Search
  • Follow NativePlanet
Share
» »విచిత్ర దేవాలయాలు - వింత ప్రసాదాలు !

విచిత్ర దేవాలయాలు - వింత ప్రసాదాలు !

నమ్మకం ఉండాలే గానీ ఏదైనా పూజనీయమే ! ఒక బొమ్మ విమానం నుండి, మోటార్ సైకిల్ దేవాలయాల వరకూ, నూడుల్స్ ప్రసాదం నుండి మత్తు కలిగే లిక్కర్ వరకూ టెంపుల్స్, ప్రసాదాలు గాను స్వీకరిస్తాం. ఇండియా లో ఈ రకమైన వింత ప్రసాదాలు, విచిత్ర దేవాలయాలూ ఎన్నో కనపడతాయి. ఈ రకమైన అసాధారణ టెంపుల్స్, వింత ప్రసాదాలూ గురించి కొంత తెలుసుకుందాం.

మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయని లో కల కాల భైరవ్ నాథ్ దేవాలయం లో దేముడికి నైవేద్యంగా పెట్టిన మద్యం సంవత్సరం పొడవునా ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఇక్కడకు వేలాది మంది భక్తులు వచ్చి తమ భక్తిని చాటుకుంటారు. ఈ కాలభైరవ నాథ దేముడు, తమ నగరాన్ని సంరక్షించే దేముడిగా చెపుతారు.

ఫోటో క్రెడిట్ : Xianzi Tan Chinese
కాళి టెంపుల్, కొలకత్తా

కొలకత్తా లోని కాళి మాత టెంపుల్ లో నూడుల్స్ ప్రసాదంగా ఇస్తారు. ఈ టెంపుల్ ను కొలకత్తా లోని తాన్గ్రా ప్రాంతం లో కల చైనా జాతి ప్రజలు నిర్వహిస్తున్నారు. మరొక ఆసక్తికర విషయం ఏమంటే, ఈ చైనీయులు, అంతా చాలావరకూ బౌద్ధులు లేదా క్రిస్తియన్లుగా వుంటారు. కాని ఇచ్చే ప్రసాదం దేవతకు నైవేద్యంగా పెట్టిన నూడుల్స్ లేదా రైస్ గా వుంటుంది.

హవాయి జహాజ్ గురుద్వారా లేదా ఏరోప్లేన్ టెంపుల్, పంజాబ్

ఈ టెంపుల్ లో భక్తులు తమ మొక్కు బడులుగా టాయ్ విమానాలను దేముడికి సమర్పిస్తారు. ఈ భక్తులు తాము, అమెరిక, ఇంగ్లాండ్ వంటి విదేశాలకు వెళ్ళాలంటూ ఈ మొక్కుబడులను సమర్పిస్తారు. ఈ సంత బాబా నిహాల్ సింగ్ గురుద్వారా టెంపుల్ పంజాబ్ లోని డాబా ప్రాంతంలో కలదు . ఈ ఆచారం ఎప్పటినుండి మొదలైందో ఎవరికీ తెలియదు. ఈ గురుద్వారా సమీపంలోని షాపులు మాత్రం ఈ బొమ్మ ఎయిర్ బస్సు , లు బోయింగ్ విమానాలతో అద్భుత బిజినెస్స్ చేస్తున్నాయి.

ఫోటో క్రెడిట్ : Vberger

బ్రహ్మ టెంపుల్, రాజస్తాన్

బ్రహ్మ దేముడికి భూమిపై దేవాలయం లేదని చెపుతారు. కాని బ్రహ్మ దేముడికి ప్రపంచం మొత్తంలో రాజస్తాన్ లోని పుష్కర్ లో కల దేవాలయం ఒకటి కలదు. ఈ టెంపుల్ ను ఒక పెద్ద నాలుగు తలల విగ్రహంతో 14 వ శతాబ్దంలో నిర్మించారు.

ఫోటో క్రెడిట్ : Sentiments777

బులెట్ బాబా టెంపుల్, రాజస్తాన్

రాజస్తాన్ లోని జోద్ పూర్ లో బులెట్ బాబా టెంపుల్ కలదు. ఇక్కడ అసాధారణం అంటే ఈ గుడిలో దేముడికి బదులు ఒక రాయల్ ఎం ఫీల్డ్ బులెట్ పూజించాబడుతుంది. ఈ బులెట్ బాబా కు నైవేద్యంగా లిక్కర్ పెడతారు. ఈ గ్రామ ప్రజలు, ఈ బులెట్ దేముడు తమను రోడ్ ఆక్సిడెంట్ ల నుండి లేదా ఇతర దుర్ఘటన ల నుండి కాపాడుతాడని నమ్ముతారు.

విచిత్ర దేవాలయాలు - వింత ప్రసాదాలు !

ఫోటో క్రెడిట్ : Rupkamal Sarma

బాబా జస్వంత్ సింగ్ వార్ మెమోరియల్

ఇక్కడ అసాధారణ విషయం అంటే, ఒక యుద్ధ స్మారకాన్ని ఒక టెంపుల్ గా పూజిస్తారు. ఇది ఒక వాస్తవ టెంపుల్ కాక పోయినప్పటికీ, మన ఇండియన్ ఆర్మీ కి చెందిన జవాన్లు, ఈ యుద్ధ స్మారకాన్ని పూజిస్తారు. ఈ యుద్ధ స్మారక బాబా కు ప్రతి రోజూ ఉదయం 4.30 గం లకు టీ ని నైవేద్యంగా పెడతారు, బ్రేక్ ఫాస్ట్ ఉ. 9 గం. లకు, డిన్నర్ రాత్రి 7 గం.లకు నైవేద్యంగా పెడతారు. అక్కడ కల బూట్లను ప్రతి రోజూ పోలిష్ చేస్తారు. చివరకు బాబా కొరకు అంటూ ఒక బెడ్ కూడా ఏర్పరుస్తారు. ఈ యుద్ధ స్మారక బాబా 52 సంవత్సరాల కిందట మరణించాడని చెపుతారు. ఈ యుద్ధ స్మారకం 1962 లో జరిగిన ఇండియా - చైనా యుద్ధంలో మరణించిన జస్వంత్ సింగ్ రావట్, మహా వీర్ చక్ర 4 గర్హ్వాల్ రైఫిల్స్ , స్మారకంగా నిర్మించారు. ఈ స్మారకం అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ కు వెళ్ళే మార్గంలో కలదు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+