Search
  • Follow NativePlanet
Share
» » చిక్క మగళూర్ జలపాతాలు - అద్భుత అందాలు!

చిక్క మగళూర్ జలపాతాలు - అద్భుత అందాలు!

ఉదయమే లేచి కాఫీ తాగుతున్నారంటే, ఆ పుణ్యం చిక్క మగళూర్ ఊరిదని గుర్తించండి. ఇక్కడ కల కాఫీ తోటల వాసనలు మీరు ఈ ప్రదేశం వదిలినా సరే, కొంత సమయం మీకు వాసన అందిస్తూనే వుంటాయి. అద్భుత సూర్యోదయాలను అందించే ఈ ప్రదేశం మీకు అందమైన ప్రకృతి దృశ్యాలను కూడా అందిస్తుంది.

చిక్క మగళూర్ కు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ ప్రదేశాన్ని ఆ నాటి రాజు కుమార్తె కు కట్నంగా ఇచ్చాడు. అందమైన పశ్చిమ కనుమలు కల ఈ కర్ణాటక భూ భాగం వంపులు తిరిగిన రోడ్లు, పొగమంచు తో కప్పబడిన గాలి, గల గల పారే నీటి వాలులు, పచ్చటి ప్రాంతాలు కలిగి వుంటుంది. ఈ ప్రాంత ప్రకృతి దానికి అదే సాటి. ఇక్కడ కల జలపాతాల అందాలు వర్ణించనలవి కాదు. వీటి మూలాలు, చరిత్రలు ఎల్లపుడూ సందిగ్ధంగానే వుంటాయి.

మీ చిక్క మగళూర్ సందర్శనలో దిగువ తెలిపిన జలపాతాలను తప్పక చూసి ఆనందంచండి.

చిక్క మగళూర్ జలపాతాలు

 చిక్క మగళూర్ జలపాతాలు - అద్భుత అందాలు!
చిక్క మగళూర్ జలపాతాలు

చిక్క మగళూర్ జలపాతాలు

జీ పాయింట్ కు వెళ్ళే దోవలో ఇంకనూ రెండు కి. మీ. లలో చేరతామనుకుంటే, అక్కడే మీకు అందమైన జలపాతాలు కనపడతాయి. అక్కడ కల అందమైన పచ్చని చెట్లకు తోడు, పొగమంచు వ్యాపించి వుంటుంది. శాంతి జలపాతాలు చాలా అందమైన ప్రదేశం. తప్పక ఆనందించ దగినవి.

చిక్క మగళూర్ జలపాతాలు

చిక్క మగళూర్ జలపాతాలు

కర్నాటక లోని పశ్చిమ కనుమల ప్రదేశం చాలా అందమైనది. ఒక సారి చూస్తె మరల మరల చూడాలని అనిపిస్తుంది. సిరిమనే జలపాతాల అందాలు ఈ ప్రాంతంలో విభిన్నంగా వుండి ఒక ప్రత్యేకతను కలిగి వుంటాయి. ఈ జలపాతాల ప్రదేశం శ్రింగేరి పుణ్య క్షేత్రం నుండి సుమారు 14 కి. మీ. ల దూరంలో వుంటాయి. వెళ్ళటం తేలికే. శ్రింగేరి నుండి ఆటో లలో వెళ్ళవచ్చు. ఇక్కడ కల ప్రకృతి అందాలు, మీ మెమరీ లో ఎల్లప్పటికి నిలిచి వుంటాయి.

చిక్క మగళూర్ జలపాతాలు

చిక్క మగళూర్ జలపాతాలు

ఎపుడూ కూడా ఎంత పెద్దవైతే అంత బాగా కనపడతాయి. హేబ్బె ఫాల్స్ చిక్క మగళూర్ లోని జలపాతాల అన్నిటి లోకి పెద్దవి. కెమ్మనగుండి ప్రదేశం నుండి సుమారు 10 కి. మీ. ల దూరం లో వుంటాయి. ఇవి సుమారు 168 మీటర్ల ఎత్తునుండి కిందకు పడతాయి. కాఫీ ఎస్టేట్ ల మధ్య లో కల ఈ హేబ్బే జలపాతాలు, రెండు దశలు గా ప్రవహిస్తాయి. అవి దొడ్డ హేబ్బే అంటే పెద్ద జలపాతాలు. మరియు చిక్క హేబ్బే అంటే చిన్న జలపాతాలు. ఇక్కడి ప్రకృతి ఒడిలో మీరు గంటల కొలది గడిపి ఆనందించవచ్చు. సమయం త్వరగా గడిచి పోతుంది. మీరు ఎంతో తాజాగా ఫీల్ అయిపోతారు.

చిక్క మగళూర్ జలపాతాలు

చిక్క మగళూర్ జలపాతాలు

కలహాట్టి జలపాతాలు ఎగిసి పడుతూ వుంటాయి. తరికేరే నది నుండి తెల్లని నీటి ప్రవాహం సుమారు 10 కి. మీ. ల దూరం ప్రయాణిస్తుంది. కెమ్మనగుండి హిల్ స్టేషన్ సమీపం లో కల వీటిని కలహాట్టి లేదా కాళహస్తి జలపాతాలు అంటారు. అందమైన ఈ జలపాతాలు చంద్ర ద్రోణ హిల్ పై నుండి సుమారు 45 మీటర్ల ఎత్తు నుండి కింద పడతాయి. ఈ నీరు వీరభద్రస్వామి టెంపుల్ వద్ద కల అందమైన రాతి ఎనుగులపై పడి ప్రవహిస్తుంది.

చిక్క మగళూర్ జలపాతాలు

చిక్క మగళూర్ జలపాతాలు

ఈ జలపాతాల వద్ద కొద్దిపాటి రుసుము చెల్లించాలి. కిందకు దిగి జలపాతాలలోని నీరు ముట్టుకోవాలంటే సొమ్ము అడుగుతారు. ఇది రూ. 30 గా వుంటుంది. అయినప్పటికీ విలువైనదే. హనుమాన్ గుండి జలపాతాలను సుతన్నబ్బే ఫాల్స్ అని కూడా అంటారు. ఇవి సుమారు వంద మీటర్ల ఎత్తునుండి పడతాయి. స్వచ్చమైన నీరు అంతులేని ఆనందం ఇస్తుంది.

చిక్క మగళూర్ జలపాతాలు

చిక్క మగళూర్ జలపాతాలు

కాదంబి జలపాతాలు చుట్టూ దట్టమైన పచ్చదనం వుంటుంది. కుద్రేముఖ్ నేషనల్ పార్క్ లో కల ఈ కాదంబి జలపాతాలు ప్రకృతి అందించిన ఒక బహుమతి గా వుంటుంది. ఈ జలపాతాలు చుట్టూ కల పచ్చదనంలో కలసి అలసిన పర్యాటకులకు ఆనందాన్ని, తాజా అనుభూతిని కలిగిస్తాయి.

చిక్క మగళూర్ జలపాతాలు

చిక్క మగళూర్ జలపాతాలు

మానిక్యదారా జలపాతాల ప్రదేశం అంతా నీటి బిందువులతో, ముత్యాలు వెదజల్లినట్లు కనపడుతుంది. ఈ జలపాతాల నీటిలో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయని చెపుతారు. మాణిక్య ధారా నీటిని హిందువులు, ముస్లిం లు కూడా పవిత్రంగా భావిస్తారు. ఈ జలపాతాలు వున్న ప్రదేశాన్ని, రెండు పేర్లతో పిలుస్తారు. అవి ...బాబా భూదాన్ గిరి లేదా దత్తాత్రేయ పీటం. అందమైన ఈ కొండ చిక్క మగళూర్ కు సుమారు 40 కి. మీ. ల దూరంలో వుంటుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+