Search
  • Follow NativePlanet
Share
» »చ‌రిత్ర ప్రేమికుల‌కు ఎంతో ప్ర‌త్యేకం.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మండు...

చ‌రిత్ర ప్రేమికుల‌కు ఎంతో ప్ర‌త్యేకం.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మండు...

భారతదేశం నడిబొడ్డున ఉన్న మధ్యప్రదేశ్ చాలా ప్రత్యేకమైన నగరం.ఇక్క‌డ ప‌ర్యాట‌కులు సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. అయితే, చలికాలంలో ఇక్కడ అనేక ప్రాంతాల వాతావరణం సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. ఇండోర్ నుండి సుమారు 100 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న మాండు ఇక్క‌డి ఒక పురాత‌న‌ నగరం. ఇక్కడికి వ‌చ్చే ప‌ర్యాట‌కులకు కాశ్మీర్‌లో ఉన్న అనుభూతి క‌లుగుతుంది. మండును స్థిరపరచిన ఘనత పర్మార్ రాజులకే దక్కుతుంది. ఇక్క‌డి రాజభవనాలు, గుహలను ప్ర‌త్యేకంగా చూడొచ్చు. మాండును పూర్వం మాండవ్‌గర్ అని పిలిచేవారు. మండులో నిర్మించిన భవనాలు ఇప్పటికీ చాలా వరకు మునుపటిలానే ఉన్నాయి. స‌హ‌జ సౌంద‌ర్యాల‌ను చూడాలనుకునేవారు త‌ప్ప‌కుండా ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించాల్సిందే. రండి మండులో ప్ర‌సిద్ధిచెందిన ఈ ప్ర‌దేశాల గురించి చూద్దాం.

hindolamahal

మండులో సందర్శించవలసిన ప్రదేశాలు

హిందోళ మహల్

ఈ మ‌హాల్ 'T' ఆకారంలో తయారు చేయబడింది. పూర్వం ఇక్కడ దర్బారు నిర్వహించేవారు. అప్ప‌ట్లో రాజు ఈ భవనంలో కూర్చుని ప్రజల ఫిర్యాదులు వినేవాడట‌. ఇక్క‌డి గోడలు 77 డిగ్రీల వంపులో ఉన్నాయి. హిందోలా మహల్ లేదా స్వింగింగ్ ప్యాలెస్ అనేది ఘియాస్-ఉద్-దిన్ పాలనకు చెందిన పురాతన నగరం. మండులోని ఒక పెద్ద సమావేశ మందిరంగా ఈ మ‌హాల్‌కు పేరుంది. దీనికి 'స్వింగింగ్ ప్యాలెస్' అనే పేరు వచ్చింది. దక్కన్‌లోని వరంగల్ కోటలో హిమదోలా మహల్ వంటి నిర్మాణాన్ని పోలీ ఉంటుంది. హిందోళ మహల్, ప్రధాన హాలు మధ్యలో నీటి తొట్టిని కలిగి ఉంటుంది.

హోషాంగ్ షా సమాధి

భారతదేశంలో పాలరాయిని మొదటిసారిగా ఉపయోగించింది తాజ్ మహల్‌లో కాదు, హోషాంగ్ షా సమాధిలో. ఈ సమాధిని 15వ శతాబ్దంలో నిర్మించారు. ఈ సమాధి అద్భుతమైన ఆఫ్ఘన్ కళకు ఒక ప్రత్యేక ఉదాహరణ. ఈ స‌మాధిలోని గోపురాలు, మార్బుల్ లాటిస్ పనితనానికి నిద‌ర్శ‌నం. ఇంకా ఇక్క‌డ పోర్టికోడ్ కోర్టులు, టవర్లు ఉంటాయి.

hoshangshahtomb

ఓడ ప్యాలెస్

దీని నిర్మాణం ఓడలా ఉండటంతో ఈ ప్యాలెస్‌కు జహాన్ అని పేరు పెట్టారు. ఈ ప్యాలెస్‌ను మండుకు చెందిన సుల్తాన్ గియాసుద్దీన్ ఖిల్జీ నిర్మించారు. ఈ ప్యాలెస్‌లో 15,000 మంది మహిళలు నివసించేందుకు స్థ‌లాన్నికూడా నిర్మించారు. ఈ ప్యాలెస్‌కి ఇరువైపులా చెరువులు ఉన్నాయి. ఇవి ఈ ప్యాలెస్ అందాన్ని మ‌రింత రెట్టింపు చేస్తాయి. ఎప్పుడైనా ఈ ప్యాలెస్‌ని సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్యాలెస్ ఎల్ల‌ప్పుడూ తెరిచే ఉంటుంది.

బాగ్ గుహలు

మండులో ఉన్న బాగ్ గుహలు కూడా చాలా అందమైన ప్రదేశాలు. ఈ గుహ‌ల‌ను కుటుంబం లేదా స్నేహితులతో క‌లిసి గ‌డ‌పొచ్చు. ఈ గుహలకు బఘని నది పేరు పెట్టారు. దాని పక్కనే ఈ గుహ నిర్మించబడింది. ఇక్కడ బుద్ధుని విగ్రహాలు మరియు అద్భుతమైన శిల్పాలను చూడొచ్చు. ఈ శిల్పాలు నాల్గవ మరియు ఆరవ శతాబ్దాల మధ్య రాళ్లను కోసి తయారు చేసినట్లు ఇక్క‌డి వారు చెబుతున్నారు.

odapalace

రాణి రూపమతి మహల్

రాణి రూపమతి మహల్ మండులో చూడదగిన ప్రదేశాలలో ఒక‌టి. రాజా బాజ్ బహదూర్ గాయని అయిన రూపమతి అనే యువతిని గాఢంగా ప్రేమించేవాడు. ఈ ప్రేమను ప్రపంచం మొత్తానికి తెలియజేయడానికి, బాజ్ బహదూర్ ఒక ప్యాలెస్‌ని నిర్మించాడు, దానికి రాణి రూపమతి మహల్ అనే పేరు పెట్టాడు. ఈ ప్యాలెస్ మండు ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడింది. ఇక్కడికి చేరుకున్న తర్వాత మండు, నర్మదా నది యొక్క అందమైన దృశ్యాల‌ను వీక్షించొచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+