Search
  • Follow NativePlanet
Share
» » మురిపాల స్నేహం - మరచిన శత్రుత్వం !

మురిపాల స్నేహం - మరచిన శత్రుత్వం !

ఇండియా - పాకిస్తాన్ దేశాలు స్నేహితులు కారు. గట్టిగా చెప్పాలంటే, అసౌకర్యం కల ఇరుగు పొరుగు దేశాలు. అయితే, ఆశ్చర్యం ఏమంటే, 1959 నుండి రెండు దేశాలు కూడా వారి విభేదాలను పక్కన పెట్టి ప్రతి రోజూ కొద్ది సమయం మిత్రత్వం చేస్తాయి. అదే వాగా బోర్డర్ టూరిస్టులు ఆనందించే గొప్ప వేడుక. మరి ఈ వేడుక చూడాలని అనుకుంటున్నారా ఈ రిపబ్లిక్ డే కి అమృత్ సర్ లోని వాగా బోర్డర్ కు వెళ్ళండి. కొద్ది సేపు జరిగే ఈ అద్భుత వేడుకల మిత్రత్వాన్ని కళ్ళారా చూసి ఆనందించండి. వాగా బోర్డర్ అమ్రిత్సర్ కు 30 కి. మీ. ల దూరం మాత్రమే. ఈ సరిహద్దు ప్రదేశంలో ఇండియా లోని అమ్రిత్సర్ పాకిస్తాన్ లోని లాహోర్ లు వేరు చేయబడ్డాయి. మరి ప్రతి రోజూ జరిగే సైనికుల బ్యాండ్ మేళం వేడుకలు చూసేందుకు మనం వాగా బోర్డర్ కు వెళదాం. ఆనందిద్దాం.

ఇండియా - పాకిస్తాన్ సరిహద్దు ప్రవేశం

ఇండియా - పాకిస్తాన్ సరిహద్దు ప్రవేశం

వాగా సరిహద్దు సంవత్సరంలో ఎపుడైనా చూడవచ్చు. ఇక్కడ సైనిక బ్యాండ్ మేళం ప్రతి రోజూ నిర్వహిస్తారు. ఇక్కడ ఒక పార్కింగ్ ఏరియా కూడా కలదు. ఈ పార్కింగ్ ప్రదేశం నుండి సరిహద్దులోకి కొద్ది పాటి నడక మాత్రమే.

టూరిస్ట్ సముదాయాలు

టూరిస్ట్ సముదాయాలు

వేలాది టూరిస్ట్ లు వాగా బోర్డర్ చేరి అక్కడ రెండు దేశాల మధ్య బ్యాండ్ మేళం వేడుకలను చూసి ఆనందిస్తారు. గుంపులు అధికంగా చేరటంచే జాగ్రత్త సుమా, మీ జేబు కూడా కొట్టేసే వారుంటారు

పురుషులకు, మహిళలకు వేరు వేరు మార్గాలు

పురుషులకు, మహిళలకు వేరు వేరు మార్గాలు

పురుషులను , మహిళలను వేరు వేరు మార్గాలలో పంపేందుకు సూచనా బోర్డు లు వ్రాసి పెట్టారు,.

స్పెషల్ సెక్యూరిటీ జోన్

స్పెషల్ సెక్యూరిటీ జోన్

వాగా ప్రదేశం ఇండియా - పాకిస్తాన్ లకు రోడ్డు సరిహద్దు. ఈ ప్రదేశం అనేక భద్రతా ఏర్పాట్లతో, గట్టి ఫెన్సింగ్ తో భద్ర పరచబడి వుంటుంది.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు

పాకిస్తాన్ సైనికుల నుండి ఎటువంటి దాడులూ లేకుండా, ఈ ప్రదేశంలో మన దేశపు బోర్డర్ సెక్యూరిటీ సిబ్బంది, ఇరవై నాల్గు గంటలూ అప్రమత్తంగా కాపలా కాస్తారు

స్వర్ణ జయంతి ద్వార్

స్వర్ణ జయంతి ద్వార్

స్వర్ణ జయంతి ద్వారం సరిగ్గా మీరు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేసించే గేటు.

బోర్డర్ చేరుట

బోర్డర్ చేరుట

గేటు నుండి పాకిస్తాన్ లోకి వెళ్లేందుకు రోడ్డు ఉన్నప్పటికీ, విజిటర్ లను రోడ్డుపై అనుమతించరు. గేటు కు ఇరువైపులా మెట్లు వుంటాయి. ఈ మెట్ల మార్గంలో మాత్రమే ప్రవేశించాలి.

మన దేశం - మన గర్వం !

మన దేశం - మన గర్వం !

సరిగ్గా ఈ ప్రదేశంలోనే మనం మన పొరుగు దేశాలకు మన దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తాం.

వాగా బోర్డర్

వాగా బోర్డర్

ఒకప్పటి బ్రిటిష్ ఇండియా లో ఒక్కటిగా వున్నా రెండు దేశాలు నేడు సరిగ్గా వాగా బోర్డర్ వద్దే ఇండియా మరియు పాకిస్తాన్ దేశాలు వేరు పడతాయి.

బ్యాండ్ మేళం వేడుకలు

బ్యాండ్ మేళం వేడుకలు

ఈ సైనిక బ్యాండ్ మేళం వేడుకల దృశ్యాలను చూసి ఆనందించేందుకు మాత్రమే టూరిస్ట్ లు ఇక్కడకు వస్తారు. సైనికులు ఈ బ్యాండ్ మేళం వాయించే వేడుకలు చూసి ఆనందిస్తారు.

అదే పాకిస్తాన్

అదే పాకిస్తాన్

అవును ఆ కనపడే ప్రదేశం పాకిస్తాన్. వారి ఎంట్రీ గేటు లో మీరు పాకిస్తాన్ దేశపు జాతి పిత అయిన మహమ్మద్ ఆలి జిన్నా చిత్ర పటాన్ని చూడవచ్చు.

పాకిస్తాన్ భూబాగంపై నడక

పాకిస్తాన్ భూబాగంపై నడక

పాకిస్తాన్ గేటు వైపు నడిచేందుకు సందర్శకులను అనుమతిస్తారు. వెళ్ళే వారికి ఇండియా జెండాలు కూడా చేతిలో పెడతారు.

జాతీయ గీతం

జాతీయ గీతం

మన మాతృ భూమిని గౌరవించే జాతీయ గీతాన్ని పర్యాటకులు ఆలపిస్తారు. దీనితో వాగా బోర్డర్ వేడుకలు ముగుస్తాయి.

Photos and Content Courtesy: Ajay M K

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+