Search
  • Follow NativePlanet
Share
» »ఏమి కంపురా నాయనా ఫ్లైట్ అంతా !

ఏమి కంపురా నాయనా ఫ్లైట్ అంతా !

నేటి రోజులలో ఎయిర్ ట్రావెల్ అనేది సాధారణమైంది. దేశంలో అయినా, అంతర్జాతీయ ఫ్లైట్ అయినా సరే మనం ఎంతో వేగ వంతమైన సేవలు, భద్రతలు, శుభ్రతలు ఆశిస్తాము. మరి ఈ ఎయిర్ ట్రావెల్ అనేది ఎపుడూ హ్యాపీ గానే ఉంటుందా ? లేదు, అనేక అడ్డంకులు వుంటాయి. ఫ్లైట్ సమయానికి బయలు దేరినా సరే, లేదా ఎయిర్ పోర్ట్ ఖాళీ గా వున్నా సరే మన పక్క ప్రయాణికుడు అసౌకర్యం కలిగిస్తే, ఆనందం అంతా పోగొట్టు కుంటాము.

తోటి ప్రయాణికుడి మహత్యం అంటూ బాధను వెళ్ళ గక్కుతాము. అతను మనతో కొద్ది గంటలు లేదా ఒకటి రెండు రోజులు వున్నా సరే. మరి ఈ ఎయిర్ పాసెంజర్ లలో వరస్ట్ టైపు అంటే ఎలా వుంటారు ? వారు మీ ఎయిర్ ట్రావెల్ ఆనందాలను ఎలా పాడు చేస్తారు అనేది పరిశీలిద్దాం.
వాగుడు కాయలు
ఈ వాగుడు కాయ ప్రయాణికులు ఒక సారి మాట్లాడటం మొదలు పెడితే, మీ పీస్ అఫ్ మైండ్ అంతా పాడు చేస్తారు. వినేవారికి ఏ మాత్రం ఆసక్తి లేక వారి వాగుడు ఒక పెద్ద పనిష్మెంట్ గా వుంటుంది.

ఏడ్చే పసి పిల్లలు
చాలామంది ప్రయాణికులు పిల్లలు పెద్ద పెట్టున ఏడుస్తున్నా పట్టించుకోరు, జర్నీ అంతా ఏడ్చి, వారు మీ ఆనందాలను పాడు చేస్తారు. వీరితో కలసి ఎందుకు వచ్చామా అని పశ్చాతాప పడేలా చేస్తారు.

కుంభకర్ణులు

ఈ టైపు పాసెంజర్ లు జర్నీ మొదలైన వెంటనే గుర్రు పెట్టటం మొదలు పెడతారు. ఇక మీ భుజం వారికి తలగడ గా ఉండాల్సిందే. మీరు మాత్రం వారిని మరోసారి వారి కలల సౌధాల నుండి వెనక్కు తీసుకు రాలేరు.

అధిక లగేజ్
కొంతమంది పాసెంజర్ లు కేబిన్ వద్దకు అధిక లగేజ్ మోసుకు వస్తారు. మీకు లగేజ్ పెట్టుకునేందుకు చోటు లేకుండా కూడా చేస్తారు. మీకంటే ముందే వచ్చి జాగా అంతా ఆక్రమించేస్తారు.

తోటి ప్రయాణికులతో అగచాట్లు !

సీట్ లను వెనక్కి వాల్చి కూర్చునే టైపు
ఈ టైపు పాసెంజర్ లు తమ ఇండ్ల వద్ద ఎలా కూర్చుంటారో తెలియదు గానీ, వీరికి కేటాయించిన సీట్ల లో మాత్రం పూర్తి గా వెనక్కు వాలి లోపలి సీట్ లో కూర్చున్నవారు బయటకు వెళ్ళే అవకాశం లేకుండా చేస్తారు. తోటి ప్రయాణీకులకు అసౌకర్యం చేస్తారు.

చదవాలనే ఉబలాటం, - లైట్ లు వేయటం
ఏదైనా ఎమర్జెన్సీ అయితే, అంగీకరించవచ్చు. లేదంటే, నిద్రించేతపుడు తలపై ఒక లైట్ వేలుగుతూంటే అదొక పనిష్మెంట్ గా వుంటుంది. అవసరం లేకున్నా సరే, లైట్ వేసి ఆనందిస్తారు. అసౌకర్యం కలిగిస్తారు.

హోస్ట్ లేదా హోస్టెస్ వస్తే
బహుశా వీరు మొదటి సారి ట్రావెల్ చేసే వారై వుంటారు. కనీస మర్యాదలు కూడా పాటించారు. వాళ్ళని ఫోటోలు తీస్తారు. వారితో వాగ్వి వాదాలకు దిగుతారు. ఫ్లైట్ నిబంధనలు వ్యతిరేకిస్తారు.

దుర్వాసనల పాసెంజర్ లు
ఇక వీరిని గురించి చెప్పా వలసిన పని లేదు. కంపు కొట్టే పాసెంజర్ పక్కనుంటే, ఇక ప్రయాణం అంతా అసౌకర్యమే.
వాష్ రూమ్ అవసరం

ఫ్లైట్ బయలు దేరక ముందే చాలామంది అనవసరంగా వాష్ రూమ్ ఉపయోగించి అందరకూ అసౌకర్యం చేస్తారు. ప్రశాంత ప్రయాణం పాడుచేస్తారు.

కాలికి పాద రక్షలు లేకుండా
కాలికి చెప్పులు ఇంటిలో ఆనందమే. కాని ప్రయాణంలో ఈ అలవాటు మరొకరి కాలికి తగిలి వరస్ట్ అనిపిస్తుంది.

నిబంధనలు అతిక్రమించుట
కొంతమంది ఫ్లైట్ రూల్స్ అతిక్రమించాటా నికి అలవాటు పడి పక్క పాసెంజర్ లకు అసౌకర్యం కలిగిస్తారు. వారి మొబైల్ సైతం మోగుతూనే, లేదా మాట్లాడుతూనే వుంటుంది.

మరికొంతమంది సీట్ బెల్టులు సరిగ్గా బిగిన్చుకోనక ఇష్టం వచ్చినట్లు పక్కవారిపై ఒరిగిపోతారు. ఫ్లైట్ డిలే అయిందంటే చాలు, ఎయిర్ పోర్ట్ ను వారి ఇల్లులా భావించి తెచ్చుకున్న ఆహారం ఓపెన్ చేసి తింటారు. పరిసరాలు అశుభ్రం చేస్తారు.

కనుక ఈ రకం వరస్ట్ ఎయిర్ లేదా ఇతర పాసెంజర్ ల నుండి రక్షణ పొంది మీ ప్రయాణం సుఖతరం చేసుకొనండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+