Search
  • Follow NativePlanet
Share
» »ఈ శ్రావ‌ణ మాసంలో ఓంకారేశ్వర ఆల‌యాన్ని ద‌ర్శించుకోండి..

ఈ శ్రావ‌ణ మాసంలో ఓంకారేశ్వర ఆల‌యాన్ని ద‌ర్శించుకోండి..

ఈ శ్రావ‌ణ మాసంలో ఓంకారేశ్వర ఆల‌యాన్ని ద‌ర్శించుకోండి..

శ్రావ‌ణ‌మాసం చివ‌రి వారం దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ సమయంలో, ప్రతి ఒక్కరూ శివుని భక్తిలో మునిగిపోతారు. రెండు నెలల పాటు కొనసాగే ఈ పవిత్రమైన శ్రావ‌ణ‌ మాసం ఆగస్ట్ 31న ముగియనుంది. శివభక్తులు మాసమంతా శివుని పూజిస్తూ కనిపిస్తారు. దీంతో పాటు కొంత‌మంది భ‌క్తులు ఉపవాస దీక్షలు చేస్తూ భోలేనాథ్‌కు పూజలు చేస్తారు. దేశంలో అనేక శివాలయాలు ఉన్నాయి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. వాటికి వాటి స్వంత ప్రాముఖ్యత ఉంది.

ఈ జ్యోతిర్లింగాలలో ఒకటి మధ్యప్రదేశ్‌లో స్థాపించబడింది, ఇది 12 జ్యోతిర్లింగాలలో నాల్గవ జ్యోతిర్లింగంగా పిలువబడుతుంది. ఓంకారేశ్వర్ మందిరం మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్ ఆలయం కాకుండా మరొక ప్రసిద్ధ ఆలయం. నర్మదా నదిపై ఉన్న ఓంకారేశ్వరాలయం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. శ్రావ‌ణ‌మాసంలో ఈ ప్రసిద్ధ ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్నారా? అయితే ముందుగా ఆ ఆల‌య విశేషాలేంటో తెలుసుకుందాం ప‌దండి.

1

ఓంకారేశ్వర్ నాల్గవ జ్యోతిర్లింగం

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా ప్రాంతంలో నర్మదా నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర్ ఆలయం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఇది మధ్యప్రదేశ్‌లో స్థాపించబడిన మహాకాళేశ్వర్ తర్వాత రాష్ట్రంలోని రెండవ జ్యోతిర్లింగం. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది భ‌క్తులు ఇక్కడికి త‌ర‌లి వస్తుంటారు. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో నర్మదా నది మధ్య ద్వీపంలో ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ నాల్గవ జ్యోతిర్లింగం. ఈ పదం మొదట బ్రహ్మ నోటి నుండి ఉచ్ఛరించబడిందని ఇక్క‌డికి వ‌చ్చేవారు నమ్ముతారు.

శివ-పార్వతి రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పరమశివుడు పార్వతీదేవి సమేతంగా ఇక్కడ కొలువై ఉంటార‌ని, ప్రతి రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటార‌ని ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తులు నమ్ముతారు. ఇది మాత్రమే కాదండోయ్‌, ఇద్దరూ క‌లిసి ఇక్కడ చౌసర్, పాచికల ఆట ఆడుతుంటార‌ని, ఈ ఆల‌యంలో ఉండే ఊయ‌ల ఊగుతుంటార‌ని ఇక్క‌డివారు చెబుతుంటారు. అందుకే ప్ర‌తిఏటా శ్రావ‌ణ‌మాసం, శివరాత్రి మాసంలో ఇక్కడ భక్తుల రద్దీ అత్యంత ఎక్కువగా ఉంటుంది.

2

అందుకే ఈ ఆలయాన్ని ఓంకారేశ్వర్ అని పిలుస్తారు

ఉత్తర భారత వాస్తుశిల్పంలో నిర్మించబడిన ఈ ఐదు అంతస్థుల ఆలయం నర్మదా నది మధ్య మాంధాత, శివపురి ద్వీపాలలో ఉంది. విశేషమేమిటంటే ఈ ద్వీపం ఆకారం ఓం అనే పదాన్ని పోలి ఉంటుంది. అందుకే ఈ దీవిలోని ఆలయాన్ని ఓంకారేశ్వర్ అని పిలుస్తారు. ఓం అనే అక్షరం శివుని ప్రణవనాదానికి సంకేతం కావడం వల్ల, ఈ కొండ ఓం ఆకారంలో ఉండటం వలన భక్తులు ఈ కొండచుట్టు ప్రదక్షిణ చేసి వస్తుంటారు.

అంతేకాకుండా, ఈ ఆల‌యంలో ప్రతిష్టించిన లింగాన్నిఏ మానవుడు చెక్కబడలేదని, శిల్పం చేయలేదని ఇది కేవ‌లం సహజ శివలింగం అని నమ్ముతారు. ఇక్కడే పంచముఖ వినాయకుడి ఆలయం ఉంది. ఇక గర్భగుడిలో చిన్న శివలింగం ఉంది. ఈ శివలింగం చుట్టూ ఎల్లప్పుడూ బొట్లు బొట్లుగా నీరు ఊరుతూ ఉంటుంది. ఇలా గర్భగుడిలో పానవట్టంలో ఊరిన నీటిని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ఇంకా ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడి ఆలయ గదులలో ఒక గదిలో తెల్లటి దుప్పటితో పరిచిన పరుపు, ఒక మంచం ఉంటుంది. అయితే ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఆంజనేయుడు శయన భంగిమలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తుంటాడు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+