యునెస్కో గుర్తింపు పొందిన గ్వాలియర్, కోజికోడ్...
ప్రపంచ నగర దినోత్సవం రోజున భారతదేశంలోని ప్రముఖ నగరాలైన గ్వాలియర్, కోజికోడ్‌లకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ (UCCN)లో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ విషయాన్ని యునెస్కో స్వయంగా తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. సంగీత విభాగంలో గ్వాలియర్, సాహిత్య విభాగంలో కేరళలోని కోజికోడ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యునెస్కో మొత్తం యాభై ఐదు నగరాలను సెలక్ట్ చేసింది. అందులో భారతదేశానికి చెందిన రెండు నగరాకలు స్థానం లభించింది. అక్టోబర్ 31న ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా యునెస్కో తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో యునెస్కో క్రియటివ్ సిటిస్ మొత్తం సంఖ్య ఇప్పుడు 350 కి చేరింది.

ఈ జాబితాలో 350 నగరాలు...
ఇందులో బుఖారా, (హస్త కళాలు,జానపద కళలు), కాసాబ్లాంకా (మీడియా ఆర్ట్స్), చాంగ్కింగ్ (డిజైన్), ఖాట్మండు (ఫిల్మ్), రియో డి జెనీరో (సాహిత్యం) వంటి నగరాలు ఈ జాబితాలో స్థానం కైవసం చేసుకున్నాయి. ఇప్పటివరకు యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ జాబితాలో 100 కంటే ఎక్కువ దేశాల నుండి 350 నగరాలు ఈ జాబితాలో చేర్చడం జరిగింది. క్రాప్ట్ జానపద కళలు, డిజైన్, ఫిల్మ్, గ్యాస్ట్రోనమీ, సాహిత్యం, మీడియా ఆర్ట్స్, సంగీతం వంటి ఏడు క్రియేటివ్ ఆర్ట్స్‌లో నగరాలను గుర్తిస్తుంది.

సిటి ఆఫ్ లిటరేచర్...
కేరళలోని కోజికోడ్ కేరళ లిటరేచర్ ఫెస్టివల్, అనేక బుక్‌ఫెస్టివల్స్‌కు వేదికగా ఉంది. దీంతో కోజికోడ్‌ను యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ సిటి ఆఫ్ లిటరేచర్‌గా పేర్కొంది. ఈ జాబితాలో చోటు లభించిన మొదటి నగరంగా కోజికోడ్ రికార్డు సృష్టించింది.
కోజికోడ్‌ను కాలికట్ అని కూడా పిలుస్తారు. కోజికోడ్ పురాతన కేరళలోని వాణిజ్య, సాంస్కృతిక, పాక కేంద్రంగా ఉంది. మాజీ పాలకులు, పురాణ జామోరిన్లు నిర్మించిన కోట కారణంగా ఈ జిల్లాకు ఈ పేరువచ్చిందని స్థానికులు చెబుతున్నారు. సాహిత్య రంగంలో యుసిసిఎన్ కు ఎంపికైన ఇంకొన్ని నగరాల్లో రియో డీ జనీరో, తైఫ్, టుకుమ్స్, హోబర్ట్, లాసీ, ఒకాయామా ఉన్నాయి. సీనిరంగంలో యుసిసిఎన్ జాబితాలో ఖాట్మాండు పేరు ఉంది. 2024 జులై 1 నుంచి జులై 5 వరకు పోర్చుగల్‌లోని బాగ్రాలో యుసిసిఎన్ వార్షిక సదస్సు జరగనుంది.

సిటి ఆఫ్ మ్యూజిక్..
ఇక, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ను యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ సిటి ఆఫ్ మ్యూజిక్‌గా ప్రకటించింది. గ్వాలియర్ సంగీత వారసత్వం సుసంపన్నమైనది. అనేక సంగీత ఉత్సవాలకు ఈ నగరం నిలయంగా నిలిచింది. శాస్త్రీయ హీందూస్థానీ సంగీతం, జానపద సంగీతం, భక్తి సంగీతాలకు ఈ ప్రాంతం కేంద్రబిందువుగా ఉంది. లెజెండరీ సంగీత కారుడు ఈ నగరానికి చెందినవారే. సింధియా, ఘరానా వంటి శతాబ్దాలకు ప్రచారం చేసిన నగరంగా ఈ నగరానికి గౌరవం దక్కింది. ఈ ప్రాంతంలోనే తాన్‌సేన్ సమాధి కూడా ఉంది.
ఇక్కడే అతని తాన్‌సేన్ గురువు సమాధి కూడా కలదు. హిందూస్తాని సంగీత విద్వాంసుడు తాన్ సేన్ అక్బర్ ఆస్థానంలో గాయకుడిగా ఉండేవారు. తాన్ సేన్ మేఘ మల్హార్ రాగం పాడితే వర్షం పడేదని చరిత్ర చెబుతోంది. ఈ సమాధి మొగలుల శిల్ప శైలిలో వుంటుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రతి సంవత్సరం నవంబర్ , డిసెంబర్‌లలో ఈ ప్రాంతంలో ప్రతిష్టాత్మక మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు.



Click it and Unblock the Notifications













