Search
  • Follow NativePlanet
Share
» » శ్రీ‌లంక వెళ్లాల‌నుకుంటున్నారా? అయితే వీసా అక్క‌ర్లేదు...

శ్రీ‌లంక వెళ్లాల‌నుకుంటున్నారా? అయితే వీసా అక్క‌ర్లేదు...

శ్రీ‌లంక వెళ్లాల‌నుకుంటున్నారా? అయితే వీసా అక్క‌ర్లేదు...

విదేశాల‌కు వెళ్లాంటే విమాన టిక్కెట్లు, హోట‌ల్ బుకింగ్‌, వీటితో పాటు మ‌రీ ముఖ్యంగా వీసా ఎంతో అవసరం. దీంతో ఆ దేశంలోని ప్రాంతాలను చూడొచ్చు. అయితే, ప్ర‌తి వీసాకు ఒక పరిధి ఉంటుంది. అది ఇన్నిరోజులు మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని ఉంటుంది. శ్రీ‌లంక వెళ్లాల‌నుకునే వారికి ఓ శుభ‌వార్త‌.. వీసా అవ‌స‌రం లేకుండానే శ్రీ‌లంక‌ను సంద‌ర్శించొచ్చు. భారతీయులకు ఇక్కడ వీసా ఉచిత ప్రవేశం కల్పించబడింది. వీసా లేకుండా భారత్‌తో పాటు ఏడు దేశాలకు చెందిన ప్రయాణికులను శ్రీలంక సందర్శించేందుకు అనుమతించాలని శ్రీలంక మంత్రివర్గం ప్రతిపాదించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశంలోని పర్యాటక రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగానే శ్రీ‌లంక ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్టు స‌మాచారం.

srilanka

భారతదేశంలోని ఏడు దేశాలకు ఈ అవ‌కాశం..

చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా మరియు థాయ్‌లాండ్‌తో పాటు భారతదేశం నుండి వచ్చే ప్రయాణికులు శ్రీలంకను సందర్శించడానికి ఉచిత వీసా పొందగలరు. ఐలాండ్ దేశమైన శ్రీలంక ప్రధానంగా పర్యాటకరంగంపై ఆధారపడుతోంది. అయితే ఇటీవల కాలంలో కోవిడ్ మహమ్మారి, దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం వంటి వరుస సమస్యలు శ్రీలంకను చుట్టుముట్టాయి. ఈ నేప‌థ్యంలో ప‌ర్యాట‌క రంగానికి ఊపీరి పోయాల‌ని శ్రీ‌లంక ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. శ్రీ‌లంక‌ను సంద‌ర్శించేవారిలో ఎక్కువ‌శాతం మంది భార‌తీయులే ఉండ‌డం విశేషం. అందుకే భార‌త‌దేశం శ్రీ‌లంక సంద‌ర్శ‌న‌లో మొద‌టిస్థానంలో ఉంది. ఆ త‌ర్వాత స్థానంలో చైనా ఉంది. 2019లో ఇక్క‌డ ఈస్ట‌ర్ సండే బాంబు పేలుళ్లు జ‌రిగాయి. ఆ దాడిలో 11మంది భార‌తీయులు మృతిచెందారు. వారితో పాటు 270 మంది కూడా చ‌నిపోయారు. 500మందికి పైగా గాయాప‌డ్డారు. అప్ప‌టినుంచే ఇక్క‌డ ప‌ర్యాట‌కుల ర‌ద్దీ త‌గ్గిపోయింది. ఇక‌, రాబోయే కాలంలో శ్రీలంకకు వచ్చే పర్యాటకుల సంఖ్య సుమారు 50 లక్షలకు పెరుగుతుందనే అంచనా ఉంది.

srilankavisa

శ్రీలంక సందర్శించేందుకు స‌రైన స‌మ‌యం...

ఎప్పుడైనా ఈ ద్వీప దేశాన్ని సందర్శించేలా ప్లాన్ చేసుకోవ‌చ్చు. అయితే డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు శ్రీలంకను సందర్శించడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడింది. కాబ‌ట్టి, పశ్చిమ మరియు దక్షిణ తీరాలను సందర్శించాలనుకునేవారు, పర్వతాల మధ్య కొంతకాలం ఉండాలనుకునేవారు డిసెంబర్ నుండి మార్చి నెల‌ల్లో సంద‌ర్శ‌న‌ను ప్లాన్ చేసుకోవ‌చ్చు. తూర్పు తీరాన్ని చూడటానికి ఏప్రిల్ నుండి మే, సెప్టెంబర్ వరకు ఉత్తమ సమయం. అలాగే, ఈ దేశం వేర్వేరు సమయాల్లో రెండు వేర్వేరు రుతుపవనాలను అందిస్తుంది. కాబట్టి ప‌ర్యాట‌కుల సౌలభ్యం ప్రకారమే ఇక్కడ సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

శ్రీలంకకు ఎలా వెళ్లాలి..

పర్యాటకులు శ్రీలంకకు వెళ్లేందుకు అనేక మార్గాలను ఎంచుకోవ‌చ్చు. కానీ, ఈ అన్నిమార్గాల్లో కంటే ఢిల్లీ నుండి శ్రీలంకకు వెళ్లడం చాలా సులభం. ఢిల్లీ నుండి శ్రీలంకకు చేరుకునేందుకు విమాన మార్గం ద్వారా వెళ్లాలంటే సుమారు 3,580 కిలోమీటర్లు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. స్పైస్ జెట్ వేస్‌తో పాటు ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్ వంటి అనేక విమానయాన సంస్థలు ఇక్క‌డ నిత్యం సేవలు అందిస్తూనే ఉంటాయి. ఢిల్లీ నుండి శ్రీలంక విమాన సమయం ఢిల్లీ-కొలంబో మార్గానికి సుమారు మూడు గంట‌ల నుంచి న‌ల‌భైఐదు నిమిషాలు ఉంటుంది.

More News

    Read more about: india china russia malaysia
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+