Search
  • Follow NativePlanet
Share
» »winter travel destination : జనవరిలో లాంగ్ వీకెండ్‌కు కేర‌ళ ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం..

winter travel destination : జనవరిలో లాంగ్ వీకెండ్‌కు కేర‌ళ ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం..

జ‌న‌వ‌రిలో సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా లాంగ్ వీకెండ్‌లు వ‌స్తున్నాయి. కాబ‌ట్టి ఉద్యోగుల‌కు ఈ సెల‌వులే. ఈ లాంగ్ వీకెండ్‌లో ఈ వింట‌ర్ సీజ‌న్‌లో ప్ర‌యాణించాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా కేర‌ళ‌ను సంద‌ర్శించాల్సిందే. ఎందుకంటే, ఇక్క‌డి ప్ర‌కృతి ఒడిలో ప్ర‌శాంతంగా సేద‌తీరొచ్చు.కేరళలో చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. సరైన ప్రణాళికతో మీ ప్ర‌యాణాన్ని మ‌రింత ఫ‌ర్‌ఫెక్ట్‌గా చేసుకోవ‌చ్చు. ఈ సీజ‌న్‌లో సంద‌ర్శించేందుకు కేర‌ళ బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవ‌చ్చు.

కొచ్చి నుండి ప్రారంభం..

కేరళను సందర్శించాలంటే ముందుగా కొచ్చి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్క‌డికి రైలు లేదా విమాన మార్గంలో చేరుకోవ‌చ్చు. విశ్రాంతి అనంత‌రం ఇక్కడి ప్రసిద్ధ ప్రదేశాలను వీక్షించేందుకు బ‌య‌లుదేరండి. కేరళలోని చాలా ప్రదేశాలలో బీచ్‌ని చూడగలిగినప్పటికీ, కొచ్చిలో మెరైన్ డ్రైవ్ బీచ్‌ని అస్స‌లు మిస్స‌వ్వ‌ద్దు. వీటితో పాటు సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి మరియు మట్టంచెర్రీ ప్యాలెస్, బోల్గట్టి ప్యాలెస్, వీరన్‌పుజా సరస్సు కూడా ఇక్క‌డ చూడదగిన ప్రదేశాలు.

munnar2

కొచ్చి టు మున్నార్..

మున్నార్ కేరళలోని ప్రసిద్ధిచెందిన హిల్ స్టేషన్. ఇక్కడి ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో ప‌ర్యాట‌కులు కాసేపు విశ్రాంతి తీసుకోవ‌చ్చు. ఇక్క‌డి ప్ర‌కృతి అందాలు చూప‌రుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. కాబట్టి మరుసటి రోజు మున్నార్ చూడటానికి బయలుదేరండి. కొచ్చి నుండి దాదాపు 130 కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తే మున్నార్‌ను చేరుకోవ‌చ్చు. క్యాబ్‌లు లేదా బ‌స్సు సౌక‌ర్యంతో ఇక్క‌డ‌కు చేరుకోవ‌చ్చు.

మున్నార్ సముద్ర మట్టానికి 1,532 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ముందుగా నీల్‌కురింజి నుండి పర్యటనను ప్రారంభించండి. ఇక్కడ 40 కంటే ఎక్కువ రకాల పుష్పాలను చూసే అవ‌కాశం ల‌భిస్తుంది. మున్నార్ దాని తేయాకు తోటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం స్వర్గం కంటే తక్కువేవీ కాదు. వీటితోపాటు ఇక్క‌డికి స‌మీపంలోని ఎరవికులం నేషనల్ పార్క్ కూడా సంద‌ర్శించొచ్చు. ఇక్కడ జంగిల్ సఫారీని కూడా ఆస్వాదించవచ్చు. ఇంకా ఇక్క‌డ లక్కం జలపాతం, రోజ్ గార్డెన్, ఎకో పాయింట్ వంటి అద్భుతమైన ప్రదేశాలున్నాయి.

మున్నార్ నుండి తేక్కడికి..

మున్నార్ తర్వాత తేక్కడిని సంద‌ర్శించేందుకు ప్ర‌ణాళిక వేసుకోండి. మున్నార్ నుండి తేక్కడి సుమారు 90 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి తేక్కడికి బస్సులు అందుబాటులో ఉంటాయి. మొదట తేక్కడిలోని పెరియార్ సరస్సును వీక్షించండి. ఇక్కడ పడవ ప్రయాణాన్ని కూడా ఆస్వాదించొచ్చు. ఇక్కడ రెండవ అత్యంత అందమైన ప్రదేశం పెరియార్ నేషనల్ పార్క్. పెరియార్ నది ఒడ్డున ఉన్న ఈ పార్క్ చిరుతపుల‌ల‌కు నిలయం. అంతేకాకుండా, మంగళ దేవి ఆలయం, కుమిలి, మురికడి కూడా ఇక్కడ సందర్శించాల్సిన ప్ర‌దేశాలు.

thekkady1

తేక్కడి నుండి అలెప్పి..

తేక్కడి సంద‌ర్శ‌న అనంత‌రం అలెప్పీ ప్ర‌యాణానికి బ‌య‌లుదేరండి. ఇక్క‌డి నుంచి క్యాబ్‌లు, బస్సులు అందుబాటులో ఉంటాయి. అలెప్పీని అలప్పుజ అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో హౌస్ బోట్‌లో బస చేసే అవకాశాన్ని అస్స‌లు కోల్పోకండి. ఇక్క‌డి బ్యాక్ వాటర్స్‌ను కూడా త‌ప్ప‌క సందర్శించండి. ఇక్క‌డ ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాల‌లో వెంబనాడ్ సరస్సు ఒక‌టి.

alleppey

అలెప్పి నుండి కోవలం..

అలెప్పీ తర్వాత కోవలం మలుపు ప‌ర్యాట‌కుల‌కు ఎంత‌గానో న‌చ్చుతుంది. అలెప్పి నుండి కోవలం దూరం కేవలం 160 కిలోమీట‌ర్లు మాత్ర‌మే. ఇక్కడికి చేరుకోవడానికి రైలు లేదా బస్సులో ప్రయాణించవచ్చు. త్రివేండ్రం నుండి కోవలం కేవలం 15 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. కోవలం బీచ్‌లు వాటి అందాలకు ప్రసిద్ధిచెందాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+