దేశంలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి అరుణాచలం. ఇక్కడ ప్రతినెల పౌర్ణమీ నాడు గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు తరలివస్తుంటారు. అయితే, మీరుకూడా అరుణాచలం వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఈ టూర్ ప్యాకేజీ మీ కోసమే. తెలంగాణ టూరిజం హైదరాబాద్ టు అరుణాచలం ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ లో భాగంగా అరుణాచలం సందర్శించొచ్చు. తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ ప్రత్యేక ప్యాకేజీ మొత్తం నాలుగు రోజుల పాటు సాగుతుంది. హైదరాబాద్ సిటీ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. ఆ వివరాలేంటో చూసేద్దాం..
దక్షిణభారతంలో అత్యంత పేరు గాంచిన ప్రాంతం అరుణాచల.. ఈ పుణ్యక్షేత్ర సందర్శనకు నిత్యం వేలాది మంది భక్తులు వెళుతుంటారు. ఏపీ, తెలంగాణ నుంచి వెళ్లే భక్తుల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ అరుణాచలం పరమేశ్వరుడిని జ్యోతిర్లింగా స్వరూపంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణం చేస్తున్నట్లు భక్తులు విశ్వసిస్తారు.

ఈ ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దారిలో మొత్తం 8 లింగాలు ఉంటాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ టూరిజం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 'HYDERABAD - ARUNACHALAM - Telangana Tourism' పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలానికి తీసుకెళ్తుంది. ఇది మొత్తం నాలుగురోజుల టూర్ ప్యాకేజీ. పెద్దలకు రూ. 7500గా టికెట్ ధరను నిర్ణయించారు. చిన్న పిల్లలకు రూ. 6000 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీ మే 20వ తేదీన అందుబాటులో ఉంటుంది.
ఈ టూర్ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి..
తెలంగాణ టూరిజం HYDERABAD - ARUNACHALAM - Telangana Tourism టూరిజం పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది. మే 20వ తేదీ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. అనంతరం జూన్ లో ప్యాకేజీ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. పెద్దలకు రూ. 7500 చెల్లించాలి. పిల్లలకు రూ. 6000గా నిర్ణయించారు.

నాలుగు రోజుల టూర్ వివరాలు ఇలా ఉన్నాయి..
మొదటి రోజు సాయంత్రం 6:30 నుంచి బషీర్ బాగ్ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. రెండో రోజు ఉదయం కాణిపాకం చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉదయం 9 గంటల లోపు కాణిపాకం వినాయకుని దర్శనం పూర్తి అయిన అనంతరం Thiruvanamalaiకి బయల్దేరుతారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి అయిన తర్వాత ఆ రోజు రాత్రికి అరుణాచలంలోనే బస చేయాల్సి ఉంటుంది. మూడో రోజు ఉదయం టిఫిన్ పూర్తిచేసుకున్నాక వేలూరుకు బయలుదేరుతారు.

అక్కడినుంచి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకుందాం. అదే రోజు సాయంత్రం నాలుగు తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు. నాలుగో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా ఇతర సందేహాల కోసం ఈ వెబ్‌సైట్‌ను https://tourism.telangana.gov.in/p సంప్రదించగలరు. ఈ వెబ్‌సైట్ ద్వారానే ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలను కూడా తెలుసుకోవచ్చు.



Click it and Unblock the Notifications












