Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నాందేడ్

నాందేడ్ - నాందేడ్ మరియు ఆధ్యాత్మిక గురువులు

12

నాందేడ్ పట్టణం మహారాష్ట్రలోని మరధ్వాడా ప్రాంతం మధ్య భాగంలో కలదు. ఇటీవలి కాలంలో ఈ పట్టణం డెవలపర్లనుండి పెద్ద పెట్టుబడులు మరియు మతపర సంస్ధలనుండి అత్యుత్తమ సేవలు అందిస్తోంది. పర్యాటకులు ఈ పట్టణాన్ని తప్పక సందర్శించాలి. ఈ పట్టణంలో ప్రసిద్ధి గాంచిన సిక్కుల పుణ్యక్షేత్రం హజూర్ సాహిబ్ కూడా కలదు. ఇది గురుగోబింద్ సింగ్ మరణం తర్వాత నిర్మించబడిన సచ్ ఖండ్ గురుద్వారా ను పోలి ఉంటుంది. మొగలాయిలు భారత ఉపఖండాన్ని పాలించినప్పటినుండి నాందేడ్ ఒక వ్యూహాత్మక ప్రాముఖ్యతను సంతరించుకొంది.. కాలక్రమేణా ఇది ఒక పవిత్ర నగరంగా కూడా విరాజిల్లుతోంది.

నేడు నాందేడ్ అనేక సిక్కు పుణ్యక్షేత్రాలకు, మసీదులకు పేరు గాంచింది. ఇక్కడ కల మతపర ప్రాధాన్యత వేలాది యాత్రికులను, పర్యాటకులను ప్రతిరోజూ ఆకర్షిస్తోంది. అంతేకాదు, నాందేడ్ లో ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాలు కూడా కలవు. సిక్కు మతస్తుల పదవ గురువు అయిన గురు గోబింద సింగ్ నాందేడ్ లో స్ధిరపడ్డారు. నాందేడ్ ను తమ నివాసంగా చేసుకుని తానే సిక్కుల చివరి గురువు అని కూడా ప్రకటించుకున్నారు.. దానితో ఒక పవిత్ర గ్రంధం గురు గ్రంధ్ సాహిబ్ ను స్ధిరపరచారు. దీనిలో సిక్కుల జీవన విధానం ఎలా ఉండాలనేది సూచించారు. నాందేడ్ లో మరికొన్ని మతపర ప్రదేశాలు చెప్పాలంటే కాంధార్ దర్గా, బిహోలి మసీదు గోవంద పార్క్, పట్టణానికి 100 కి.మీ.ల దూరంలో కల ఇసాపూర్ డ్యామ్ వంటివి కూడా చూడవచ్చు. నాందేడ్ లో హిందువుల ప్రసిద్ధ పండుగ అయిన నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుత

నాందేడ్ వీధుల ఆకర్షణ

నాందేడ్ పట్టణ వీధులు కళ కళ లాడుతూ ఉంటాయి. వివిధ రకాల వస్తువులు అమ్మే వారు మరియు మతపర వస్తువుల, బట్టల, ఆభరణాల దుకాణాలు అధిక వ్యాపారాలు చేసుకుంటాయి. ఈ పట్టణంలో సిక్కుల ప్రభావం అంతా అక్కడ విక్రయించే నకిలీ కత్తుల నైపుణ్యతలో కనపడుతుంది. మీరు మరింత ఆసక్తి కనపరిస్తే, అసలు సిసలైన కత్తులను కూడా వాటి వెనుక చిన్నపాటి గాధతో మరింత వ్యయంతో పొందవచ్చు కూడాను. నాందేడ్ వీధులలో అమ్మే సరకులకు బేరసారాలు చేయాలి. వివిధ రకాల ప్రజలు, మతాలు, పండుగలు వంటి వాటితో నాందేడ్ లో నోరూరించే వంటకాలు లేదా ఆహారాలు కూడా దొరుకుతాయి. చీకటి పడితే చాలు, వీధిపక్కల అనేక చిన్న చిన్న ఆహార దుకాణాలు వెలసి నోరూరించే ఆహారాలను అందిస్తాయి.

కోటలు వాటి సందర్శనలు

నాందేడ్ లో పురాతన కోటలు కాంధార్ , ధారూర్ , కుంతలగిరి వంటివి ఎన్నో కలవు . ఈ మరాఠా కోటలన్ని ఫొటోగ్రఫీ చేసేవారికి స్వర్గం కాగా పర్యాటకులకు తమ కాలినడకన వీటిని చూసి ఆనందించేవిగా ఉంటాయి . నాందేడ్ లో ట్రెక్కింగ్ అనుభవాలు అధికం . మీ పర్యటనలు పట్టణంలో కల అనేక సేవలతో చక్కగా ప్రణాళిక చేసుకోవచ్చు . మొదటి సారి పర్యటించేవారు ఒక గైడ్ ను పెట్టుకోవటం మంచిది . అది సమయం ఆదా చేస్తుంది . అధికంగా ప్రదేశాలు చూసేలా కూడా చేస్తుంది . అన్ని ఆకర్షణలు ఈ ప్రాంతంలో చూసినప్పటికి నాందేడ్ చూడటానికి నాలుగు లేదా అయిదు రోజుల సమయంకంటే అనవసరం . ఫొటోగ్రఫీ మరియు ట్రెక్కింగ్ లకు మరో ఒకటి లేదా రెండు రోజులు అదనంగా చేర్చుకోండి .

నాందేడ్ సందర్శనకు శీతాకాలం ఎంతో ఉత్తమమైనది. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు వాతావరణం అనుకూలం. నాందేడ్ లో వేడి మరియు పొడితోకూడిన వేసవులు, తక్కువ నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. శీతాకాలం చలిగానే ఉంటుంది. నాందేడ్ చేరాలంటే, అన్ని రవాణాలు అంటే, రోడ్డు, రైలు, విమానం కలవు. ఇటీవలే, నాందేడ్ స్ధానిక విమానాశ్రయం మరమ్మతులు చేసి ఆధునీకరించారు. ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాలకు వెళ్ళే పెద్ద విమనాలను కూడా నిర్వహించగలదు. నాందేడ్ పట్టణం ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలకు రైలు చే అనుసంధానించబడినది. కనుక రైలు ప్రయాణం సాధారణంగా ఎంపిక చేయవచ్చు.

ఒక్కమాటలో చెప్పాలంటే, నాందేడ్ ఇండియాలోని అరుదైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ వివిధ మతాలు మరియు సంస్కృతులు కలవు. అవి ఇండియాలోని ఇతర ప్రదేశాలలోవలే సహజీవనం చేయవు. ఎవరి మత పరంగా వారు వారి వేడుకలను నిర్వహించుకుంటూ ఉంటారు.

నాందేడ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నాందేడ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నాందేడ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నాందేడ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం నాందేడ్ ముంబై నగరం నుండి 576 కి.మీ.లు దూరంలో కలదు. నేషనల్ హైవే 7 ద్వారా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం ఉత్తర భారతదేశంలోని పర్యాటకులు అతిగా ఇష్టపడేది రైలు ప్రయాణం మాత్రమే. ఇది చాలా సౌకర్యం తూర్పు దిశగా నాగపూర్ నుండి పడమటి నుండి ముంబై నగరం నుండి ఇక్కడకు రైలులో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం ముంబై, పూనే మరియు నాగపూర్ నగరాలనుండి ప్రసిద్ధి చెందిన విమాన సర్వీసులు నడుస్తాయి. ఇటీవలే ఇక్కడి విమానాశ్రయాన్ని ఆదునీకరించారు. ఇపుడది వివిధ సైజుల పెద్ద విమానాలను కూడా దింపుకోగలదు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun