Search
  • Follow NativePlanet
Share
» »ఆరు రోజుల్లో కేర‌ళలోని ఈ ప్రాంతాలు చూడొచ్చు..

ఆరు రోజుల్లో కేర‌ళలోని ఈ ప్రాంతాలు చూడొచ్చు..

ఐఆర్‌సిటిసి ప్ర‌యాణికుల‌కు ఓ శుభ‌వార్త‌ను మోసుకొచ్చింది. ప్ర‌శాంత‌త‌కు మారుపేరుగా మారిన కేర‌ళ‌ను ఈ సీజ‌న్‌లో సంద‌ర్శించాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఈ టూర్ ప్యాకేజీ గురించి తెలుసుకోవాల్సిందే. బెంగళూరు నుంచి ఆరు రోజుల పాటు కేర‌ళలోని ప్రాంతాల‌ను సంద‌ర్శించేయొచ్చు. కేర‌ళ అన‌గానే చాలామందికి ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం, ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాలు, జ‌ల‌పాతాలు, అంద‌మైన బీచ్‌లు, ప్ర‌కృతి సౌంద‌ర్యాలతో నిండి ఉండే ప్రాంతాలు గుర్తుకొస్తాయి. మ‌రెందుకాల‌స్యం ఈ టూర్ ప్యాకేజీకి గురించి తెలుసుకోండి.

ఐఆర్‌సిటిసీ అందిస్తోన్న ఈ ట్రైన్ టూర్ ప్యాకేజీ మొత్తం ఆరు రోజులు ఉంటుంది. బెంగళూరు నుంచి ఈ ప్ర‌యాణం కొన‌సాగుతుంది. ఆరు రోజుల‌పాటు కొన‌సాగే ఈ యాత్ర‌లో కేరళలోని మున్నార్, కొచ్చి, అతిరాపల్లి వంటి ప్రాంతాల‌ను చూడొచ్చు. ఈ పర్యటన మొత్తం ఐదు రాత్రులు, ఆరు ప‌గ‌ళ్ల‌తో కొన‌సాగుతోంది. ఇందులో ఎర్నాకుళం, మున్నార్‌లో రెండు రాత్రులు, కొచ్చి ఒక‌రాత్రి, అతిరాపల్లి, త్రిస్సూర్‌లో గ‌డ‌పాల్సి ఉంటుంది. ప్ర‌తి గురువారం బెంగళూరు నుంచి ఈ ప్రత్యేక ట్రైన్ బ‌యలుదేరుతోంది. ఈ ట్రైన్‌లో బెర్త్‌ల సంఖ్య స్లీపర్ క్లాస్ - 06 (స్టాండర్డ్), 3ఏసీ క్లాస్- 6 (కంఫర్ట్) క‌ల‌వు.

kochi ferry ride

ఈ ట్రైన్ టూర్ ప్యాకేజీ ధ‌ర‌ల వివ‌రాలు ఇవే..

కంఫ‌ర్ట్ క్లాస్ సింగల్‌ షేరింగ్ అయితే రూ.35450 చెల్లించాలి. అదే డ‌బుల్ షేరింగ్ అయితే రూ.19480. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.16020 చెల్లించాలి. చైల్డ్ విత్ బెడ్(5-11 years) 13360 రూపాయ‌లు చెల్లించాలి. చైల్డ్ విత్ అవుట్ బెడ్(5-11 years) రూ.10570 ఉంటుంది. స్టాండ‌ర్డ్ క్లాస్ సింగల్‌ షేరింగ్ అయితే రూ.33240 చెల్లించాలి. డబుల్ షేరింగ్ రూ.17280 ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ రూ.13810 చెల్లించాలి. చైల్డ్ విత్ బెడ్(5-11 years) రూ.11150 చెల్లించాల్సిం ఉంటుంది. చైల్డ్ విత్ అవుట్ బెడ్(5-11 years) 8370 రూపాయ‌లు చెల్లించాలి.

ఆరు రోజుల టూర్ వివ‌రాలు ఇవే..

16526 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ మొద‌టి రోజు బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 08:10 గంటలకు బయలుదేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది. రెండో రోజు ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్ చేరుకుంటాం. అక్క‌డ‌ ఉదయం 07:20 గంటలకు రోడ్డు మార్గంలో మున్నార్‌కు బ‌యలుదేరుతాం. హోటల్‌కి చెక్ ఇన్ చేస్తారు. సాయంత్రం టీ మ్యూజియాన్ని సంద‌ర్శించ‌వ‌చ్చు. మున్నార్‌లో రాత్రి బ‌స చేయాల్సి ఉంటుంది. మూడో రోజు ఎర్నాకుళంలోని నేషనల్ పార్క్ లేదా టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ చూడొచ్చు. మధ్యాహ్నం మెట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్, కుండ్లా సరస్సు వీక్షించ‌వ‌చ్చు. మున్నార్ పట్టణంలో సాయంత్రం షాపింగ్ చేయవచ్చు. మున్నార్‌లో రాత్రి బస చేస్తారు.

athirapally waterfalls

నాలుగోరోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఉదయం 08: 00 గంటలకు ఎర్నాకుళం వెళ్లి అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. మధ్యాహ్నం 2.30కి కొచ్చి సంద‌ర్శ‌న‌ ఉంటుంది. మట్టాన్‌చేరీలోని డచ్ ప్యాలెస్, జ్యూ సినాగోగ్‌ను సంద‌ర్శించొచ్చు. అనంత‌రం సెయింట్ ఫ్రాంక్ చర్చ్, ఫోర్ట్ కొచ్చిలో చైనీస్ ఫిషింగ్ నెట్స్ చూడొచ్చు. ఆ తర్వాత షాపింగ్ కోసం మెరైన్ డ్రైవ్, బ్రాడ్‌వేకి వంటివాటికి వెళ్లొచ్చు. షాపింగ్ రాత్రి 8 గంటలకు హోటల్‌ వద్ద డ్రాప్ చేస్తారు. ఐదోరోజు అతిరాపల్లి, వజాచల్ వాటర్ ఫాల్స్ బ‌యలుదేరుతారు.

మధ్యాహ్నం 1.00 గంటకు త్రిసూర్ చేరుకోవాలి. స‌మీపంలోని పారమెక్కావు భగవతి ఆలయం, వడక్కుమ్నాథన్ టెంపుల్‌ను వీక్షించొచ్చు. సాయంత్రం 6.40 గంటలకు త్రిస్సూర్ రైల్వే స్టేషన్‌కి వెళ్లి రాత్రి 07.40 గంటలకు బెంగళూరుకు తిరుగుముఖం ప‌ట్టాలి. ఆరోరోజు బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌కి ఉదయం 06:40 గంటలకు చేరుకుంటారు. దీంతో మీ కేర‌ళ టూర్ ముగుస్తుంది.

More News

    Read more about: irctc kerala tour package
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+