ఘట శిల దేవాలయం రాముని ఆలయం. తుల్జాపూర్ లోని ఈ పురాతన రాతి ఆలయం గురించి ఒక ఆసక్తికరమైన పురాణ కథనం ఉంది రాముడు తన తమ్ముడైన లక్ష్మణునితో ఈ పర్వత ప్రాంతంలో తన భార్య సీతాదేవిని వెతికినట్లుగా నమ్ముతారు. తుల్జా భవాని దేవత ఆయనను సీతను అపహరించి దాచిన లంక వెళ్ళవలసినదిగా తెలిపిందని నమ్ముతారు.అందువల్లనే ఈ దేవాలయానికి ఘట శిల మందిర్ అని పేరు వచ్చింది. ఈ దేవాలయానికి భక్తులు రాముని ప్రార్దించి ఆయన ఆశీస్సులు పొందడానికి వస్తుంటారు. ఈ ప్రార్థన మందిర ప్రాంతపు ప్రశాంత ప్రకృతిని భక్తులు ఎంతో ప్రేమిస్తారు.



Click it and Unblock the Notifications