Search
  • Follow NativePlanet
Share
» »క్రిస్మ‌స్ సంద‌ర్భంగా కోల్‌క‌త్తాలోని ఈ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించండి...

క్రిస్మ‌స్ సంద‌ర్భంగా కోల్‌క‌త్తాలోని ఈ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించండి...

కోల్‌క‌త్తా అన‌గానే చాలామందికి దుర్గాపూజ మాత్ర‌మే గుర్తుకొస్తుంది. ఇక్క‌డి వారు చిన్న పండగలలో కూడా త‌మ ఆనందాల‌ను వెతుక్కుంటారు. ఈ డిసెంబ‌ర్‌లో క్రిస్మ‌స్ పండుగ ఉంటుంది. కోల్‌క‌త్తాలో కూడా క్రిస్మ‌స్ సంబ‌రాలు అంబ‌రాన్నంటుతాయి. కోల్‌కతా అంతా క్రిస్మ‌స్ సంద‌ర్భంగా దీపాల‌తో వెలిగిపోతుంది. వీటితోపాటు సంగీతం, విందులు, స్కిట్‌లు, మరిన్నింటితో ఆహ్లాదకరమైన సమయాన్ని జరుపుకోవడానికి అనేక ఈవెంట్‌లు ఇక్క‌డ ఉన్నాయి. పండుగ సీజన్‌కు అనుగుణంగా, క్రిస్మస్ స్ఫూర్తిని జరుపుకునే కొన్ని ప్రదేశాలు కోల్‌క‌త్తాలో చాలానే ఉన్నాయి. ఇక్క‌డ ఉండే ప్రతి చ‌ర్చీ క్రిస్మ‌స్ వేడుక‌ల్లో ఎంతో అందంగా ముస్తాబవుతుంది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా సంద‌ర్శించాల్సిన చ‌ర్చీల‌ను ఒక‌సారి చూసేద్దాం...

prinsepghatst-paulscathedralchurch

పార్క్ స్ట్రీట్

క్రిస్మ‌స్ సంద‌ర్భంగా కోల్‌క‌త్తాలో సంద‌ర్శించాల్సిన ప్ర‌దేశాల‌లో పార్క్ స్ట్రీట్ ఎంతో ముఖ్య‌మైన‌ది. కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌ని మీ ప్రయాణ జాబితాలో త‌ప్ప‌క చేర్చండి. క్రిస్మ‌స్‌కు కొద్దిరోజుల ముందే ఇక్క‌డి వీధులు, భవనాలు, పార్కులు, పార్క్ స్ట్రీట్‌లోని ప్రతి మూల విద్యుదీపాల‌తో ఎంతో అందంగా ముస్తాబ‌వుతుంది. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సమయంలో లక్షలాది మంది పర్యాటకులు ఇక్క‌డ‌కు వస్తుంటారు. ఈ పార్క్ స్ట్రీట్‌ని సందర్శించేటప్పుడు త‌ప్ప‌కుండా సౌకర్యవంతమైన బూట్ల‌ను ధరించాలి. ఎందుకంటే ఈ పార్క్ స్ట్రీట్‌లో చాలా దూరం నడవాల్సి ఉంటుంది.

parkstreet ,kolkata

మైదాన్-నందన్ ప్రాంతం

క్రిస్మస్ రోజున కోల్‌క‌త్తా ప్రజలు ఎస్ప్లానేడ్ నుండి పార్క్ స్ట్రీట్ వరకు మైదాన్ వరకు తిరుగుతూనే ఉంటారు. ఉదయం పూట బహిరంగ ప్రదేశాల్లో విహారయాత్రలు, సాయంత్రం ఇక్కడి గడ్డి పొలాల్లో స్నేహితులతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటారు. ఈ మైదానంలో అన్ని వేళ‌లా నిత్యం సంద‌ర్శ‌కుల తాకిడి ఉంటుంది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌లకు కూడా ఈ మైదానం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ మైదానం నుండి కొంచెం ముందుకు వెళితే, నందన్ ప్రాంతాన్ని కూడా సంద‌ర్శించొచ్చు.

ప్రిన్సెప్ ఘాట్

క్రిస్మస్ సంద‌ర్భంగా సంద‌ర్శ‌కుల తాకిడికి దూరంగా ఏదైనా విభిన్నమైన అనుభూతిని పొందాలనుకుంటే మాత్రం కోల్‌క‌త్తాలోని ప్రిన్సెప్ ఘాట్ ఉత్త‌మ‌మైన ప్ర‌దేశమ‌ని చెప్పుకోవాలి. రెండవ హుగ్లీ వంతెనకు దిగువన ఉన్నఈ ప్రిన్సెప్ ఘాట్ ప్రేమికుల‌కు ఎంతో ఇష్ట‌మైన ప్ర‌దేశం. ఇక్కడ గంగా నది ఒడ్డున చల్లని గాలిలో ప్ర‌కృతి అందాల‌ను వీక్షించొచ్చు. అంతే కాకుండా వైరేటీ వంట‌కాల రుచుల‌ను కూడా ఆస్వాదించొచ్చు.

esplanade , kolkata streets

సెయింట్ పాల్స్ కేథడ్రల్ చర్చి

క్రిస్మస్ సమయంలో కోల్‌కతాలోని చర్చి సెయింట్ పాల్స్ కేథడ్రల్ చ‌ర్చిని త‌ప్ప‌కుండా సంద‌ర్శించాలి. ప్రతి సంవత్సరం వేలాది మంది క్రైస్తవులు,ఇతర మతాల ప్రజలు కూడా ఈ చ‌ర్చికి వ‌స్తుంటారు. కోల్‌క‌త్తాలోని అత్యంత ప్ర‌సిద్ధిచెందిన చ‌ర్చీల‌లో ఇది ఒక‌టి. దీనిని 1839 మరియు 1847 మ‌ధ్య‌లో ఇండో గోతిక్ శైలిలో నిర్మించ‌బ‌డ్డారు. క్రిస్మ‌స్ రోజు ఈ చర్చి సంద‌ర్శ‌కుల తాకిడితో ఎంత ర‌ద్దీగా ఉంటుందంటే లోప‌లికి ప్ర‌వేశించేందుకే గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.

బో బ్యారక్స్

కోల్‌క‌త్తాలోని పార్క్ స్ట్రీట్ కాకుండా ఇంకా ఇక్క‌డ బౌ బ్యారక్స్‌లో క్రిస్మస్ నిజమైన పండుగ‌ను ఆస్వాదించొచ్చు. బ్రిటీష్ కాలంలో కోల్‌కతా చాలా కాలం దేశ రాజధానిగా ఉండేది. దీని కారణంగా, ఈ నగరంలో ఇప్ప‌టికీ బ్రిటిష్ సంస్కృతి ప్రభావం ఎక్కువ‌గానే ఉంటుంది. క్రిస్మస్ సమయంలో ఇక్కడ ఓపెన్ ఎయిర్ పార్టీ నిర్వహించబడుతుంది. ఇందులో చాలా రుచికరమైన ఆంగ్ల వంటకాలను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది.

టాప్ రెస్టారెంట్

క్రిస్మస్ సమయంలో కోల్‌కతాను సందర్శిస్తున్నట్లయితే, పార్క్ స్ట్రీట్ ప్రాంతంలోని టాప్ రెస్టారెంట్‌లో డిన్నర్ చేయడం మాత్రం మ‌ర‌వ‌కండి. పార్క్ స్ట్రీట్‌లోని ప్రసిద్ధ రెస్టారెంట్‌లలో టాప్ రెస్టారెంట్ ఒక‌టి. ఇంకా ఇక్క‌డ‌, మొకాంబో హార్డ్ రాక్ కేఫ్ ఫ్లూరిస్ మార్కో పోలో పిట్టర్ క్యాట్ వంటి రెస్టారెంట్‌లు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ఈ రెస్టారెంట్‌లన్నీ క్రిస్మస్ రోజున సంద‌ర్శ‌కుల తాకిడీతో నిండి ఉంటాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+