణాళిక‌లు వేసుకోండి. వీటిద్వారా మీ ఆకలి తీరుతుంది. ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు. ఈ స్నాక్స్‌లో గింజలు, డార్క్ చాక్లెట్ లేదా ఏదైనా పండ్లను తీసుకెళ్లండి.

అల్పాహారం తీసుకోవడం మర్చిపోవద్దు

ప్రయాణ సమయంలో చాలామంది రోజంతా సరదాగా గడిపిన తర్వాత అలసిపోతుంటారు. ఉదయం లేట్‌గా నిద్ర‌లేవ‌డం వ‌ల్ల అల్పాహారం మానేస్తుంటారు. కానీ అలా చేయడం మీ ఆరోగ్యానికి చాలా హానికరం. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల తక్కువ రక్తపోటు, అసిడిటీ, వికారం, విపరీతమైన అలసట వంటి సమస్యలు వ‌స్తాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని క్ర‌మంగా దెబ్బ‌తీస్తాయి. కాబట్టి అల్పాహారం తీసుకోవడం అస్స‌లు మర్చిపోవద్దు.

హెర్బల్ టీ ప్యాకెట్లు ఎంతో ఉత్త‌మం...

ప్రయాణంలో జీర్ణ మరియు రోగనిరోధక వ్యవస్థలు తీవ్రంగా ప్ర‌భావం చూపుతాయి. కాబట్టి ఇలాంటి స‌మ‌యాల్లో మాములు టీ, కాఫీల కంటే హెర్బల్ టీలు వాడ‌టం ఎంతో మంచిది. అందువల్ల, ప్రయాణ సమయంలో కొన్ని హెర్బల్ టీ ప్యాకెట్లను మీతోపాటే తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+